ముంబై: ముంబైలోని జుహు పరిధిలోగల పుష్పా పార్క్ సమీపంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్ ఫిర్దౌస్ ఎడమ చేతికి బుల్లెట్ గాయమై, నానావతి ఆసుపత్రిలో చేరారు. అక్కడే ఉన్న మరో అభిమానికి కూడా గాయాలయ్యాయి. ఘటనా స్థలం జుహు పోలీస్ స్టేషన్‌కు కేవలం 350 మీటర్ల దూరంలోనే ఉండటంతో నగర భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Instead of cracking down on students and activists, the police should focus on actual criminals. This is what happens when the Govt and police have their priorities completely misplaced.
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 18, 2026
ఈ దాడిపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందిస్తూ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులు, ఉద్యమకారులపై చర్యలు తీసుకోవడం మానేసి, అసలైన నేరగాళ్లపై పోలీసులు దృష్టి పెట్టాలని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా డిమాండ్ చేశారు. పాలకులు, పోలీసులు తమ విధుల ప్రాధాన్యతలు గాడి తప్పినప్పుడు ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని ఆయన దుయ్యబట్టారు.
మరోవైపు, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉందని భావిస్తున్న అనిల్ పండిట్, హర్మన్ సంధు పేర్లతో సోషల్ మీడియాలో ఈ దాడికి బాధ్యత వహిస్తూ పోస్ట్‌లు వచ్చాయి. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేస్తున్నందుకే టైగర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆ పోస్టులలో పేర్కొనగా, ముంబై పోలీసులు ఆ పోస్టుల నిజానిజాలపై దర్యాప్తు ప్రారంభించి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: దసరా రేపా? ఎల్లుండా?.. పండితులు చెబుతున్నదిదే!


