పెళ్లి అంటే పందిళ్లు, సందళ్లు తప్పెట్లు.. తాళాలు... తలంబ్రాలు ఉండాలి. అంతేనా కట్నాలు, కానుకలు, ప్రీవెడ్డింగ్ షూట్‌లు ఘనంగా జరగాలి. కానీ ఒక జంట మాత్రం అక్షరాలా గ్యాస్ స్టవ్ సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఎక్కడో తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.
పెళ్లిసందడి, హంగూ ఆర్బాటం, మూడు ముళ్లు లాంటి హడావిడి లేకుండానే బిహార్‌లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న ఘటన నెట్టింట సందడిగా మారింది. అబ్బాయిలంటే ఇష్టంలేకనే తాము ఈ పెళ్లి చేసుకున్నామని ఆ యువతులు ప్రకటించారు. బిహార్‌లోని సుపాల్‌లో, ఇద్దరు యువతులు ప్రత్యేకంగా వివాహ వేడుకను నిర్వహించారు. మగాళ్లపై ఆసక్తిలేకనే ఇద్దరూ ఒకరికొకరు తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఒకరి చేయి మరొకరు పట్టుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. గ్యాస్ స్టవ్‌ను సాక్షిగా ఏడడుగులు వేయడం విశేషం.
ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ క్రిస్మస్ కానుక
In Supaul, two young women held a unique marriage ceremony. Both revealed that they have no interest in boys, so they decided to hold hands and live together. They took seven rounds considering the gas stove as witness.
pic.twitter.com/rwVaMFjxrJ— Ghar Ke Kalesh (@gharkekalesh) December 24, 2025


