సాక్షి,విజయవాడ: ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్‌చంద్ర పునేఠా సోమవారం (అక్టోబర్19) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 659 జెడ్పీటీసీ స్థానాలకు, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 21 నుంచి 23 వరకు
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 24న
నామినేషన్ల ఉపసంహరణకు గడువు: అక్టోబర్ 27 వరకు
పోలింగ్ తేదీ: నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహణ
ఓట్ల లెక్కింపు,ఫలితాల వెల్లడి: నవంబర్ 5న
ఈ సందర్భంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠ మీడియాతో మాట్లాడారు. జెడ్పీసీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశాం. 28 జిలాల్లో 663.. ఉంటే 659 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.. ఎంపీటీసీకి రూ.4లక్షలు, జడ్పీటీసీకి రూ. 8లక్షలు ఖర్చు చేయొచ్చు. ఎంపీటీసీ 9859 ఉంటే.. 9829 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
జెడ్పీటీసీ స్థానాలకు 28 మంది, ఎంపీటీసీ స్థానాలకు 687 మంది రిటర్నింగ్ అధికారులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,333 పోలింగ్ స్టేషన్లు ఉండగా, అందులో 9,186 కేంద్రాలను అత్యంత సమస్యాత్మక మైనవిగా గుర్తించారు. మున్సిపల్ కార్పొరేషన్లలో 320 నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులకు 87, వార్డు సభ్యుల పదవులకు 1,358 నామినేషన్లు వచ్చాయి. 8,190 వార్డు సభ్యులు, మొత్తం 24,451 నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ల ప్రక్రియలో జరిగిన హింసాకాండపై మౌనం
నామినేషన్ల ప్రక్రియలో జరిగిన హింసాకాండపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందన దాటవేత ధోరణిలో సాగింది. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న అరాచకాలు, హింసపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఎస్‌ఈసీ స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేశారు. కలెక్టర్ల నుంచి పూర్తి నివేదికలు వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని మాత్రమే ఎస్‌ఈసీ వెల్లడించారు.
మరోవైపు, ప్రతిపక్ష నేతలు, అభ్యర్థులపై దాడులకు దిగిన అధికార పార్టీ మూకలపై, వారికి వత్తాసు పలికిన అధికారులు, పోలీసులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని మీడియా గట్టిగా నిలదీసింది. అయితే, ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానాలు చెప్పకుండానే ఎస్‌ఈసీ ప్రెస్‌మీట్‌ను అర్ధంతరంగా ముగించారు.
అనంతరం పంచాయితీ రాజ్ సెక్రటరీ కృష్ణ తేజ మాట్లాడుతూ.. 663 మండలాలు ఉంటే 659 మండలాల్లో ఎలక్షన్ జరుగుతుంది. నామినేషన్ ఎక్కడ తీసుకొంటారో వెబ్ కాస్టింగ్ పెడుతున్నాం. వెబ్ కాస్టింగ్ జిల్లా కలెక్టర్,ఎస్పీలతో పాటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వద్ద ఉంటుంది’ అని తెలిపారు.


