
హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయగా..తన ఆస్తుల వివరాలు అఫిడవిట్లో పొందుపరిచారు. ఈ మేరకు ఆమె వద్ద 4097 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే చేతిలో నగదు 38,800 రూపాయల నగదు ఉండగా మూడు బ్యాంకు ఖాతాల్లో కలిసి సుమారు 32 లక్షలు, బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారు వెండి ఆభరణాలు మొత్తం కలిపి 6,18,54,274 రూపాయలు ఉన్నట్టు పేర్కొన్నారు.
ముగ్గురు పిల్లల పేరిట షేర్లు, ఆభరణాల విలువ సుమారు రూ.4.62 కోట్లుగా పేర్కొన్నారు. సిరాస్తులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 34 లో ఓ ప్లాటు, గోపనపల్లిలో ఓ ప్లాటు ఉన్నట్లు, వీటి మొత్తం విలువ 6.11 కోట్ల రూపాయలు, పిల్లల పేరిట 8 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా సునీత పేరిట రూ.4.44 కోట్లు అప్పు ఉండగా, పిల్లల పేరుపై ఆరు కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆమెపై ఎన్నికల నియామావళి ఉల్లంఘించినందుకు గతవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.