వైఎస్సార్ జిల్లా(రాజంపేట): సీఎం గారూ..! నాకు న్యాయం చేయండి!! అని రాజీవ్‌నగర్‌కు చెందిన నాగూరు నబీరసూల్ వేడుకున్నాడు. 10వ వార్డుకు కౌన్సిలర్‌గా నామినేషన్ వేసేందుకు ఆదివారం మున్సిపాలిటి కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఉన్న డా.నవీన్ అనే టీడీపీ నేత తన నామినేషన్ పత్రాలు బలవంతంగా తీసుకొని చించివేసి బయటికి తోసేశారు.
అయితే, పోలీసులు పక్కనే ఉన్న కూడా అడ్డురాలేదు. టీడీపీ పార్టీ కార్యకర్తలపై తోటి టీడీపీ నాయకులు దాడులు చేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన పెడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. టీడీపీ పార్టీని నమ్ముకున్నందుకు, గతంలో మూడుకేసులు పెట్టారు. నాకు ఉద్యోగం రాక నా జీవితం నాశనమైందని వాపోయాడు.
ఇదీ చదవండి: నారా పాలనలో ఆడబిడ్డకు ‘దుర్గ’తి!


