కరియర్ పీక్‌లో ఉండగా, దాన్ని వదిలేసి, పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని కోట్లకు పడగలెత్తిన ఒక నటి సక్సెస్ స్టోరీ గురించి తెలుసా? ఒకటీ రెండూ కాదు, ఏకంగా 1200 కోట్ల విలువైన కంపెనీకి సారధిగా సత్తా చాటుకుంటున్న ప్రముఖ టీవీ నటి ఆష్కా గొరాడియా విజయ గాథను తెలుసుకుందాం పదండి
నటులు కేవలం నటనలో మాత్రమే కాదు, వ్యాపార రంగంలోనూ రాణించగలరు అని నిరూపించిన నటి ఆష్కా. టీవీ నటిగా మరపురాని పాత్రలు పోషించడమే కాదు స్టార్ట్‌ప్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. రోజువారీ సబ్బుల నుండి గ్లోబల్ బ్యూటీ ప్రొడక్ట్స్ దాకా నైపుణ్యం విస్తరించింది.
2002లో 'అచానక్ 37 సాల్ బాద్' షోతో టీవీలో అడుగుపెట్టింది. తర్వాత 'భాభి', 'తుమ్ బిన్ జౌన్ కహాన్' వంటి షోలలో పనిచేసింది. అయితే 2003లో, ఏక్తా కపూర్ షో 'కుసుమ్'తో ఆమె కరీయర్ మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆమె 'క్యూంకీ సాస్ భీ కభీ బహు థి', 'సిందూర్ తేరే నామ్ కా', 'నాగిన్' పాపులర్ టీవీ సీరియల్స్తో ఎంతో ఆదరణ సంపాదించుకుంది. అష్కా కేవలం కల్పనలో మాత్రమే కాకుండా రియాలిటీ షోలలో కూడా పాల్గొంది. 2019 లో 'దాయన్' ,రియాలిటీ షో 'కిచెన్ ఛాంపియన్ 5' లో కనిపించింది. 2021 లో, ఆమె తన వ్యాపారానికి పూర్తి సమయం కేటాయించడానికి నటనను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది.
రెండు దశాబ్దాల స్టార్‌డమ్‌కు బైబై చెప్పేసింది. కళాశాల స్నేహితులు ప్రియాంక్ షా , అశుతోష్ వలాని తో కలిసి, ఈ ముగ్గురూ 2020 లో ‘రెనీ కాస్మెటిక్స్’ ను ప్రారంభించారు. మిత్రుల వ్యాపార అనుభవానికి ఆష్కార్ తెగువ, ధైర్యం మరింత కలిసి వచ్చాయి. వలం రూ.50 లక్షలతో ప్రారంభమైన డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ రూ. 1,200–1,400 కోట్లకు చేరింది. తరువాతి క్రమంలో ఈ బ్రాండ్ ఆఫ్‌లైన్‌లో కూడా విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాలలో, రెనీ కాస్మెటిక్స్ బ్రాండ్ నుండి పూర్తి స్థాయి సామ్రాజ్యంగా మారింది. లిప్‌స్టిక్‌లు, ఐలైనర్లు, హైలైటర్‌లు ఇలా 200 కంటే ఎక్కువ బ్యూటీ ఉత్పత్తులతో, బ్రాండ్ ఇప్పుడు భారతదేశం అంతటా 650 స్టోర్‌లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నైకా, మింత్రాలో అమ్మకాలు సాగుతున్నాయి.

రెనీ సునామీ
మెరుపు వేగంతో వచ్చిన పెట్టుబడులు కంపెనీనీ రూ. 100 కోట్లను సేకరించింది. 2024 సంవత్సరంలో, రెనీ కాస్మెటిక్స్ కంపెనీ ఎవాల్వెన్స్ ఇండియా మరియు ఎడెల్వీస్ గ్రూప్ నేతృత్వంలో వచ్చిన నిధులతో కంపెనీ రూ. 820 కోట్ల నుండి కూల్ రూ. 1,200 కోట్లకు ఎగిసింది. కాగా భారతదేశంలో అందం మరియు సౌందర్య సాధనాల పరిశ్రమ 2030 నాటికి రూ. 2 లక్షల కోట్లను మించుతుందని అంచనా.

రెనీ అంటే అర్థం ఇదీ!
“రెనీ” అనే పేరుకు ఫ్రెంచ్‌లో “పునర్జన్మ” అని అర్థం. అలా రెనీ ద్వారా ఆష్క తన కరియర్ పునర్ని ర్మించుకుంది. తాను 16 ఏళ్ల వయసులో గుజరాత్ నుండి ముంబైకి వచ్చిన అష్కా ప్రారంభంలో, పేయింగ్ గెస్ట్‌గా అద్దె ఇంట్లో నివసించింది. కానీ 23 ఏళ్ల వయసులో ముంబైలో నా సొంత ఇల్లు కొనుక్కోవడం తన జీవితంలో పెద్ద సక్సెస్ అయి ఒక సందర్బంలో స్వయంగా చెప్పుకుంది ఆష్కా. ఇంతటి అద్భుతమైన విజయంతో నటననుంచి వ్యాపారవేత్తలుగా మారిన అతి కొద్ది మంది వారిలో ఆష్క ముందు వరుసలో ఉంటారు.
ప్రేమ, పెళ్లి
ప్రతి సూపర్ ఉమెన్ వెనుక, ఒక సూపర్ సపోర్టివ్ పార్టనర్ తప్పకుండా ఉంటారు. అలాంటి వారిలో ఆషా భర్త కూడా ఒకరు. 2016లోపరిచయమైన అమెరికన్ వ్యాపారవేత్త బ్రెంట్ గోబుల్‌తో ప్రేమలో పడింది. 2017లో వీరిద్దరూ క్రైస్తవ , హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు.


