జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక(Jublihills bypoll) కోసం అభ్యర్థిని శుక్రవారం బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. మాగంటి సునీత(Maganti Sunitha) పేరును ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖరారు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో కీలక నేతలతో భేటీ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) హఠాన్మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి మాగంటి సునీతే పోటీ చేస్తారని ఇది వరకే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నిక ప్రచార కార్యక్రమాల్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు అధినేత ఆమోదంతో పార్టీ ప్రకటన చేసింది. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.కేసీఆర్‌కు కృతజ్ఞతలుజూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిత్వంపై సునీత పార్టీ అధినేత కేసీఆర్(KCR)కు కృతజ్ఞతలు తెలియజేశారు. మాగంటి గోపీనాథ్ పట్ల ఉన్న విశ్వాసంతో, నాపై నమ్మకం ఉంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇందుకుగానూ పార్టీ అధినేత కేసీఆర్‌కు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో మీ అందరి మద్దతు, ఆశీర్వాదం నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారామె. ఇదీ చదవండి: ‘పవర్’ఫుల్ పోస్టులే కావాలి