సాక్షి, నరసారావుపేట: స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వానికి ఆలోచన లేదని కాసు మహేష్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం శిఖండిల్లా పోలీసులను అడ్డుపెట్టుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు (సోమవారం) నరసరావుపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. హౌస్ అరెస్టులు చేస్తే అభ్యర్థులు నామినేషన్ ఎలా వేస్తారని.. అడ్డుకుంటే అరెస్టులు చేస్తే అసలు ఎన్నికలెందుకని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ హాయాంలో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా జరిగాయని కూటమి ప్రభుత్వానికి గుర్తుచేశారు.
త్వరలోనే కూటమి నేతలు రాజకీయ ఆత్మహత్యలు చేసుకోబోతున్నారని. పథకాల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని అందుకే ఎన్నికలకు భయపడుతున్నారని తెలిపారు. వారినంతా చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో 30 నుంచి 40 వేల మెజార్టీతో గురజాలలో వైఎస్సార్‌సీపీ గెలుస్తోందని తేల్చిచెప్పారు. వచ్చే రెండేళ్లలో ప్రజా ప్రభంజనం ఏలా ఉంటుందో కూటమి నేతలను చూస్తారన్నారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే టీడీపీ గూండాలు చేసిన అరాచకాలపై విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో జరిగే హింసా ఘటనలే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి నాంది అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కనీసం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలైనా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. MLA యరపతినేని శ్రీనివాసరావును ప్రశ్నిస్తూనే ఉంటామని ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉందన్నారు.
ఇదీ చదవండి: టీడీపీని నమ్ముకుంటే జీవితం నాశనమైంది


