లోక్‌సభలో 97 మంది  ఎంపీల సీటింగ్‌ మార్పు  | Lok Sabha Seats Of 97 MPs Changed As DMK Backs Delimitation Bill | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో 97 మంది  ఎంపీల సీటింగ్‌ మార్పు 

Nov 29 2026 6:09 AM | Updated on Nov 29 2026 6:09 AM

Lok Sabha Seats Of 97 MPs Changed As DMK Backs Delimitation Bill

వారిలో డీఎంకే, ఎన్సీపీ నేతల సీట్లు సైతం 

న్యూఢిల్లీ: కీలక బిల్లులు పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న వేళ లోక్‌సభలో 97 మంది ఎంపీలు కూర్చునే సీట్ల స్థానాల్లో మార్పులు జరగబోతున్నాయి. 22 మంది డీఎంకే ఎంపీలు, ఎనిమిది మంది ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీల సీటింగ్‌ సైతం మారనుంది. నియోజకవర్గాల పునర్విభజ బిల్లుకు డీఎంకే మద్దతిస్తున్న వేళ ఇకపై కాంగ్రెస్‌ సభ్యుల పక్కన తాము కూర్చోబోమని ఆ పార్టీ ఎంపీలు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ సభ్యుల వెంట కాకుండా విడిగా సీట్లు కేటాయించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను డీఎంకే నేతలు కోరినట్లు సమాచారం. 

ఆ వినతికి స్పీకర్‌ ఆమోదించిన నేపథ్యంలో ఈ సీటింగ్‌ మార్పు అమల్లోకి వస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏకరీతిగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచితే తామూ బిల్లుకు మద్దతిస్తామని ఎన్సీపీ(ఎస్పీ) పార్టీ అధికార ప్రతినిధి జితేంద్ర అవ్హాద్‌ తెలిపారు. సీట్లు మార్పు తర్వాత డీఎంకే సభ్యురాలు కనిమొళి, ఏ రాజా, దయానిధి మారన్‌ల పక్కన ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ సుస్రియా సూలే కూర్చోనున్నారు. డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) సభ్యుల సీటింగ్‌ మార్పుతో చివరకు కొందరు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన ఎంపీల సీట్లు సైతం మారే ఆస్కారముంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement