ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు తీవ్ర అస్వస్థత.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స | BRS MLA Maganti Gopinath Hospitalised after sickness | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు తీవ్ర అస్వస్థత.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స

Jun 5 2025 5:18 PM | Updated on Jun 5 2025 7:41 PM

BRS MLA Maganti Gopinath Hospitalised after sickness

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు(గురువారం) తీవ్ర అస్వస్థతకు గురైన మాగంటి గోపీనాథ్‌ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ నేతలు ఏఐజీ ఆస్పత్రికి చేరుకుని మాగంటి గోపీనాథ్‌ను పరామర్శించారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు.. హుటాహుటీనా ఆస్పత్రికి చేరుకుని గోపీనాథ్‌ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం గోపీనాథ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

నిలకడగానే ఆరోగ్యం: దాసోజు శ్రవణ్‌
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై గోపీనాథ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారన్నారు. 48 గంటలు గడిస్తే గానీ  గోపీనాథ్‌ ఆరోగ్యంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు శ్రవణ్‌.

Advertisement
 
Advertisement
Advertisement