చాలామంది విదేశీయలు మన మాతృగడ్డపై మమకారం పెంచుకుని ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ఫిదా అంటూ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. పైగా వాళ్ల సతంతి కూడా ఇక్కడ పెరిగితేనే మంచిదని భావిస్తుండటం విశేషం. ఆ కోవలోకి తాజాగా మరో రష్యన్ తల్లి వచ్చి చేరింది. ఆ పిల్లల తల్లి పోస్ట్‌లో పేర్కొన్న విషయాలు వింటుంటే మన గడ్డపై మమకారం, ప్రేమ రెట్టింపు అవవ్వడమే కాదు భారతీయులుగా గర్వం ఉప్పొంగుతుంది కూడా. మరి ఇంతకీ ఆమె ఆ పోస్ట్‌లో ఏం చెప్పుకొచ్చిందంటే..
బెంగళూరులో నివశిస్తున్న ఈ రష్యన్ మహిళ తాను తన భర్త భారతదేశాన్ని కేవలం పర్యాటక ప్రదేశంగా కాకుండా శాశ్వత నివాసంగా ఎందుకు మార్చుకున్నామో వెల్లడించింది పోస్ట్‌లో. ఈ గడ్డపై ఉంటేనే తన పిల్లలు మంచిగా పెరుగుతారని, ఇది పిల్లల పెంపకానికి అత్యంత అనుకూలమైన వాతావరణమని, విశాల దృక్పథంతో వ్యవహరించడం అలవడుతుందని అటోంది.
ఈ భారతదేశం తమ కుటుంబానికి ఎన్నో నేర్పించిందంటూ ఇలా వివరించింది. వేగాన్ని తగ్గించడం దగ్గర నుంచి తొందరపడకుండా ఉండటం, మాటకు స్పదించడం, శ్రద్ధగా వినడం వంటివి తమ కుటుంబం నేర్చుకుందని తెలిపింది. అలాగే తాము ఇక్కడ భారతీయులను తాము ఎంతగానో ప్రేమిస్తున్నామని, వారి కపటం లేని మనసు, దయ, ప్రతిఫలాప్రేక్ష లేని హెల్పింగ్ నేచర్ మమ్మల్ని ఎంతగానో కట్టిపడేశాయని చెప్పుకొచ్చింది.
ముఖ్యంగా పొరుగువారితో సత్సంబంధాలు చాలా బాగుంటాయని, ఇక్కడ చిరునవ్వే అందరి కామన్‌భాష అని అంటోంది. అందువల్లే తన పిల్లలను ఇక్కడే పెంచాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యానంటోంది ఈ తల్లి. ఈ బహుళ సంస్కృతి, బహుభాషా వాతావరణంలో ఎన్నో నేర్చుకోగలరు, ముఖ్యంగా గౌరవించడం, చిన్న చిన్న వాటికి ప్రశంసించడం వంటివి నేర్చుకుంటారని చెబుతోంది. ఈ వెచ్చని వాతావరణం ఎంజాయ్ చేయడం ఓ థ్రిల్, అలాగే ఏడాది పొడవునా కాలానుగుణ తాజా పండ్లను ఆస్వాదించడంలో ఓ మజా ఉందంటోంది.
అందువల్లే తాము భారతదేశాన్ని తమ నివాస స్థలంగా మార్చుకున్నామంటూ పోస్ట్‌ని ముగించింది. అయితే నెటిజన్లు స్పందిస్తూ..మా భారత్‌కి స్వాగతం, మా మృతృభూమి చాలా అందమైనది, ఎవరినైనా తనలో ఇట్టే కలిపేసుకుంటుంది అని ఆమెకు సాదారంగా ఆహ్వానం పలుకుతూ పోస్టులు పెట్టారు.
(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్‌గా ఎన్‌ఆర్‌ఐ పోస్ట్)


