పంజాబ్‌లో లూథియానాలో మాజీ కబడ్డీ ఆటగాడిని కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు మీ అబ్బాయి చంపేశాం..వెళ్లి అతని మృతదేహాన్ని తెచ్చుకోండి అంటూ నేరుగా అతని ఇంటికి వెళ్లి చెప్పడం తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది.సోమవారం ఈ హత్య జరిగింది.
మాజీ కబడ్డీ స్టార్ గగన్‌దీప్ సింగ్ అలియాస్ గగ్నా మనుకే గ్రామంలో తన స్నేహితుడు ఏకమ్‌తో కలసి ఉండగా దారుణ హత్యకు గురయ్యాడు. మోటార్‌బైక్‌లపై వచ్చిన దుండగులు గగ్నాపై పై కాల్పులు జరిపారు. అనంతరం అతని మృతదేహాన్ని సమీపంలోని పొలంలో పడేశారు. మీ వాడిని చంపేశాం.. డెడ్‌బాడీ తెచ్చుకోవండి కుటుంబ సభ్యులతో స్వయంగా చెప్పారు. దీనిపై మృతుడి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అరాచకం తప్ప మరొకటి కాదని బాధితుడి తండ్రి గుర్దీప్ సింగ్ బగ్గా (60) కన్నీటి పర్యంతమయ్యారు. లూథియానా రూరల్ ఎస్ఎస్‌పి అంకుర్ గుప్తా ప్రకారం, గగన్‌దీప్‌కు కనీసం మూడు బుల్లెట్ గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు పేర్కొన్న ఐదుగురు నిందితులలో ఒకరిని అరెస్టు చేశారు.
హత్యకు కారణం
బగ్గా అందిందించిన వివరాల ప్రకారం నిందితులకు, మృతుడు గగ్నా స్నేహితుడు ఏకమ్‌తో పాత కక్షలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో వీరి మధ్య సయెధ్య కుదిర్చేందుకు, రాజీకి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోనే నిందితులు అతన్ని కాల్చి చంపారు.కాగా గగ్నా ఒక రైస్ షెల్లర్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాధితుడి భార్య నవప్రీత్ కౌర్ మాట్లాడుతూ, గగన్‌దీప్, ఏకమ్ కలిసి కబడ్డీ ఆడేవారని, అయితే నిందితులకు నచ్చలేదని చెప్పింది. మరోవైపు డిసెంబర్ 31న, నిందితులు ఏకమ్‌పై కత్తులతో దాడి చేశారు. ఈ రోజు నా భర్తను కాల్చి చంపారని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
ఇదీ చదవండి: గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్
గ్రామ క్షక్షలతోనే ఈ హత్య జరిగిందని భావిస్తున్నామని లూథియానా రేంజ్ డిఐజి సతీందర్ సింగ్ తెలిపారు. ఇప్పటివరకు కబడ్డీకి సంబంధించిన వివాదమేమీ వెలుగులోకి రాలేదన్నారు. ప్రధాన నిందితుడిని గుర్సేవక్ సింగ్ అలియాస్ మోటుగా గుర్తించారు. ఉదయం గ్రామస్థాయి వైరం కారణంగా రెండు వర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం, గుర్సేవక్ సింగ్ అలియాస్ మోటు తన అనుచరులతో కలిసి తిరిగి వచ్చి కాల్పులు జరిపాడు. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. కుటుంబ సభ్యులు పేర్కొన్న నిందితులలో ఒకరిని ఇప్పటికే అరెస్టు చేయగా, మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామ డీఐజీ తెలిపారు.
ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
మనూకేకు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాగ్రాన్ ఎమ్మెల్యే సర్వజిత్ కౌర్ మనుకే మీడియాతో మాట్లాడుతూ గగన్‌దీప్ గ్రామంలోని పేద యువకులను కబడ్డీ ఆడటానికి ప్రోత్సహించేవాడని చెప్పారు. నిందితుల లక్ష్యం ఏకామ్..కానీ గగన్‌దీప్ అతనికి అండగా నిలబడటంతో వారు అతడిని కాల్చి చంపారు. పంజాబీ యువత దారి తప్పుతోందని, గూండాయిజం వల్ల శవాలు తప్ప మరేమీ మిగలదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మూడు రోజుల్లోనే పంజాబ్‌లోఇది మూడో దారుణ హత్య ఇది.
ఇదీ చదవండి: 5th ఫెయిల్, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యం


