సాక్షి, ముంబై: సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులకు క్రిస్మస్ కానుక అందించింది. ఫ్రెషర్లకు ఎంట్రీ-లెవల్ జీతాలను పెంచింది, స్పెషల్ టెక్నాలజీ రోల్స్‌కు ఏడాది రూ. 21 లక్షల దాకా పరిహార ప్యాకేజీలను అందిస్తోంది. AI-ఫస్ట్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి,డిజిటల్‌గా స్థానిక ప్రతిభను ఆకర్షించేందుకు సంస్తలో నియామకాలను పెంచుతుంది.ఇది ఇండియాలో మిగిలిన ఐటీ కంపెనీలతో పోలిస్తే ఇదే అత్యధిక ఎంట్రీ-లెవల్ వేతనంగా నిలిచింది.
ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు ఆఫర్ ఎంత?
మనీకంట్రోల్ అందించిన సమచారం ప్రకారం ఇన్ఫోసిస్ 2025 ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ల కోసం ప్రత్యేక టెక్నాలజీ ఉద్యోగాల ఎంపికకోసం ఆఫ్-క్యాంపస్ నియామక డ్రైవ్‌ను ప్రారంభించనుంది. దీని వార్షిక పరిహారం రూ. 7 లక్షల నుండి రూ. 21 లక్షల వరకు ఉంటుంది.
ఈ ఆఫర్‌లో స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (L1 నుండి L3), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (ట్రైనీ) ఉన్నాయి .అ లాగే కంప్యూటర్ సైన్స్, ఐటీ,ఈఈఈ, ఈసీఈలాంటి ఎంపిక చేసిన సర్క్యూట్ బ్రాంచ్‌ల నుండి BE, BTech, ME, MTech, MCA ,ఇంటిగ్రేటెడ్ MSc గ్రాడ్యుయేట్‌లకు అవకాశం ఉంది. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L3 (ట్రైనీ): రూ. 21 వార్షిక ప్యాకేజీని (ఎల్‌పీఏ) స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L2 (ట్రైనీ): రూ. 16 LPA, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L1 (ట్రైనీ): రూ. 11 LPA, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (ట్రైనీ): రూ. 7 ఎల్‌పీఏ అందిస్తుంది.
AI-ఫస్ట్ విధానంలో భాగంగా క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ నియామకాల్లో సంవత్సరానికి రూ. 21 లక్షల వరకు ప్యాకేజీలతో ఉద్యోగులను ఎంపిక చేస్తామని ఇన్ఫోసిస్ గ్రూప్ CHRO షాజీ మాథ్యూ తెలిపారు.
భారతదేశంలోని అగ్ర ఐటీ సంస్థలలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఎంట్రీ-లెవల్ జీతాలు దశాబ్ద కాలంగా స్తబ్దుగా ఉంది.అయితే, ప్రత్యేక నైపుణ్యాలతో వచ్చే గ్రాడ్యుయేట్ల విషయంలో ఈ ట్రెండ్ మారుతోందంటున్నారు నిపుణులు.


