తెలుగు ప్రజలకు వైఎస్ జగన్‌ విజయదశమి శుభాకాంక్షలు | YS Jagan Extends Warm Vijayadashami Wishes to Telugu People | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్‌ విజయదశమి శుభాకాంక్షలు

Oct 19 2026 4:43 PM | Updated on Oct 19 2026 5:02 PM

YS Jagan Extends Warm Vijayadashami Wishes to Telugu People

తాడేపల్లి: తెలుగు ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు.. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమని తెలిపారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా.. అంతిమ విజయం మంచినే వరిస్తుందన్నారు.

‘‘ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలనీ.. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలనీ.. ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ తెలిపారు. 

ఇదీ చదవండి: కూటమి రాజకీయాలకో దండం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement