అలీఘర్: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) క్యాంపస్‌లో రక్తం చిందింది. యూనివర్సిటీ పరిధిలోని ఏబీకే హైస్కూల్‌లో కంప్యూటర్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న రావు డానిష్ అలీ (డానిష్ రావు)ని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. రాత్రి 9 గంటల సమయంలో మౌలానా ఆజాద్ లైబ్రరీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
డానిష్ అలీ తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి వాకిగ్‌కు వెళుతూ లైబ్రరీ క్యాంటీన్ సమీపానికి చేరుకోగానే, స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వారిని అడ్డుకున్నారు. వారిలో ఒకరు డానిష్ అలీని ఉద్దేశించి, ‘నీకు నేను ఎవరో తెలియదు, ఇప్పుడు నువ్వు నన్ను గుర్తుపడతావు’ అంటూ అతని తలపై పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. అలీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దుండగులు అక్కడి నుండి పారిపోయారు.
తీవ్రంగా గాయపడిన అలీని వెంటనే జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పీ)నీరజ్ జాడోన్ ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మహనీయుల భారీ స్మృతి చిహ్నం.. ప్రారంభించిన ప్రధాని మోదీ


