లేఖ రాసిన కాల్వలో దూకిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు
తెలంగాణ: ‘స్కూల్ టెన్షన్.. లైఫ్ టెన్షన్.. డిప్రెషన్‌తో విజయవాడ మెంటల్ హాస్పిటల్‌కు వెళ్లినా టెన్షన్ తగ్గడం లేదు. లివర్ పాడైంది.. లంగ్స్ పాడైపోయాయి.. చెడిపోయాయి.. దేని మీద ఇంట్రెస్ట్ లేదు, టెన్షన్ తగ్గటం లేదు.. షుగర్ వచ్చిందనుకున్నా.. టెన్షన్ తగ్గడం లేదు.. మందులు వాడుతున్నా తగ్గటం లేదు.. నన్ను క్షమించండి.. నా కుటుంబాన్ని కాపాడండి.. నా పిల్లలను బాగా చూసుకోండి’ అంటూ లేఖ రాసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నెస్పీ కాల్వలో దూకి గల్లంతయ్యాడు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెం గ్రామానికి చెందిన దొడ్డపునేని వెంకటేశ్వరరావు (42) కొండ్రుపాడులోని ప్రభుత్వ పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన ఆదివారం ఉదయం బైక్‌పై బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు గాలిస్తుండగా గ్రామ సమీపంలోని ఎన్నెస్పీ కాల్వ వద్ద వాహనం కనిపించింది.
అందులో పరిశీలించగా లేఖ లభించింది. టెన్షన్‌తో ఇబ్బంది పడుతున్నట్టు అందులో పేర్కొన్న ఆయన ‘అన్నయ్య, తమ్ముడు, అమ్మానాన్న, అత్తయ్య, మామయ్య, శేషగిరి మీరంతా మా పిల్లలను బాగా చేసుకోండి’ అని కోరాడు. కాల్వలో దూకినట్టు భావిస్తూ వెంకటేశ్వరావు కోసం గ్రామస్తులు, పోలీసులు గజ ఈతగాళ్లతో కలిసి గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో కీలక పరిణామం


