శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ ఎలాగంటే..! | To book a spot for Sabarimala darshan Guide | Sakshi
Sakshi News home page

శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ ఎలాగంటే..!

Nov 9 2025 2:49 PM | Updated on Nov 9 2025 3:49 PM

To book a spot for Sabarimala darshan Guide

శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ సౌకర్యం ఉంది, కానీ ఇది పరిమిత సంఖ్యలో ఉంటుంది. భక్తులు దేవస్వం బోర్డు గుర్తించిన కేంద్రాలలో తమ గుర్తింపు కార్డు చూపించి స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఈ స్పాట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి. రోజుకు గరిష్టంగా దాదాపు 20 వేల మంది స్పాట్‌ బుకింగ్‌ ద్వారా దర్శనానికి నమోదు చేసుకోవచ్చు. 

బుకింగ్‌ కేంద్రాల వివరాలు..

ఎరుమేలి (Erumeli)
అయ్యప్ప భక్తుల యాత్రలో ఆచారప్రాముఖ్యమున్న పవిత్ర స్థలం.

వండిపెరియార్ – పుల్మేడు (Vandiperiyar - Pulmedu)
నిర్దిష్ట మార్గం ద్వారా దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం ఏర్పాటు.

నీలక్కల్ (Nilakkal)
యాత్రికుల ప్రధాన విశ్రాంతి స్థలం, దర్శనానికి ప్రవేశించే మొదటి దశ.

పంబ (Pamba)
ఆలయానికి ఎక్కే మెట్లు ప్రారంభమయ్యే ముందు ఉన్న చివరి యాత్రా కేంద్రం.

గుర్తించుకోవాల్సినవి..
రోజుకు పరిమత స్థానాలు: కేవలం 20,000 స్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.
గుర్తింపు కార్డు: చెల్లుబాలు అయ్యే గుర్తింపు పత్రం(ఆధార్ కార్డ్ తప్పనిసరి)
బుకింగ్ సమయం: ఆన్‌లైన్ స్లాట్ల రోజువారీ కోటా ఫుల్‌ అయిన తర్వాత మాత్రమే స్పాట్ బుకింగ్ ప్రారంభమవుతుంది.

(చదవండి: ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి కె. జయకుమార్)


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement