భల్లూకంతో భీకర పోరు  | Odisha Woman Fights Off Bear With Axe To Save Husband, Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

భల్లూకంతో భీకర పోరు 

Feb 20 2026 4:16 AM | Updated on Feb 20 2026 1:48 PM

Odisha Woman Fights Off Bear With Axe To Save Husband

గొడ్డలితో దాడి చేసి భర్తను కాపాడుకున్న ధీర వనిత 

బరిపడ(ఒడిశా): ఆనాడు భర్త ప్రాణాలు దక్కించుకునేందుకు యమరాజుతో వాగ్వాదానికి దిగి భర్తను సాధించిన సావిత్ర గాథను వినే ఉంటారు. ఆమె తన బుద్ధిబలంతో భర్తను కాపాడుకుంటే ఈనాడు ఒడిశాలో ఒక ధీరవనిత సాహసంతో తన భర్తను కాపాడుకుంది. భర్తను తీవ్రంగా గాయపర్చిన ఎలుగుబంటిపైకి ఈమె గొడ్డలితో ప్రతిదాడి చేసి అది పారిపోయేలా  చేసింది. 

మయూర్‌భంజ్‌ జిల్లాలో హతిసలబేడా అటవీ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. అడవిలో ఆకులు సేకరించేందుకు మాల్దే సోరెన్‌(48) తన భార్య లిలీ(41)తో కలిసి దట్టమైన అడవిలోకి వెళ్లారు. వీళ్లకు హఠాత్తుగా ఆరు ఎలుగుబంట్ల గుంపు ఎదురొచ్చింది. వాటిలో ఒక్కటి  వీళ్లపైకి భీకరంగా దాడిచేసింది. సోరెన్‌ను తీవ్రంగా గాయపర్చింది. ఇదంతా చూసిన భార్య లిలీ పట్టరాని ఆగ్రహంతో ఎలుగుపైకి గొడ్డలితో దుమికింది. గొడ్డలితో దాడిచేయడంతో గాయాలపాలై ఎలుగుబంటి పారిపోయింది. తర్వాత భర్తను ఆస్పత్రిలో చేర్పించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement