పచ్చమూకల దాష్టీకం.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఆగని దాడులు | Live Updates: Attacks by TDP goons on YSRCP leaders continue in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పచ్చమూకల దాష్టీకం.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఆగని దాడులు

Oct 19 2026 10:10 AM | Updated on Oct 19 2026 11:48 AM

Live Updates: Attacks by TDP goons on YSRCP leaders continue in Andhra Pradesh

సాక్షి,అమరావతి: నామినేషన్ల పర్వం ముగిసినా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ మూకల అరాచకాలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడగడుగునా అడ్డుకోవడంలో విఫలమైన పచ్చమూకలు, తమ కుట్రలు బెడిసికొట్టడంతో కక్షగట్టి మరీ హింసాకాండకు తెగబడుతున్నాయి. ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ శ్రేణులు సాగిస్తున్న ఈ దాడులు శాంతిభద్రతల వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. 
 
కుప్పం

      కుప్పంలో టీడీపీ నేతల బీభత్సం

  • MLC భరత్‌ ఇంటిపై దాడికి దిగిన టీడీపీ గూండాలు

  • MLC భరత్‌ ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ గూండాలు

  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయ్‌ కుమార్ కిడ్నాప్‌ చేసిన టీడీపీ గూండాలు

  • టీడీపీ గూండాల నిర్వాకంతో ఎమ్మెల్సీ భార్య పావని ఆవేదన

  • తన భర్తను టీడీపీ గూండాలు ఎత్తుకెళ్లారని పావని ఆవేదన

  • తన భర్త విజయ్‌కుమార్‌కు ప్రాణహాని ఉందన్న పావని

    వైఎస్సార్‌ 

  • ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్‌

  • నామినేషన్‌ పరిశీలనకు వచ్చిన నేతలను కొట్టిన పోలీసులు

  • పోలీసుల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కంటికి గాయంం

  • స్క్రూటినీలో నామినేషన్‌ పత్రాలు చించేసిన టీడీపీ గూండాలు

  • మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట బైఠాయించి వైఎస్సార్‌సీపీ నేతల నిరసన 
     

 

    వైఎస్సార్‌ 

  • బద్వేలులో పోలీసుల ఓవరాక్షన్
  • స్క్రూటినీకి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల అడ్డగింత
  • పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సుధ, డీసీ గోవిందరెడ్డి ఆగ్రహం

    కుప్పం

  • చంద్రబాబు ఇలాకాలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు

  • వైఎస్సార్‌సీపీ ఛైర్మన్‌ అభ్యర్థి విజయ్‌ కుమార్‌ కిడ్నాప్‌
     
  • కుప్పం 11,20 వార్డు సభ్యులపై దాడి
     
  • టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు తీవ్రగాయాలు
     
  • తలపలిగి రక్తం కారుతున్న కనికరించని టీడీపీ గూండాలు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు చించివేత

  • స్క్రూటినీ సమయంలో నామినేషన్లు చించేసిన టీడీపీ నేతలు

  • మున్సిపల్ నామినేషన్లు ముగిసినా ఆగని దౌర్జన్యాలు

నంద్యాల

  • 22వ వార్డు అభ్యర్థి చెన్నయ్య, కిడ్నాప్‌ 
  • చెన్నయ్యతో పాటు ప్రపోజల్‌ అభ్యర్థి అశోక్‌ను కిడ్నాప్‌ చేసిన పచ్చమూకలు
  • 25 వ వార్డు మాధవయ్య, 21వ వార్డు ఎద్దుల చంద్ర కిడ్నాప్‌ 
  • స్కార్పియో వాహనంలో ఎత్తుకెళ్లిన టీడీపీ గూండాలు
  • డీఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి
  • పోలీసులు పట్టించుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన

కడప

  • ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఛైర్మన్‌ అభ్యర్థి ఇంటిపై టీడీపీ గూండాల దాడులు
  • అర్థరాత్రి నరసింహారెడ్డి ఇంటి వద్ద టీడీపీ గుండాలు బీభత్సం సృష్టించారు. 
  • పోరెడ్డి నరసింహరెడ్డి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు.

తాడిపత్రి

  • తాడిపత్రిలోనూ టీడీపీ మూకలు దాష్టీకం
  • మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన అభ్యర్థులపై దాడులు 
  • వైఎస్సార్‌సీపీ 1వ వార్డు అభ్యర్థి షపీ ఇంటిపై జేసీ వర్గీయులు దాడి
  • ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్‌  ధ్వంసం  
  • నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలని వార్నింగ్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement