సంపాదన కంటే ప్రశాంతమైన జీవితం మంచిది అనే సూక్తులు వినడానికే బాగుంటాయి. నిజజీవితంలో కాస్త కష్టమే అంత ఈజీ కూడా కాదు. పోనీ అలాంటి సాహసం చేస్తే..సమాజంలో, బంధువుల్లో మన స్థాయి తక్కువుగా ఉంటే మనం తట్టుకున్నా.. మన కుటుంబసభ్యలు అందుకు సిద్ధంగా ఉంటారా అంటే సమాధానం దొరకడం చాలా కష్టం. కానీ నార్వేలో నివశిస్తున్న భారత యువకుడు అదే మంచిదంటూ తాను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా అంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వడమే కాదు..అందర్నీ విపరీతంగా ఆకర్షించింది.
అందులోనూ ఈ ఉరుకుల, పరుగుల జీవితంతో విసిగివేశారిన వారికి ఈ పోస్ట్ ఓ మంచి ఎనర్జిటిక్‌గా కనిపించింది. పైగా ఆయన ఏం చెబుతున్నాడో అంటూ ఆ వీడియోని అంతా ఆస్తక్తిగా చూసేశారు కూడా. ఇంతకీ ఈ నార్వే యుకుడు ఆ ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్ట్‌లో ఏం చెప్పాడంటే..
తన పేరు సచిన్ అని తాను నార్వేలో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను దాదాపు 35 దేశాలకు పైగా పర్యటించాక ఓ విషయాన్ని గ్రహించానానని అంటూ చెప్పుకుంటూ రావడం వీడియోలో చూడొచ్చు. జీవితానికి ఎల్లప్పుడూ డబ్బు అవసరం లేదని, జీవించడానికి కేవలం సమయమే కావలని అన్నాడు. ఇక్కడ నార్వేలో ఉద్యోగం మనిషి విలువను ప్రతిబింబించదని, కేవలం వాళ్లు మనుషులుగా చూడటం అత్యంత ప్రశంసించదగ్గ విషయమని అన్నాడు.
అక్కడ జీతం, హోదా, జెండర్, ఎక్కడ నుంచి వచ్చారు వంటి వాటికి పెద్దగా విలువ ఇవ్వరని అన్నాడు. అక్కడ కుటుంబం, ఆరోగ్యం, అభిరుచులు, పర్యటనలు, మానసిక ప్రశాంతత తదితరాలే ముఖ్యమనే విషయం ఇక్కడకు వచ్చాక తప్పక గుర్తిస్తారని అన్నాడు. కేవలం జీవన నాణ్యత, భద్రత, శాంతి అనేవి ఎంత ముఖ్యమో కచ్చితంగా తెలుస్తుందంటున్నాడు.
అలాగని నార్వే ఏదో గొప్పదని చెప్పుకురావడం తన ఉద్దేశ్యం మాత్రం కాదని, కేవలం నిజంగా మనం కోసం మనం జీవించే జీవితాన్ని ఎంచుకోవడానికి మించిన ప్రశాంతత మరొకటి ఉండదని తెలియజేసేందకేనని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతేగాదు నార్వేలో పని అనేది జీవితంలో ఒక భాగమేనని, అక్కడ ప్రజలు కుటుంబం, పర్యటనలు, అభిరుచులపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పాడు.
అంతేగాదు ఇక్కడ ప్రజలు మనుగడ కోసం జీవించరని, పూర్తి స్థాయిలో జీవితాన్ని ఆస్వాదిస్తారని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు సచిన్. అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు అని కొందరు, అలాంటి మంచి భారతీయ కమ్యూనిటీ ఉంటే కచ్చితంగా మేము అక్కడకి వచ్చేస్తాం అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: IAS Officer Anu Garg: ఎవరీ అను గర్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..)


