తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం ఉదయం తిరుమలలో స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణకాంతులతో మెరిసే బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
మంగళవాయిద్యాల నడుమ, గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధుల్లో స్వామివారి స్వర్ణరథ విహారం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.


