రాహుల్‌ గాందీని కాల్చి పారేస్తాం  | Man detained in Kota for threatening to shoot Rahul Gandhi and other MPs | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాందీని కాల్చి పారేస్తాం 

Feb 20 2026 4:32 AM | Updated on Feb 20 2026 9:09 AM

Man detained in Kota for threatening to shoot Rahul Gandhi and other MPs

మరో 25 మంది కాంగ్రెస్‌ ఎంపీలను హత్య చేస్తాం  

బెదిరింపులకు దిగిన కర్ణీ సేన 

అధికార ప్రతినిధి అరెస్ట్‌ 

జైపూర్‌:  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాందీతోపాటు ఆ పారీ్టకి చెందిన మరో 25 మంది ఎంపీలను కాల్చి చంపుతామంటూ బెదిరింపు వీడియో విడుదల చేసిన ఓ వ్యక్తిని రాజస్తాన్‌లోని కోటా పట్టణంలో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడిని రాజ్‌ సింగ్‌గా గుర్తించారు. రాజ్‌ సింగ్‌ కర్ణీ సేనకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు.

 ఇటీవల బడ్జెట్‌ సమావేశాల్లో 25 మంది కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను దూషించడం బీజేపీతోపాట కర్ణీ సేనను తీవ్ర ఆగ్రహానికి గురిచేసిందన్నాడు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే ఆయా ఎంపీల ఇళ్లల్లోకి చొరబడి ధ్వంసం చేస్తామని హెచ్చరించాడు. రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకే స్పీకర్‌ ఓం బిర్లాను అసభ్య పదజాలంతో దూషించారని రాజ్‌ సింగ్‌ ఆరోపించాడు. 

ఓం బిర్లా పట్ల మళ్లీ అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తుపాకీలో కాల్చేస్తామని వీడియోలో తేల్చిచెప్పాడు. 25 మంది ఎంపీలను 24 గంటల్లోగా అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశాడు. లేకపోతే ఒకరి తర్వాత ఒకరిని కాల్చిపారేస్తామని పేర్కొన్నారు. ఈ వీడియోలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాజ్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement