మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా: ఎస్‌ఈసీ | Mydukur Municipality Elections Postponed | Sakshi
Sakshi News home page

మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా: ఎస్‌ఈసీ

Oct 19 2026 1:40 PM | Updated on Oct 19 2026 1:56 PM

Mydukur Municipality Elections Postponed

సాక్షి,విజయవాడ: వైఎస్సార్‌ కపడ జిల్లా మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నిక వాయిదా పడింది. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతలు, టీడీపీ మూకలు నామినేషన్ పత్రాలు చించివేయడం వంటి పరిణామాల నేపథ్యంలో మైదుకూరులో మున్నిపల్‌ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు.

నామినేషన్ పత్రాలు చించివేయడంతో సరైన రీతిలో పరిశీలన (స్క్రూటినీ) సాధ్యం కాదని జిల్లా కలెక్టర్ ఎస్‌ఈసీకి నివేదిక అందజేశారు. కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అనిల్‌చంద్ర పునేఠా చెప్పారు.

మైదుకూరు మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో అంతరాయం, హింసాకాండ చోటు చేసుకున్నాయి. దీంతో మైదుకూరు మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేస్తున్నాము. వైఎస్సార్‌ కడప జిల్లాకు సంబంధించి పూర్తి అధికారిక నివేదిక అందాల్సి ఉంది. నామినేషన్‌ పత్రాలు చించివేయడంతో పరిశీలన (స్క్రూటినీ) సాధ్యం కాదని కలెక్టర్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ల సమయంలో చెలరేగిన అల్లర్లు, గందరగోళం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement