ఓవర్‌స్పీడుతో చెట్టును ఢీ.. గాల్లోనే ప్రాణాలు.. వైరల్‌ వీడియో | Two dead in road accident in Hyderabad | Sakshi
Sakshi News home page

ఓవర్‌స్పీడుతో చెట్టును ఢీ.. గాల్లోనే ప్రాణాలు.. వైరల్‌ వీడియో

Oct 19 2026 4:45 PM | Updated on Oct 19 2026 4:56 PM

Two dead in road accident in Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: అతివేగం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది అత్యుత్సాహంతో వాహనాలను వేగంగా నడిపి తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటారు. ఎంత చెప్పినా వినరూ. తాజాగా అటువంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. 

హైదరాబాద్ శివారు జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్  పరిధిలో ఓవర్‌ స్పీడుతో బైక్‌ నడుపుతూ వచ్చిన ఇద్దరు యువకులు బైక్ కంట్రోల్‌ కాక ఓవర్ స్పీడుతో  రోడ్డుపై ఉన్న చెట్టును ఢీకొట్టారు. వేగంతో ఢీకొట్టడంతో ఇద్దరు గాల్లో ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.  మృతి చెందిన వారి వివరాలు కాస్మోస్ (22), సుమిత్ (23)గా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలు కలవరపరుస్తున్నాయి. 

ఇదీ చదవండి: మూడు రోజులు వర్షాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement