కుప్పంలో టీడీపీ గూండాల బరితెగింపు.. ఎమ్మెల్సీ ఇంటిపై దాడి | TDP goons lay siege to a YSRCP house in Kuppam | Sakshi
Sakshi News home page

కుప్పంలో టీడీపీ గూండాల బరితెగింపు.. ఎమ్మెల్సీ ఇంటిపై దాడి

Oct 19 2026 12:55 PM | Updated on Oct 19 2026 1:16 PM

TDP goons lay siege to a YSRCP house in Kuppam

సాక్షి, కుప్పం: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసినా టీడీపీ గూండాల అరాచకం ఆగడం లేదు. చంద్రబాబు స్వంత ఇలాకాలో ఇష్టారీతిన వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. ఏకంగా MLC ఇంటినే  చుట్టుముట్టారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతగా క్షీణించాయో అర్థం చేసుకోవచ్చు. 

ఈ రోజు (సోమవారం) కుప్పంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్‌ ఇంటిని టీడీపీ గుండాలు చుట్టుముట్టారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయ్‌ని కిడ్నాప్‌ చేసి అరాచకం సృష్టించారు. దీంతో విజయ్‌ భార్య పావని తీవ్ర భయభ్రాంతులకు గురవుతూ ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను టీడీపీ గూండాలు ఎత్తుకెళ్లారని పచ్చమూకలతో తన ప్రాణాలకు ముప్పు ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. 

అయితే తాజాగా సీఈసీ సైతం నామినేషన్ల సమయంలో జరుగుతున్న దాడులపై పెద్దగా స్పందించలేదు.నామినేషన్ల సమయంలో జరిగిన దాడిపై మీడియా ప్రతినిధులు ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠాను ప్రశ్నించగా ఆయన సమాధానం ఎత్తవేశారు. కలెక్టర్ల నుంచి నివేదిక వచ్చాకే చర్యలు తీసుకుంటామన్నారు. 

ఇదీ చదవండి: పచ్చమూకల దాష్టీకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement