
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఎంపికలో బిగ్‌ట్విస్ట్ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వారసుడిని తానేనంటూ తారక్ ప్రద్యుమ్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు.
ఆ లేఖలో ‘తన తల్లి మాలినీ దేవిని హిందూ వివాహ చట్ట ప్రకారం.. మాగంటి గోపీనాథ్ పెళ్లి చేసుకున్నారు. గోపీనాథ్ భార్య అంటూ సునీత తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సునీత అఫిడవిట్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇప్పటికే మాగంటి సునీత నామినేషన్‌కు ఈసీ ఆమోదం తెలిపింది.
మరోవైపు షేక్‌పేట్ ఆర్వో కార్యాలయానికి మాగంటి సునీత వచ్చారు. నామినేషన్‌లో తాను పేర్కొన్న అంశాలన్నీ సరైనవేనంటూ ఎన్నికల అధికారులకు డిక్లరేషన్ ఫారమ్ అందజేశారు.