లక్నో: భారత రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా నేడు (గురువారం) దేశానికి ఒక అద్భుతమైన కానుక లభించింది. యూపీలోని లక్నో నగరంలో సుమారు 65 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, రూ. 230 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘రాష్ట్రీయ ప్రేరణా స్థల్’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ స్మారక చిహ్నంలో ప్రధాన ఆకర్షణ.. ఆకాశాన్ని తాకేలా నిలుచున్న మూడు భారీ కాంస్య విగ్రహాలు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిల 65 అడుగుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. ఈ విగ్రహాలు భారతదేశ రాజకీయ విలువలకు, నిస్వార్థ ప్రజా సేవకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తూ, సందర్శకులలో దేశభక్తిని పెంపొందిస్తున్నాయి.
#WATCH | Lucknow, Uttar Pradesh: Prime Minister Narendra Modi inaugurates Rashtra Prerna Sthal
The complex features 65-feet-high bronze statues of Dr. Syama Prasad Mookerjee, Pandit Deendayal Upadhyaya, and Former Prime Minister Atal Bihari Vajpayee, symbolising their seminal… pic.twitter.com/FqZvxkeFT7— ANI (@ANI) December 25, 2025
సుమారు 98 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అత్యంత కళాత్మకంగా కమలం ఆకారంలో ఈ మ్యూజియాన్ని రూపొందించారు. ఇందులో అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించారు. తద్వారా ఈ నాయకుల జీవిత ప్రయాణాన్ని, వారు దేశం కోసం చేసిన పోరాటాలను సందర్శకులు కళ్లకు కట్టినట్లు చూడవచ్చు. ఇది కేవలం స్మారక చిహ్నంగానే కాకుండా ఒక గొప్ప విద్యా కేంద్రంగా కూడా రూపొందింది.
ఇది కూడా చదవండి: చారిత్రాత్మక విజయం : మార్చి 31 నాటికి నక్సలిజం అంతం


