అందంగా, క్యూట్‌గా కనిపించాలంటే..! | Beauty Tips: Know How To Look Beautiful Without Makeup | Sakshi
Sakshi News home page

Beauty Tips: అందంగా, క్యూట్‌గా కనిపించాలంటే..!

Nov 9 2025 3:10 PM | Updated on Nov 9 2025 4:01 PM

Beauty Tips: Know How To Look Beautiful Without Makeup

ముఖం నీట్‌గా ఉంటే మేకప్‌తో ఆ అందాన్ని మరింత పెంచుకోవచ్చు. కానీ, అదే ముఖం మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌తో నిండిపోతే, ముందు వాటిని తొలగించుకోవడమే సమస్యగా మారుతుంది! అలాంటి వాటికి చెక్‌ పెడుతుంది ఈ ప్రొఫెషనల్‌ కిట్‌. 

మేకప్‌ లేకున్నా ముఖాన్ని అందంగా, క్యూట్‌గా మారుస్తుంది. ఈ కిట్‌లోని ప్రతి టూల్‌ వినియోగదారుల సౌలభ్యం మేరకు రూపొందింది. ఈ కిట్‌లోని టూల్స్‌– గడ్డం, బుగ్గలు, నుదురు, ముక్కుపై నుంచి సులభంగా బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, మొటిమలను తొలగించడానికి సహాయపడతాయి.

స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ మెటీరియల్‌తో ఇవి తయారయ్యాయి. ఈ కిట్‌లో ప్రొఫెషనల్‌ రిమూవర్‌ హెడ్, స్ప్రే కోటింగ్‌ బాడీ ఉంటాయి. ఈ మెటీరియల్‌ ఎటువంటి సెన్సిటివిటీ సమస్యలను కలిగించదు, దాంతో ఇది అన్ని రకాల చర్మాలకు సురక్షితంగా పని చేస్తుంది.టూల్స్‌పై ఉన్న యాంటీ–స్లిప్‌ హ్యాండిల్‌ డిజైన్‌ వల్ల ఉపయోగించడం సులభంగా ఉంటుంది. అలాగే చర్మానికి నష్టం కలగకుండా ఉంటుంది. 

ఈ స్కిన్‌ కేర్‌ టూల్స్‌ సురక్షితంగా, శుభ్రంగా, సౌకర్యవంతంగా ఉంచుకోవడానికి పోర్టబుల్‌ టిన్‌ కేస్‌ కూడా లభిస్తాయి. అయితే ఈ టూల్స్‌ను ఉపయోగించే ముందు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. అయితే మొటిమ పూర్తిగా రాకుండానే ఈ రిమూవర్‌ టూల్‌ ఉపయోగించకూడదు. అలా చేస్తే చర్మానికి గాయాలు లేదా మచ్చలు ఏర్పడవచ్చు. ఈ ఉత్పత్తిని పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవాలి. మొత్తానికి ఈ కిట్‌తో ముఖాన్ని శుభ్రంగా, మృదువుగా ఉంచుకోవచ్చు.

డార్క్‌నెస్‌కి చెక్‌
చాలామంది స్త్రీలకు మోచేతులు, మోకాళ్లు, అండర్‌ ఆర్మ్స్‌ వంటివి డార్క్‌ స్పాట్స్‌తో నల్లగా, పైకి చూపడానికి ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటి వాటికి చెక్‌ పెట్టాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!  పిగ్మంటేషన్‌కి బెస్ట్‌ రెమిడీ ఆలుగడ్డ అంటున్నారు నిపుణులు. ఆలుగడ్డ తొక్క తీసి, ఆలూని గుండ్రంగా కట్‌ చేసుకుని నల్లగా ఉన్న చోట రుద్దుకుంటే సరిపోతుంది. 

ఇంకా మంచి ఫలితం కావాలంటే ఆ చక్రాలను నిమ్మరసంలో ముంచి సమస్య ఉన్న చోట రబ్‌ చేసుకోవాలి. లేదంటే పసుపు, పాలు కలిపిన మిశ్రమంలో కూడా ఆ ముక్కలను ముంచి రుద్దుకోవచ్చు. ఆలుగడ్డలో నేచురల్‌ ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. దాంతో ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే– చర్మానికి ఉన్న నలుపుదనం తగ్గి, ప్రత్యేకమైన మెరుపు వస్తుంది. 

(చదవండి: Alzheimers Risk: మంచి కొలెస్ట్రాల్‌తో తగ్గే అల్జైమర్స్‌ ముప్పు!)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement