బాలీవుడ్ నటి షెహ్నాజ్ గిల్ మోడల్, గాయని కూడా. ఆమె పలు మ్యూజిక్ వీడియోస్, టెవిజన్ షోస్‌లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. షెహ్నాజ్ కౌర్‌గా కూడా పిలిచే ఆమె పంజాబీ, హిందీ టెలివిజన్ చిత్రాలలో నటిస్తుంది. ఆమె ఆహార ప్రియురాలు కూడా. తరచుగా సోషల్‌మీడియాలో తన పాకనైపుణ్యం గురించి పంచుకుంటుంది. తన ఫిట్‌నెస్ జర్నీ, మెచ్చే హారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్యతల ప్రాముఖ్యత గురించి ఓపెన్‌గా మాట్లాడుతుంటుందామె.ఒక ఇంటర్యూలో తాను ఒకప్పుడూ థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుండేదాన్ని అంటూ తన వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడింది. బరువు తగ్గేందుకు ఉపకరించిన సాత్విక డైట్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అవేంటో చూద్దామా..!.
తన వయసు 67 ఏళ్లని, బరువు ఎప్పుడు 55 నుంచి 52 మధ్యే ఉంటుందని చెప్పుకొచ్చింది. తాను వెల్లి, ఉల్లిలేకుండా ఒక ఏడాది పాటు సాత్విక ఆహారం తీసుకుని మరి బరువు తగ్గానని పేర్కొంది. తన థైరాయిడ్ సమస్య కూడా తగ్గిపోయిందని తెలిపింది. తాను బజ్రా, రాగి రోటీ తప్పనిసరిగా తీసుకుంటానని అంది. ఇక వడపావో వంటివి తింటే గనుక రాత్రి భోజనం మానేస్తానని అంటోంది. వ్యాయామం తప్పనిసరి అని చెప్పుకొచ్చింది. తన బరువు కూడా అదుపులోనే ఉంటుందని ఎప్పుడు 55 నుంచి 52 మధ్యే ఉంటుందని షెహ్నాజ్ పేర్కొంది.
సాత్విక ఆహారం అంటే..
ఆయుర్వేద సూత్రాలతో ముడిపడి ఉన్న ఒక విధమైన శాకహారమే సాత్విక ఆహారం. ఇది స్వచ్ఛత, సమతుల్యత, స్పష్టతను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు, నట్స్, పాల ఉత్పత్తులు ఉంటాయి. కానీ మాంసంలాంటివి ఉండవు. పోషకవంతమైన సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఎక్కువగా ఉంటుంది. కెఫిన్, సుగంధద్రవ్యాలు, ప్రాసెస్ చేయడడిన ఆహారం వంటివి ఉండవు.
అంతేగాదు ఈ ఆహారం మన మూడ్‌ని మంచిగా చేసి చురుకుగా ఉండేలా చేస్తుందని చెబుతోంది. తన భోజనంలో ఎక్కువగా పరాఠాలు, ఆకుపచ్చని చట్నీతో కూడిన పెరుగు ఉంటాయని అంటోంది. దాంతోపాటు కొద్దిమొత్తంలో ఫ్రెష్ వెన్నని తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ఏదైనా ఎలాంటి డైట్ అయినా సరే..బుద్ధిపూర్వకంగా తినడం సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తే..ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా..మంచి ఫలితాలను పొందొచ్చని అంటోంది షెహ్నాజ్.
(చదవండి: అత్యంత అరుదైన వ్యాధి: కంటి రెప్పల్లో పేలు..! ఏకంగా 250కి పైగా..)


