రైల్లో ఫోన్ స్పీకర్‌ ఆన్‌ చేస్తే జైలుకే.. | Phone on speaker in train You may be penalised jailed | Sakshi
Sakshi News home page

రైల్లో ఫోన్ స్పీకర్‌ ఆన్‌ చేస్తే జైలుకే..

Oct 19 2026 8:32 AM | Updated on Oct 19 2026 8:45 AM

Phone on speaker in train You may be penalised jailed

న్యూఢిల్లీ: రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ఫోన్ స్పీకర్ మోడ్‌లో పెట్టి పాటలు వినడం, వీడియోలు చూడటం వల్ల తోటి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని దక్షిణ రైల్వే తెలిపింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1,000 వరకు జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రవర్తించే ప్రయాణికులను రైలు కోచ్ లేదా రైల్వే ప్రాంగణం నుంచి బయటకు పంపే అధికారం అధికారులకు ఉంటుందని హెచ్చరించింది. 

ప్రజలకు న్యూసెన్స్ కలిగించే అంశాలపై రైల్వే చట్టంలోని సెక్షన్ 142ను దక్షిణ రైల్వే ప్రయోగిస్తున్నది. ప్రయాణికులు పదే పదే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్షతో పాటు రూ. 5,000 వరకు జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. పబ్లిక్ స్థలాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలను భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 270 ప్రకారం నేరంగా పరిగణిస్తారు.

రైళ్లలో టికెట్ ఎగ్జామినర్లు (టీటీఈT), కమర్షియల్ విభాగానికి చెందిన సీనియర్ అధికారులు రూ.1,000 జరిమానాను అక్కడికక్కడే విధించే అధికారాన్ని కలిగి ఉంటారు. రైల్వే శాఖతో పాటు మెట్రో రైళ్లలో కూడా ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే జరిమానాలు విధించడం, కోచ్‌ల నుంచి దింపివేయడం వంటి నిబంధనలు అమల్లో ఉన్నాయని అధికారులు గుర్తుచేశారు.

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిన నేపథ్యంలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రైల్వే డివిజన్లను ఆదేశించారు. స్పీకర్ మోడ్‌లో వినడం, బిగ్గరగా మాట్లాడటం వంటివి మానుకోవాలని సూచిస్తూ స్టేషన్లలోని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రాంతీయ భాషలు, హిందీ మరియు ఇంగ్లీష్‌లలో ప్రయాణికులకు అవగాహన కల్పించే ప్రచారాలను నిర్వహించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement