కేరళ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. శబరిమల గ్రీన్‌ఫీల్ ఎయిర్‌ఫోర్టు భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది. ఎయిర్‌ఫోర్టు భూసేకరణ రద్దు కోరుతూ గోస్పెల్ ఆశియా అనే సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా దానిని విచారించిన కోర్టు ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కేరళ ఎరుమేలిలో నిర్మించబోయే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌ఫోర్టుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ విమానాశ్రయం కోసం 2570 ఎకరాల భూమి సేకరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఎయిర్‌ఫోర్టు ఆఫ్ ఇండియా అథారిటీ ప్రకారం పెద్ద విమానాశ్రయాల నిర్వహణకు సైతం 1200 ఎకరాల భూమి సరిపోతుందని నియమం ఉంది. ఈ నేపథ్యంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్వహణ కోసం అంత పెద్దమెుత్తంలో భూసేకరణ ఎందుకు జరుపుతున్నారో వివరణ ఇయ్యాలని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అయితే భవిష్యత్తు అభివృద్ధి కోసం స్థల సేకరణ చేపడుతున్నామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. దీనికి సంతృప్తి చెందని కోర్టు స్థల సేకరణ నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. ఎరుమేలిలో నిర్మించబోయే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు శబరిమల అయ్యప్ప సన్నిధానానికి 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌ఫోర్టు నిర్మించాలని భావించింది. కోర్టు తీర్పుతో ఎయిర్‌ఫోర్టు నిర్మాణానికి బ్రేక్ పడింది.


