బీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్లు రెడీ | BRS star campaigners are ready | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్లు రెడీ

Oct 22 2025 4:00 AM | Updated on Oct 22 2025 4:00 AM

BRS star campaigners are ready

పార్టీ అధినేత కేసీఆర్‌ సహా 40 మంది నేతలు 

జాబితాకు ఆమోదం తెలిపిన ఎలక్షన్‌ కమిషన్‌  

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పార్టీకి చెందిన 40 మంది ముఖ్య నేతలు జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచార సారథులుగా వ్యవహరిస్తారు. బీఆర్‌ఎస్‌ తరఫున ప్రతిపాదించిన 40 మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఆమోదం తెలిపింది. బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి భరత్‌ కుమార్‌ గుప్తా ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ప్రచార వాహనాల పాస్‌లు మంజూరు చేసింది. ఈసీ అనుమతి పొందిన స్టార్‌ క్యాంపెయినర్లు వచ్చే నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం నిర్వహించేలా అనుమతి ఇచ్చింది. 

స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో ఇంకా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్‌ అలీ, వి.ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి ఉన్నారు. అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్, అనిల్‌జాదవ్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, ముఠా గోపాల్, చింతా ప్రభాకర్‌ కూడా స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా­లో ఉన్నారు. 

ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంబీపూర్‌ రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తాతా మధు, ఎల్‌.రమణ, తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు ప్రచారంలో పాల్గొంటారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్దన్‌రెడ్డి, షకీల్‌ అమీర్‌ మొహమ్మద్, నేతలు రావుల శ్రీధర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, అబ్దుల్లా సోహైల్‌ కూడా స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement