breaking news
byelection
-
అధర్మం నాలుగు పాదాలపై...
శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి. ‘పరిత్రాణాయ సాధూనామ్, వినాశాయ చదుష్కృతామ్, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’ అనే సందేశాన్ని మన జనజీవన స్రవంతితో సమ్మేళన పరిచిన భగవానుడాయన. సన్మార్గులను రక్షించడానికీ, దుర్మార్గులను శిక్షించడానికీ ప్రతి యుగంలోనూ నేను అవత రిస్తూనే ఉంటానని ఆయన చేసిన గీతోపదేశాన్ని భారతీయ సమాజం ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉన్నది. ఇక జన్మాష్టమి సందర్భమైతే సరేసరి. పామరుల నుంచి పండితుల వరకు, సామాన్యుల నుంచి సర్కార్ పెద్దల వరకూ ఆ మహామహో పాధ్యాయుని సంస్మరణ అవిస్మరణీయమైన ఆచారంగా మిగిలి పోయింది.ఈ కృష్ణాష్టమి సందర్భంగా రాజకీయ నాయకులు ఇచ్చిన సందేశాల్లో ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ చేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఎక్కువగా ఆకర్షించింది. ‘అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా – అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు. నిన్నమొన్నటి రాజకీయ పరిణామాలు ఈ ట్వీట్‌కు ప్రేరణ కావచ్చు. ఎన్నికలొక తతంగంగా – ప్రజాస్వామ్యం ఒక ప్రహసనంగా మారిన తీరు ప్రభావితం చేసి ఉండవచ్చు. కిందటేడాది జరిగిన సాధారణ ఎన్నికలపై పుంఖా నుపుంఖాలుగా ఆరోపణలు వస్తున్న విషయం విదితమే. ఆ ఆరోపణలకు తగిన ఆధారాలు సమకూరుతున్న తీరు కూడా తెలిసిన సంగతే.రెండు రోజుల కిందటే జరిగిన రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల తతంగం మరో రకమైన వంచన. నడిబజార్లలో ప్రజా స్వామ్యం బట్టలూడదీసి వివస్త్రగా నిలబెట్టిన దుశ్శాసన క్రీడగా దాన్ని వర్ణించవచ్చు. ఈ వికృత కేళికి బాధ్యులెవరంటే ఏమని చెబుతాం? కర్ణుడి చావుకు కారణాలేమిటో అర్జునుడికి కృష్ణపర మాత్మ తెలియజెప్పుతాడు. ‘నీ చేతను, నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధర చేత భార్గవు చేత నరయంగ కర్ణుడీల్గె నార్వురి చేతన్’ అని వివరిస్తాడు. ‘కర్ణుడు నీవల్లా నావల్ల మాత్రమే చనిపోలేదు. ఆయన చావుకు కుంతీదేవి,ఇంద్రుడు, భూదేవి, పరశురాముడు కూడా కారకులే’నని చెబుతాడు.అదేవిధంగా పులివెందుల, ఒంటిమిట్టల్లో కూడా రక్షకు లుగా ఉండవలసినవారే ప్రజాస్వామ్య హత్యాకాండకు ఒడి గట్టారు. ‘సత్యం వద’ (సత్యాన్ని మాట్లాడు), ‘ధర్మం చర’ (ధర్మాన్ని అనుసరించు) అని ఉపనిషత్తులు చేస్తున్న బోధనను మన సనాతన ధర్మ ప్రభుత్వం ‘సత్యం వధ’ (సత్యాన్ని చంపు), ‘ధర్మం చెర’ (ధర్మాన్ని నిర్బంధించు)గా అర్థం చేసుకున్నట్టుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ సత్యాన్ని వధించైనా ఓ గెలుపును కైవసం చేసుకోవాలని సంకల్పించింది. రాజ్యాంగ ధర్మాన్ని నిర్వర్తించవలసిన ఎన్నికల వ్యవస్థ ఈ సంకల్పానికి సహకరించింది. నిష్పక్షపాతంగా వ్యవహరించవల సిన అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం ఈ సంకల్పానికి సాగిలబడింది. సత్యాన్ని మాట్లాడవలసిన నాలుగో స్తంభం (మీడియా) దాన్ని చంపేయడానికి తోడ్పాటు నిచ్చింది.రాజ్యాంగ ధర్మాన్ని నిలబెట్టవలసిన ప్రభుత్వం, ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం, మీడియా సమష్టిగా అధర్మ పతాకాన్ని ఎగరవేశాయి. అధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించాయి. ఆ నడక తీరు ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఇరవై జడ్పీటీసీ స్థానాలు ప్రాతినిధ్యం లేకుండా ఖాళీగా ఉన్నాయి. ఇందులో చాలా స్థానాలు పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలు ఖాళీ అవకముందు నుంచే అలా ఉన్నాయి. అధికారం బాగా తలకెక్కిన వారికి చిత్రాతిచిత్రమైన కోర్కెలు కలుగుతుంటాయని చాలా కథల్లో చదువుకున్నాము. అటువంటి ఒక కోరిక ముఖ్యమంత్రికో, ఆయన కుమారునికో కలిగిందని సమాచారం. జగన్మోహన్రెడ్డికి బలమైన కోట వంటి పులివెందులలో ఆయన్నొకసారి ఓడించాలనేది ఆశ. ఆ కోర్కె తీరేలోగా పులివెందుల నియోజకవర్గం నుంచి ఓ తోకనో, ఒక ఈకనో గెలుచుకొచ్చి అదేం దుర్భేద్యమైన దుర్గం కాదని చాటేందుకు ఉబలాటపడ్డారు. అలా చేస్తే వైసీపీ నైతిక ధృతి దెబ్బతిని స్థానిక ఎన్నికల్లో తమకు ‘జీవన్టోన్’లా ఉపయోగ పడుతుందని ఆశించారు.పులివెందుల జడ్పీటీసీతోపాటు పక్కనే ఉన్న రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట స్థానానికి కూడా ఉపఎన్నికలు జరిపి ఏదోవిధంగా రెండూ గెలవాలని ఆలోచన చేశారు. అలా జరిగితే కడప జిల్లాలో జగన్ బలం కోల్పోయాడని ప్రచారం చేసుకోవాలనేది లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం కలిసివచ్చే కరి వేపాకుల్ని ఇంతకుముందే సేకరించి పెట్టుకున్నారు. ఈ రెండింటికి మాత్రమే ఎన్నికలు జరిపితే మిగిలిన 18 జడ్పీటీసీల సంగతి? ఇన్నిచోట్ల ఒకేసారి దుశ్శాసన ప్రయోగం మంచిది కాదు. వికటించినా వికటించవచ్చు – అని ఈ రెంటికి మాత్రమే ఎన్నిక జరిగే విధంగా జయరామిరెడ్డి అనే దేశం కార్యకర్తను కోర్టు మెట్లు ఎక్కించారు. కడప జడ్పీ ఛైర్మన్ ఎమ్మెల్యేగా గెలిచి నందువల్ల అప్పటికే ఆ పదవి ఖాళీగా ఉన్నది. రెండు జడ్పీ టీసీలు ఖాళీగా ఉండగా కొత్త ఛైర్మన్ ఎన్నిక కుదరదని, కనుక ఈ రెండు స్థానాలకు ముందుగా ఎన్నికలు నిర్వహించేవిధంగా ఆదేశించాలని జయరామిరెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. న్యాయస్థానం ఓకే చేసింది.రాజ్యాంగంలోని 243వ అధికరణాన్ని అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సంపూర్ణమైన అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానిదే! రెండు జడ్పీటీసీల ఎన్నికలకు కోర్టు ఆదేశించినప్పుడు ఖాళీగా ఉన్న మిగిలిన స్థానాలకు కూడా ఎన్ని కల నిర్వహణకు ఈసీ ఉపక్రమించి ఉండవచ్చు. అది దాని ధర్మం కూడా! కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మతం కాని పనిని చేయడానికి ఈసీ సాహసించలేదు. ఆరు మాసాలకు మించి ఖాళీగా ఉండకూడదన్న స్ఫూర్తిని కూడా విస్మరించింది. ఇక ఎన్ని కలు జరిగిన రెండు స్థానాలపై చాలాకాలం ముందునుంచే టీడీపీ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఎన్నికలు సరిగ్గా వారం రోజుల ముందటే పులివెందుల నియోజకవర్గానికే చెందిన వైసీపీ కార్యకర్త సైదాపురం సురేష్ రెడ్డిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ మరుసటిరోజే శాసనమండలి సభ్యుడైన రమేశ్ యాదవ్‌పైనా, వైసీపీ నాయ కుడు వేల్పుల రాముపైన దాడి జరిగింది. రామును హత్య చేయ డానికే చూశారని సమాచారం. వైసీపీ కార్యకర్తలూ, నేతలూ ఎన్నికలయ్యేంతవరకు ఇళ్ళను వదిలి వెళ్లకపోతే ఇటువంటి ఘటనలే జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. పాలక కూటమి దాడుల పట్ల పోలీసుల స్పందన మరీ అన్యాయం. ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం వందలాదిమంది పోలీసులతో ఒక డీఐజీ స్థాయి అధికారే మోహరించారు. దాడులపై ఫిర్యాదులు చేసిన వారితో ఆయన వెటకారంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి. ‘పక్క ఊరికి వెళ్లి పత్తాపారం చేస్తే ఇలానే ఉంటుంద’ని ఆయన వ్యాఖ్యానించారు. తామే లేకపోతే అక్కడ తలలు తెగిపడేవనే మాటలు కూడా వైరల్ అయ్యాయి.ఈ తరహా కామెంట్ల వల్ల తమకు పోలీసు రక్షణ లభించ దనే అభిప్రాయం సహజంగానే వైసీపీ కార్యకర్తలకు ఏర్పడుతుంది. ఏడాది మాత్రమే గడువున్న ఒక చిన్న ఎన్నిక కోసం గ్రామాల ప్రశాంతత ఎందుకు భగ్నం కావాలన్న ఆలోచన కూడా ఉండవచ్చు. వైసీపీ ముఖ్య కార్యకర్తలంతా మండలం నుంచి బయటికి వెళ్లారు. యెల్లో మీడియా మాత్రం వైసీపీ వాళ్లు ఓటుకు ఐదు వేలు, పదివేలిచ్చి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనీ యథావిధిగా వెకిలి రాతలే రాసింది. తలలు తెగిపడే పరిస్థితులు ఉన్నాయని డీఐజీ స్థాయి అధికారి చెప్పినప్పుడు ఎన్నికల సంఘం స్పందించి ఉండాల్సింది. పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేసి ఉండవలసింది. కానీ అటువంటివేమీ జరగలేదు.నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు బయటి ప్రాంతాల వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలి. మంత్రి సవిత నాయకత్వంలో ఒకటి, జమ్మలమడుగు ఎమ్మెల్యే దండ నాయకునిగా మరొకటి, కమలాపురం ఎమ్మెల్యే నేతృత్వంలో ఇంకోటి, బీటెక్ రవి అధీనంలో ఒకటి చొప్పున అక్కడే తిష్ఠవేసి ఉన్న నాలుగు బెటాలియన్లు మాత్రం ఈ నిబంధన పాటించ లేదు. పోలింగ్ రోజున ఉదయం నాలుగు గంటలకే ఈ బెటా లియన్లు మొత్తం 15 పోలింగ్ బూతుల్ని చుట్టుముట్టాయి. పోలింగ్ బూత్‌లకు ఈ బెటాలియన్లు ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగా నిలబడితే పోలీసులు ఇన్నర్ రింగ్‌రోడ్డు మాదిరిగా పోలింగ్ బూత్ ప్రాంగణాల్లో ఉండిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వచ్చిన వారికి తొలుత కూటమి బెటాలియన్లే ఎదురుపడ్డాయి.ఓటేసేందుకు వచ్చిన ఓటర్ల దగ్గర స్లిప్పులు లాక్కుని కూటమి సైన్యం వారిని వెనక్కి పంపించింది. ఒక్క వైసీపీ ఏజెంట్‌ను కూడా బూతుల్లోకి ఈ కిరాయి సైన్యం అనుమతించలేదు. ఫిర్యాదు చేయడానికి ఏ ఒక్క పోలీసూ కనబడలేదు. అంతకు ముందే నాలుగు గ్రామాల పోలింగ్ బూత్‌లను ఎత్తివేసి పక్క గ్రామాలలో ఏర్పాటు చేశారు. ఆ గ్రామాల మధ్య మాత్రం పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి. కాళ్లు పట్టుకున్నా పోలీ సులు కనికరించలేదు. ఓట్లు వేసేందుకు వెళ్లనీయలేదు. ఈ వార్తలు, ఫోటోలు ఒక సెక్షన్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే కనిపించాయి. కానీ ఎన్నికల సంఘం స్పందించ లేదు. పోలింగ్ బూత్‌లను మార్చడమనే నిర్ణయాన్ని కూడా పాలక కూటమి సూచన మేరకే ఈసీ తీసుకున్నదనే విషయం బహిరంగ రహస్యం.ఒంటిమిట్ట మండలంలోనూ ఇదే ఫార్ములాను అమలు చేశారు. కాకపోతే తొలుత పోలింగ్ బూతుల్లోకి వైసీపీ ఏజెంట్లు ప్రవేశించగలిగారు. ఓ గంటన్నర తర్వాత రాష్ట్ర మంత్రి నాయ కత్వంలో ఓ పటాలం బయల్దేరి బూతుల్లో ఉన్న ఏజెంట్లను బయటకు తరిమేశారు. సాక్షాత్తూ ఒక రాష్ట్ర మంత్రి అక్రమంగా బూత్‌లో చొరబడ్డా, ఏజెంట్లపై దౌర్జన్యం చేసినా ఎన్నికల సంఘం కిమ్మనలేదు. కొన్ని బూతుల్లో కాసేపు ఏజెంట్లు కూర్చున్న ఫలితం ఓట్ల సంఖ్యలో కనిపించింది. అక్కడ వైసీపీకి 6 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. నిజమైన ఓటర్లను అనుమతించని పులివెందులలో వైసీపీకి 683 ఓట్లు వచ్చాయి. అవి కూడా కూటమి సైన్యమే వేసి ఉంటుంది కనుక అందుకు వారికి ఓ వైసీపీ నాయకుడు వెటకారంగా ధన్యవాదాలు తెలియజేశారు.బూటకపు ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత కూటమికి వంత పాడుతున్న మీడియాలోని ఓ ప్రధాన సెక్షన్ స్పందన జుగుప్సాకరంగా ఉన్నది. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినందువల్ల టీడీపీ గెలిచిందట. ముప్పయ్యేళ్ల తర్వాత పులివెందుల ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం లభించిందట! అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ బ్యాలెట్ బాక్సుల్లో స్లిప్పులు వేశారట! స్లిప్పుల బండారాన్ని సోషల్ మీడియాలో ఓ యువకుడు ఎండ గట్టిన తీరు నవ్వు తెప్పిస్తున్నది. కామెంట్లు రాసిన కాగితాలను బ్యాలెట్ బాక్సుల్లో వేయాలంటే ఆ కాగితాన్ని మతడపెట్టి వేయాలి. కానీ ఆ కాగితాలపై మడతలు లేకపోగా ఇస్త్రీ చేసిన ట్టుగా ఉన్నాయంటూ వాటి ఫోటోలను జతజేశాడు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటేయడానికి క్యూలైన్లలో నిలబడిన కూటమి కార్యకర్తలను గుర్తించి, ఆ ఫోటోలను ఒక సెక్షన్ మీడియా ప్రచురించింది. అయినా ఈసీలో స్పందన లేదు. ఈరకంగా వ్యవస్థలన్నీ ప్రలోభాలకు లోనై ఏలినవారి ఎదుట సాగిలపడుతున్న తీరును చూస్తుంటే మన ప్రజాస్వామిక వ్యవస్థ పెనుప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నట్టు హెచ్చరికలు కనిపిస్తు న్నాయి. పౌరులారా బహుపరాక్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రిగ్గింగ్ ఎన్నికల్లో.. సిగ్గుపడే గెలుపు
సాక్షి ప్రతినిధి, కడప, సాక్షి రాయచోటి: ‘‘అసలు ప్రతిపక్షానికి చెందిన ఏజెంట్లే లేకుండా జరిగిన ఈ ఎన్నికలు ఒక ఎన్నికలా..? ఏ ఒక్క బూత్లోనూ విపక్ష ఏజెంట్లను రానివ్వకుండా రిగ్గింగ్ చేసి, అనైతికంగా పోలీసుల సాయంతో గెలిచి సంబరాలు చేసుకోవడం ఏమిటి? ప్రపంచ చరిత్రలో ఏ ఎన్నికా ఇలా జరిగి ఉండదు...!’’ అని ప్రజాస్వామికవాదులు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘దేశంలో ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు పోలీసు వ్యవస్థను వినియోగిస్తారు. కానీ మొట్టమొదటిసారి ప్రజలు ఓట్లు వేయకుండా ఉండేందుకు పోలీసులను వాడిన దుర్మార్గమైన చరిత్ర చంద్రబాబు సర్కారుది..’ అని వ్యాఖ్యానిస్తున్నారు. కళ్లు మూసుకున్న ఎన్నికల కమిషన్!పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో టీడీపీ గట్టెక్కింది! ఎన్నికల ముందు తాలిబన్లు, బందిపోటు ముఠాల మాదిరిగా అటకాయించి వైఎస్సార్ సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులకు తెగబడటంతో మొదలైన పచ్చముఠాల అకృత్యాలు ఎన్నికల రోజు మరింత యథేచ్ఛగా సాగాయి. అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని కొమ్ము కాసే పోలీసుల సహకారంతో ప్రభుత్వ పెద్దలు ఎన్నికల అరాచకాలకు బరి తెగించారు. టీడీపీ నేతలు ఎన్నికల ముందు రోజు రాత్రే వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్ల ఇళ్ల వద్దకు చేరుకుని వారు బయటకు రాకుండా మోహరించారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారితో దొంగ ఓట్లు వేయించారు. దేశ చరిత్రలో తొలిసారిగా అసలు విపక్ష పోలింగ్ ఏజెంట్లే లేకుండా చేసి అధికార పార్టీ అడ్డగోలుగా అరాచకాలకు పాల్పడినా ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. వైఎస్సార్ సీపీ నేతలపై బైండోవర్ కేసులు మొదలు హత్యాయత్నం, కౌంటర్ కేసులు బనాయించి అరెస్టులు చేసుకుంటూ వెళ్లారు. పట్టపగలు నల్లగొండువారిపల్లె గ్రామం మధ్యలో ప్రజలంతా చూస్తుండగా ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగితే నిందితులను ఇప్పటికీ అదుపులోకి తీసుకోలేదు. పైగా కౌంటర్ కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ ఏజెంట్లు బూత్‌ల వద్దకు రాకుండా దగ్గరుండి మరీ అడ్డుకుని టీడీపీ గూండాలకు సహకారం అందించారు. ఏకంగా డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలోనే తిష్ట వేసి ఈ అరాచకాలను పర్యవేక్షించడం విస్మయం కలిగిస్తోంది. ఒంటిమిట్టలో మంత్రి సమక్షంలోనే దాడులు..ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 10.30 వరకు సాఫీగా సాగినా ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు పసిగట్టిన పచ్చముఠాలు బూత్‌లను ఆక్రమించుకుని దౌర్జన్యాలకు తెగబడ్డాయి. ఏకంగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సమక్షంలోనే వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడులకు దిగినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. టీడీపీ గూండాలను వారించకపోగా.. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను రాకుండా కట్టడి చేయడంతో అధికార పార్టీ బూత్‌లలో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకుంది. పోలింగ్ రోజంతా విచ్చలవిడిగా సాగిన టీడీపీ మూకల రిగ్గింగ్, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లతో జాతరను తలపించింది. ఉదయం పోలైన ఓట్లలో ఎక్కువ శాతం వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత పచ్చ ముఠాలు అక్రమాలకు బరి తెగించాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని దొంగ ఓట్లు వేశాయి. సాయంత్రం వరకు విపక్ష ఏజెంట్లు లేకుండా ఈ డ్రామా సాగింది. ఈ అరాచకాలు, అక్రమాలు, ఏకపక్ష ఎన్నికలను నిరసిస్తూ కడపలో జరిగిన కౌంటింగ్‌ను వైఎస్సార్ సీపీ అభ్యర్థితోపాటు ఏజెంట్లు బహిష్కరించారు.అభాసుపాలైన ఎస్ఈసీ..జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వ్యవహరించిన తీరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభాసుపాలైంది. ఓటర్లు నాలుగైదు కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఓట్లు వేయాల్సి వచ్చేలా పోలింగ్ కేంద్రాలను ఇష్టానుసారంగా మార్చేసినా ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకుంది. టీడీపీ నాయకులు దొంగ ఓటర్ల అవతారం ఎత్తిన వైనం మీడియా, సామాజిక మాధ్యమాల్లో రోజంతా వైరల్ అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు మహిళలవి కూడా దొంగ ఓట్లు పోలయ్యాయి. పులివెందులలో 3,684 మంది మహిళలు ఓట్లు వేసినట్లు నమోదైంది. వెబ్ కాస్టింగ్ పరిశీలిస్తే బోగస్ బాగోతం వెల్లడవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యవస్థలన్నీ కుమ్మక్కై రౌడీ రాజ్యానికి పట్టం కట్టారని పులివెందుల ప్రజలు పేర్కొంటున్నారు.ఓటర్లతో మాట్లాడే ధైర్యం ఉందా? సాక్షి, అమరావతి: ఒంటిమిట్ట, పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, అందుకే కౌంటింగ్ ప్రక్రియను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించామని ఒంటిమిట్ట వైఎస్సార్ సీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఒంటిమిట్టలో ఉదయం 11 గంటల వరకు మాత్రమే ఎన్నికలు సజావుగా జరిగాయని, ఆ తరువాత టీడీపీ నేతలు పోలీస్ ప్రొటెక్షన్‌తో రిగ్గింగ్ చేసుకుని దొంగ ఓట్లు వేసుకున్నారని వెల్లడించారు. ఈ రెండు ఉప ఎన్నికలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట, పులివెందులలో ఏ గ్రామానికి వెళ్లినా వేలికి సిరా గుర్తు లేని వారే కనిపిస్తారని చెప్పారు. ప్రతి గ్రామానికి వెళ్లి ఓటర్లకు సిరా గుర్తు ఉందో లేదో విచారణ చేయాలని కోరారు. గ్రామాలకు వచ్చి నిజమైన ఓటర్లతో మాట్లాడే ధైర్యం ఉందా? అని టీడీపీ నేతలకు సవాల్ చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలు టీడీపీకే కడప సెవెన్‌రోడ్స్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం కడప శివార్లలోని మను పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల హేమంత్‌రెడ్డికి 683 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,716 ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె 6,033 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి 6,267 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు. -
ఏజెంట్లే లేకుండా ఎన్నికలా?: వైఎస్ జగన్
మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చల విడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా చంద్రబాబూ? – వైఎస్ జగన్ అసలు ఏజెంట్లే లేకుండా పోలింగ్ నిర్వహిస్తే.. వాటిని ఎన్నికలు అని ఎలా అంటారు? ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశ్నించకపోతే, గొంతు విప్పకపోతే అసలు ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఎన్నికలు హాస్యాస్పదమే అవుతాయి. అప్పుడు ఎన్నికల అవసరం కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్లు అంతా ఓట్లు వేసుకోవడమే. సీఎం చంద్రబాబు, ఆయనతో చేతులు కలిపి అంట కాగుతున్న ఎల్లో మీడియా లక్ష్యం ఇదే. వారి లక్ష్యం ప్రజలకు మంచి చేయడం, పాలకుల మోసాన్ని ప్రశ్నించడం కానే కాదు. కేవలం దోచుకో.. పంచుకో.. తినుకో.. అదే వారి ఎజెండా. దీనికి ప్రజాస్వామ్యం సిగ్గుపడాలి.చంద్రబాబుకు మా డిమాండ్.. అలాగే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారికి మా విన్నపం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే, అది చేజారిపోతే.. నక్సలిజం అక్కడే పుడుతుంది. చంద్రబాబు ఈ రోజు ఒక ప్రమాదకర పరిస్థితికి పునాది వేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. నిన్న జరిగిన రెండు ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్‌గా తీసుకోండి.పులివెందుల జెడ్పీటీసీ కింద ఆరు పంచాయతీలకు సంబంధించి 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఏకంగా 700 మంది పోలీసులను పెట్టారు. కేవలం ఓటర్లను భయపెట్టడం కోసమే అంత మందిని మోహరించారు. ఉదయం 4 గంటలకల్లా జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వారు ఆయా గ్రామాల్లో మకాం వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూత్ వద్ద దాదాపు 400 మంది పాగా వేశారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. వారే ప్రోత్సహించారు. పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, బయట నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు.. అంతా కలిపి మొత్తం 7 వేల మంది ఉంటారు. అంటే ఒక్కో ఓటరుకు బయట నుంచి దాదాపు ఒక్కో రౌడీని ఏర్పాటు చేశారు. సాక్షి, అమరావతి: ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మీరు ప్రజలను మోసం చేశారు. మీ పాలన మొత్తం రాక్షస పాలన అని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అందుకే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ఇదివరకు చంబల్ లోయ బందిపోటు దొంగలను మరిపించేలా.. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అడ్డగోలుగా దొంగ ఓట్లు వేసుకున్నార’ని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇలా అడ్డగోలుగా రాజకీయాలు చేసే వారిని నాయకుడనరని.. చంద్రబాబు ఒక మాబ్స్టర్.. ఫ్రాడ్‌స్టర్ అని తేల్చి చెప్పారు. ‘మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే.. మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే.. వెంటనే మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి’ అని సవాల్ విసిరారు. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే.. మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే.. ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దెప్పిపొడిచారు. ‘ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా?’ అని సీఎం చంద్రబాబుకు మరో సవాల్ విసిరారు. వెబ్ కాస్టింగ్, సీపీ ఫుటేజీ ఇస్తే ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్‌లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది మరింతగా బట్టబయలవుతుందన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల వైఎస్సార్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లను తనతో కూర్చోబెట్టుకుని వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నిక పోలింగ్‌లో పోలీసులు, టీడీపీ నాయకులు జట్టుగా ఏర్పడి వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, ఏజెంట్లపై దౌర్జన్యం చేయడం.. ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను అడ్డుకోవడం.. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులతో దొంగ ఓట్లు వేయించుకోవడం, కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేయడం నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసుల ఏకపక్ష దాడులు.. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల దౌర్జన్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చూపుతూ సాక్ష్యాధారాలతో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరును తూర్పారబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు. అందుకు నిన్న (మంగళవారం) జరిగిన ఎన్నికలు (పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు) ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలింగ్ బూత్‌లలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో 15 పోలింగ్ బూత్‌లు ఉండగా, వాటిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అస్సలు ఉండనివ్వలేదు. ఏ ఒక్క ఏజెంట్‌ను బూత్ దగ్గరకు పోనివ్వకుండా ఆపేసి రిగ్గింగ్ చేశారు. పోలీసుల ప్రోద్బలంతో బూత్‌లలోకి ఏజెంట్లను పోనివ్వలేదు. ఇంత దారుణం ఏ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా ఉండదేమో.. ఒక్క మన రాష్ట్రంలో తప్ప!.పోలింగ్ ఏజెంట్ల కీలక బాధ్యతలు ⇒ అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్ హక్కులు, బాధ్యతలు ఏమిటంటే.. దొంగ ఓటర్లను గుర్తించడం. ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం. ఎక్కడైనా అక్రమాలు గుర్తిస్తే, వెంటనే పోలింగ్ అధికారికి చెప్పడం. అలాగే అవే వివరాలు పార్టీకీ తెలియజేయడం. ఈ బాధ్యతలన్నీ ఏజెంట్లకు ఉంటాయి కాబట్టే.. వారికీ హక్కులు కల్పించబడ్డాయి. ⇒ ఒక పోలింగ్ ఏజెంట్ బూత్‌లోకి వెళ్లగానే పోలింగ్ మొదలవడానికి ముందే ఫామ్–12 (వారి అపాయింట్మెంట్ కోసం పార్టీ ఇచ్చేది)ను అక్కడి ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు ఇస్తారు. ఆ తర్వాత బూత్‌లో కూర్చుంటాడు. కానీ నిన్న (మంగళవారం) మా పార్టీ ఏజెంట్ల నుంచి ఆ ఫామ్‌లను టీడీపీ వారు, పోలీసులు లాక్కుని చింపేశారు. ఆ స్థాయిలో ప్రజాస్వామ్యం దిగజారి పోవడం చరిత్రలో చూసి ఉండం.⇒ ఓటరు బూత్‌లోకి రాగానే తన పేరు చెబుతాడు. అక్కడ పోలింగ్ ఆఫీసర్ సంతకం తీసుకుని బ్యాలెట్ ఇస్తాడు. రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ అయితే, దాన్ని నిర్ధారించేది పోలింగ్ ఏజెంట్. పోలింగ్ ముగిసిన తర్వాత ఫాం–32ను నింపి ఆ బూత్‌లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయనేది రికార్డు చేస్తారు. బూత్‌లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రిసైడింగ్ ఆఫీసరు.. ఏజెంట్ నుంచి ఒక రిసీట్ కూడా తీసుకుంటాడు. ఆ రికార్డుతో ఈ రిసీట్‌ను కూడా జత చేయాలి. మరోవైపు ఆ రికార్డును ధృవీకరించడమే కాకుండా, బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేసే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు. చివరకు ఆ సీల్‌పై కూడా పోలింగ్ ఏజెంట్ సంతకం చేస్తాడు. ఈ ఉప ఎన్నికల్లో ఇవన్నీ జరిగాయా? ఈ రోజు ఎంత దారుణంగా వారు ఎన్నికలు నిర్వహించారంటే, ప్రజాస్వామ్యాన్ని ఎంతగా ఖూనీ చేశారంటే.. ఒక్కమాటలో చెప్పాలంటే అచ్చం చంబల్‌లోయ బందిపోట్ల మాదిరిగా వ్యవహరించారు. పోలీసులే దగ్గరుండి అన్నింటినీ ప్రోత్సహించారు. చంద్రబాబుకు ఇదే నా సవాల్ ⇒ మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే, వెంటనే నిన్నటి ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాలు దింపి, వారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించండి. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే, మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా? మీకు ఆ ధైర్యం లేదు. అయినా ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్‌లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది చూపుతాం. ఇలా అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుణ్ని లీడర్ అనరు. మాబ్స్టర్ లేదా ఫ్రాడ్‌స్టర్ అంటారు. ⇒ ఎంత దారుణంగా నిన్నటి ఎన్నికలు జరిగాయంటే.. ఎక్కడైనా ఏ ఊరి ఓటర్లు ఆ ఊరిలోనే ఓట్లు వేస్తారు. ఎప్పుడైనా, ఎక్కడైనా అదే జరుగుతుంది. ఓటర్లు వారి సొంత ఊళ్లలోనే ఓటేయడం సహజం. కానీ, ఇక్కడ చంద్రబాబు ఏకంగా ఒక ఊరి నుంచి మరో ఊరికి పోలింగ్ బూత్‌లు మార్చేశారు.⇒ ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, నల్లగొండవారిపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, మళ్లీ నల్లపురెడ్డిపల్లి వారు ఎర్రబల్లికి.. నల్లపురెడ్డిపల్లి నుంచి నల్లగొండవారిపల్లికి వెళ్లి ఓటు వేయాలంట. 4 కిలోమీటర్లు నడిచి వెళ్లేలా పోలింగ్ సెంటర్లు మార్చారు.⇒ దాదాపు 10,600 ఓట్లకు గాను, 4 వేల ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. స్కెచ్ అక్కడే మొదలైంది. ఇంకా వారి ఆలోచన ఏమిటంటే, ఓటర్లు 4 కిలోమీటర్లు నడిచి పోతుంటే బెదిరించాలి. దాడి చేసి అడ్డగించాలి. ఓటేయకుండా చూడాలి. నిన్న అదే జరిగింది.ఏకంగా గ్రామాలే పంచుకున్నారుఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా? టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అరాచకం సృష్టించేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత ఎర్రబల్లెలో తిష్ట వేస్తే.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి భారీగా తన అనుచరులతో నల్లపురెడ్డిపల్లెలో మకాం వేశాడు. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఇ.కొత్తపల్లిలో వందల మంది కార్యకర్తలతో మకాం వేస్తే.. బీటెక్ రవి అనే టీడీపీ నాయకుడు పులివెందుల రూరల్ ఓటరు కాకపోయినా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు. పోలింగ్ బూత్‌లకు వైఎస్సార్సీపీ ఏజెంట్లు వెళితే, వారిపై దాడి చేసి, ఫామ్‌లు లాక్కుని చింపేశారు. ఓటర్ల స్లిప్‌లు కూడా లాక్కుని వారిని వెనక్కి పంపి, వారే ఓటు వేసుకున్నారు. ఎవరైనా వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైనా, లేక తటస్థుడైనా బూత్ వైపు వస్తే టీడీపీ వారు బెదిరించి ఓటరు స్లిప్ లాక్కుని దౌర్జన్యంగా బయటకు పంపించారు.పులివెందుల మండలంలో టీడీపీ నేతల ఆగడాలను విలేకరుల సమావేశంలో వివరిస్తున్న వైఎస్ జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి⇒ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో ఇన్ని అక్రమాలతో జరిగింది ఎన్నికలేనా? అసలు ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?⇒ ఉదయం 4 గంటల నుంచే పోలింగ్ బూత్‌ల ఆక్రమణ నిజం కాదా?⇒ పులివెందుల టౌన్లో ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి అక్రమ అరెస్ట్ నిజం కాదా? నిజానికి అక్కడ ఎన్నిక లేదు. అయినా తెల్లవారుజామున అరెస్టు చేశారు.⇒ మొట్నూతలపల్లెకు 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు ఆపి, ఓటర్లను అడ్డగించడం నిజం కాదా?⇒ ఎర్రపల్లెలో మహిళలను ఓటు వేయనివ్వక పోవడం నిజం కాదా? ⇒ కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి, మంచంపై రైఫిల్ పెట్టి బెదిరించడం వాస్తవం కాదా?⇒ ఎర్రపల్లెలో రిగ్గింగ్‌కు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు స్వాగతం పలకలేదా?⇒ కనంపల్లెలో రిగ్గింగ్ జరిగిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం, బిటెక్ రవి తమ్ముడు భరత్ బెదిరింపులు నిజం కాదా?⇒ తమను ఓటు వేయనీయాలంటూ ఓటర్లు కనంపల్లెలో పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకోలేదా?⇒ పులివెందులలో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిని బయటకు రానివ్వకపోవడం నిజం కాదా?⇒ ఒంటిమిట్టలోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఓటర్లు వాపోలేదా?⇒ ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ వాళ్లు స్లిప్‌లు ఇస్తూ, దొంగ ఓట్లు వేయించలేదా?⇒ ఎన్నిక పులివెందుల రూరల్‌లో జరుగుతుంటే, పులివెందులలో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్‌కు డీఐజీ కోయ ప్రవీణ్ వెళ్లి ఎందుకు హడావుడి చేశారు? ⇒ ‘కాల్చి పారేస్తా నా కొడకా’ అంటూ డీఎస్పీ మురళి బెదిరించడం వాస్తవం కాదా?⇒ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ సెంటర్లో దౌర్జన్యం చేయలేదా? మా పార్టీ ఏజెంట్‌పై దారుణంగా దాడి జరగలేదా?⇒ చంద్రబాబూ.. నీవు నిజంగా మంచి చేశావనుకుంటే ఎందుకీ అక్రమాలు?భవిష్యత్తులో అవి మీకే చుట్టుకుంటాయి మీరు దౌర్భాగ్య పని చేస్తున్నారు. తప్పుడు వి«ధానానికి బీజాలు వేస్తున్నారు. అవే రేపు వృక్షాలు అవుతాయి. గ్రామాల్లో ఇప్పుడు మీరు తీసుకొచ్చే కక్షలు, దాడులు రాబోయే రోజుల్లో మీకే చుట్టుకుంటాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవే మీకు ఆఖరి ఎన్నికలు కావొచ్చు. ఈ వయసులో ఈ పనులేంటి? కనీసం రామ, కృష్ణ అనుకుంటే పుణ్యం వస్తుంది. ఈ విధంగా చేస్తే నరకానికి పోతావు. ఇప్పటికన్నా రవ్వంత మార్పు తెచ్చుకోమని చంద్రబాబుకు గట్టిగా హితవు పలుకుతున్నా.డమ్మీ కన్నా దారుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా, దురదృష్టవశాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) డమ్మీ కన్నా దారుణమైన పాత్ర పోషిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తోంది. ఇది చాలా దురదృష్టకరం. అందుకే కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. కోర్టులో కేసులు వేస్తాం. ఈ ఆధారాలన్నీ చూపుతాం. నిన్న పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా అందుకే ఇక్కడికి వచ్చారు. పోలీసులు పూర్తి వివక్ష⇒ ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి వైఎస్సార్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఐదు మంది కలిసి వెళ్లినా కూడా పోలీసులు తరిమి తరిమి కొట్టారు. మహిళా ఏజెంట్లపైనా దాడులు చేశారు. ఇతర నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్లు వందల మంది ఒకే చోట ఉన్నా కూడా షామియానాలు వేసుకుని, భోజనాలు చేస్తున్నా పోలీసులు వేడుక చూశారు. ⇒ ఈ ఎన్నికల కోసం పోలీసులను ఏరికోరి నియమించుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్రావు సమీప బంధువు. వరసకు అల్లుడు అవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపారు. ఆయన అచ్చంగా పచ్చ చొక్కా వేసుకుని సోమవారం రాత్రి నుంచే తనకు కావాల్సిన వారిని విధుల్లోకి తీసుకుని పులివెందులలో మకాం వేసి, ఎన్నికలు జరిపారు. యథేచ్ఛగా దోపిడీ, వాటాలు చంద్రబాబునాయుడు చేస్తున్న అవినీతిలో వీళ్లందరూ భాగస్వాములు. డీఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్లు.. మాఫియా రింగ్ లీడర్ ఎవరంటే డీఐజీ. బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి.. ఇసుక, మట్టి, ల్యాటరేట్, క్వార్ట్›జ్, సిలికా.. పేకాట క్లబ్బులు.. ఇంకా ఏ మైన్ ఉన్నా కలెక్షన్ అంతా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. వచ్చిన దాంట్లో ఎమ్మెల్యేలకు ఇంత.. చినబాబుకు ఇంత.. పెదబాబుకు ఇంత అని ఈ డీఐజీలు, డీఎస్పీలు, సీఐలు నడిపిస్తున్నారు. ఇదీ ముఠా నాయకత్వం.చంద్రబాబు మాట వినకపోతే.. ఒకవేళ పోలీసు అధికారులు ఎవరైనా చంద్రబాబు మాట వినకపోతే.. డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు కావాల్సిందే. పీఎస్ఆర్ ఆంజనేయులు జైలుకెళ్లారు. దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్‌కుమార్, అడిషనల్ డీజీ సంజయ్, విశాల్ గున్నీలపై అక్రమ కేసులు పెట్టారు. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిరాణా టాటాపై కూడా అక్రమ కేసు. ఇంకా ఎంతో మందిని సస్పెండ్ చేశారు. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. వీరు కాక నలుగురు నాన్‌క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్ కమాండెంట్లు, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్లను హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, వందలాది మంది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు.ఆనాడు ఏం జరిగిందో గుర్తుందా?2017లో నా ప్రజా సంకల్పం పాదయాత్ర మొదలు కావడానికి ముందు నంద్యాల ఉప ఎన్నికలోనూ ఇలాగే చేశారు. 27 వేలతో గెల్చి ఇక మా పార్టీ పనైపోయిందని అదేపనిగా చెప్పారు. కానీ ఏం జరిగింది? సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అదే నంద్యాలలో 35 వేలతో గెల్చాం. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రమంతా చంద్రబాబును భూస్థాపితం చేశాం. ఇంకో మూడున్నర ఏళ్ల తర్వాత ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారు. మీకు కనీసం డిపాజిట్లు కూడా రావు.ఇవిగో ఆధారాలు..⇒ ఇతర నియోజకవర్గాలు, మండలాల నుంచి వచ్చిన వారు ఎలా దొంగ ఓట్లు వేసింది.. వారు ఎవరనే పూర్తి వివరాలతో ఈ ఫొటోల్లో (ఫొటోలు చూపుతూ) చూడండి. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే వారు దొంగ ఓట్లు వేశారు. ఆ వేసింది జమ్మలమడుగుకు చెందిన (ఫొటో చూపుతూ) టీడీపీ కార్యకర్తలు దస్తగిరి, సందీప్‌కుమార్. నల్లపురెడ్డిపల్లె పోలింగ్‌బూత్‌లో వారు దొంగ ఓట్లు వేశారు. మరో ఆశ్చర్యం ఏమిటంటే, ఈ రోజు (బుధవారం) రీ పోలింగ్‌లో కూడా దొంగ ఓట్లు వేస్తున్నారు (ఆ ఫోటోలు కూడా ప్రెస్మీట్లో చూపారు). పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేరు కాబట్టి, యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు.⇒ జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ప్రకాశం, మైలవరానికి చెందిన ద్వారచర్ల జనార్ధనరెడ్డి నల్లపురెడ్డిపల్లెలో ఓటు వేశారు.⇒ పొన్నతోట మల్లికార్జున టీడీపీ జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి (చంద్రబాబుతో దిగిన ఫొటో ప్రదర్శించారు). జమ్మలమడుగు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కూడా. వీళ్లందరూ వచ్చి పులివెందులలో ఓట్లు వేశారు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ అనే వాడిని ఉండనివ్వలేదు. ఇక అడిగేవాడు లేడని దొంగ ఓట్లు వేసుకున్నారు. కలెక్టర్ రెండు చేతులు జేబులో పెట్టుకుని దొంగ ఓట్లు వేయిస్తున్నాడు.⇒ కర్మలవారిపల్లె గ్రామం టీడీపీ సర్పంచ్ మారెడ్డి చిన్నపుల్లా రెడ్డి పులివెందులలో ఓటు వేశారు. జమ్మలమడుగు మండలానికి చెందిన నాగేశ్వరరెడ్డి, అదే మండలంలోని గూడెం చెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డిలు నల్లపురెడ్డిపల్లెలో దొంగ ఓటు వేశారు.⇒ నవాబుపేట గ్రామానికి చెందిన రామస్వామిరెడ్డి, భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్, హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్, కమలదిన్నె గ్రామానికి చెందిన మంత్రి కుళ్లాయప్ప ఇలా అందరూ దొంగ ఓటర్లే. ⇒ విచిత్రంగా బుధవారం రీ పోలింగ్ జరుగుతుంటే కూడా.. కమలాపురం నియోజకవర్గానికి చెందిన నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గుజ్జల నారాయణ యాదవ్ పులివెందులలోని ఈ కొత్తపల్లిలో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డాడు. ఇలా రిపిటేషన్ పద్ధతిలో దొంగ ఓటర్లను తిప్పుకున్నారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ
కళ్లు మూసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం సాక్షిగా, రౌడీమూకల్లా చెలరేగిన పోలీసుల సాక్షిగా మంగళవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో పచ్చమందలు అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. నిజమైన ఓటర్లు పోలింగ్ కేంద్రాల సమీపానికి రాకుండా అధికార పక్షం దౌర్జన్యాలకు దిగితే.... వాటిని ఎదిరించి వచ్చినవారిని పోలీసులు తరిమికొట్టారు. ఓటు వేసేందుకు అనుమతించాలంటూ కాళ్లావేళ్లా పడినవారిని సైతం కనికరించలేదంటే... ఓటర్ల దగ్గర స్లిప్‌లు గుంజుకుని, మీ దగ్గర స్లిప్‌లు లేవుగనుక ఓటేయటం కుదరదని పోలీసులు దబాయించారంటే ఏపీలో పరిస్థితేమిటో అర్థంచేసుకోవచ్చు. ఏనాడూ సవ్యంగా అధికారంలోకి రావటం చేతగాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రెండు స్థానాల్లో అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని పాyð క్కించారు. దీన్ని కప్పిపుచ్చ టానికి బుధవారం రెండు కేంద్రాల్లో మాత్రం రీపోలింగ్ తంతు నిర్వహించి అయిందనిపించారు. తొలినాటి ఉదంతాలే మర్నాడూ పునరావృతమయ్యాయి. స్థానికేతర టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ చెలరేగిపోతుంటే చోద్యం చూసిన పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ స్థానిక నాయకుల్ని అరెస్టులతో, గృహనిర్బంధాలతో ఎటూ కదలనివ్వలేదు. అభ్యర్థులను తిరగనివ్వలేదు.అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం అక్రమంగా నాలుగు గ్రామాల పోలింగ్ కేంద్రాలను 2 నుంచి 4 కిలోమీటర్ల దూరాల్లోవున్న వేరే గ్రామాలకు తరలించటంతోనే ఈ ఉప ఎన్నికల ప్రహసనం మొదలైంది. అన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటేయటం వృద్ధులకూ, అనారోగ్యం బారినపడిన వారికీ అసాధ్యమని లెక్కేసుకుని ఈ మార్పు చేశారు. మహిళలు, వృద్ధులతోసహా సాధారణ ఓటర్లంతా ఇలాంటి మాయోపాయాలను బేఖాతరు చేశారు. కానీ వారికి రక్షణగా నిలబడాల్సిన పోలీసులే వృత్తి ధర్మానికి ద్రోహం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాలు మార్చటాన్ని హైకోర్టు తప్పుబట్టినా, చివరి నిమిషంలో సవరించటం అసాధ్యమని భావించింది. ఇదే అదునుగా జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు వంటి చోట్లనుంచి వచ్చిన రౌడీమూకలు ఎడాపెడా రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రంలో వుండగానే దొంగ ఓటర్లు బారులు తీరారంటే ఈ బరితెగింపు ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలిసో తెలియకో తమ ‘ఘనత’ను చాటుకోవటానికి జిల్లా కలెక్టర్ ఈ ఫొటోలనే సామాజిక మాధ్యమాల్లో వుంచి నగుబాటుపాలై తిరిగి వాటిని తొలగించాల్సి వచ్చింది. అధికారులకు వ్యక్తిగత స్థాయిలో ఇష్టాయిష్టాలుండొచ్చు. అధికార పార్టీకి పరిచారికలుగానో, పాలేళ్లుగానో మారాలని ప్రాణం కొట్టుమిట్టాడొచ్చు. అలాంటివారు రాజీనామా చేసి పోవాలితప్ప, జనం ఎంతో కష్టపడి పన్నుల రూపంలో చెల్లించే సొమ్మును నెలనెలా జీతాలుగా తీసుకుంటూ... కుటుంబాలను పోషించుకుంటూ కాలసర్పాల మాదిరిగా అదే జనాన్ని కాటేయాలని చూడకూడదు. సిగ్గూ లజ్జా, మానాభిమానాలు వున్నవారెవరైనా ఇలాంటి హీనస్థితికి దిగజారతారా? ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి తరమటం మాత్రమే కాదు... కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లను కూడా పోలింగ్ కేంద్రాల్లోకి రానీయకుండా నిర్వహించిన ఈ ఉప ఎన్నికలు ‘ప్రశాంతంగా’ జరిగాయని ప్రకటించటానికి అధికార యంత్రాంగానికి ఏమాత్రం సిగ్గనిపించకపోవటం విస్మయం కలిగిస్తుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 15 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం అని సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల సంఘమే ప్రకటించింది. మరి అక్కడుండే వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? మంత్రి సమక్షంలోనే పోలింగ్ ఏజెంటును ఒక్కడిని చేసి అత్యంత దారుణంగా కొట్టారన్న సమాచారం ఆ సంఘానికి చేరిందా? అనేకచోట్ల ఏజెంట్లు లేకుండానే పోలింగ్ కొనసాగిన వైనం ఆ సంఘానికి తెలుసా? ఓటర్లెవరో, కానివారెవరో గుర్తించటానికి ఏజెంట్లుంటారు. పోలింగ్ పూర్తయ్యాక అంతా సవ్యంగా పూర్తయినట్టు వారినుంచి సంతకాలు తీసుకుంటారు. జరిగిన తంతు చూస్తుంటే ఆ సంతకాలను కూడా ఫోర్జరీ చేయదల్చుకున్నారా అనే సంశయం ఏర్పడుతోంది.పోయే కాలానికి కుక్కమూతి పిందెలని నానుడి. సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా అక్రమాలకు పాల్పడటం ఆదినుంచీ అలవాటైన బాబుకు ‘అతని కంటె ఘనుడ’న్నట్టు పుత్రరత్నం తోడయ్యాడు. అందుకే ఈసారి బరితెగింపు అవధులు దాటిన వైనం కనబడుతోంది. ఇలాంటి దుష్టపోకడల్ని చూస్తూ వూరుకుంటే ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టదు. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి. ప్రహసన ప్రాయంగా మారిన ఈ ఉప ఎన్నికలను రద్దుచేయాలి. బాధ్యులైన అధికార్లను సాగనంపాలి. వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసినట్టు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి పోలింగ్ నిర్వహించాలి. -
రీ పోలింగ్ జరిపిస్తే అన్ని బూత్‌లలో జరిపించాలి
-
పోలీస్ రాజ్యంలో పచ్చ మూకల రిగ్గింగ్
అధికారమదమెక్కిన ‘పచ్చ’గూండాల సాక్షిగా.. పచ్చనోట్లకు అమ్ముడుపోయిన పోలీసుల సాక్షిగా.. ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన ఖాకీలే పౌరులపై జులుం చేస్తుంటే.. ఓటు చోరులకు పెత్తనం ఇస్తుంటే.. ఓటు స్వామ్యం చిన్నబోయింది. తెల్లారకముందే.. చిరు చీకట్లు వీడకముందే ఖాకీ.. ఖద్దరు ద్వయం ఏకమై.. దౌర్జన్యకాండ రాసింది. గడప దాటొద్దంటూ.. ఏజెంట్లు రాకూడదంటూ.. ఓటర్ల హక్కులను కాలరాసింది. ఎన్నికను ఏకపక్షంగా మార్చడానికి ప్రజాస్వామ్య విలువల్ని నిలువునా పాతరేసింది. ఒక ఎన్నిక.. వంద కుట్రలు... గంతలు కట్టిన ‘నిఘా కళ్ల’తో.. గల్లంతైన పోలింగు కేంద్రాలతో.. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చిన్నబోయాయి.. దొంగ ఓటర్ల వేలిపై పడ్డ సిరా చుక్క సైతం సిగ్గు పడింది. కూటమి నేతల అరాచకాలు.. పరాకాష్టకు చేరిన వేళ.. ‘బ్యాలెట్ బాక్స్’సైతం మౌనంగా రోదించింది. ఈ మాత్రం ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రం మారింది.. పోలీసు తీరు మారింది.. ఎల్లో గూండాల రాజ్యంలో ఓటు సైతం గల్లంతైంది.. చివరికి ‘దొంగ ఓటే’ బ్యాలెట్టులో నిక్షిప్తమైంది. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. ఐసిస్, తాలిబన్, హమాస్ తీవ్రవాదులు.. పిండారీలు, థగ్గులు వంటి బందిపోట్లు కలగలిసినా తమ ముందు దిగదుడుపేనని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో పెదబాబు, చినబాబు సారథ్యంలోని టీడీపీ కాలకేయులు చాటిచెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులపై హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, ప్రలోభాలు మొదలు.. ఎన్ని అడ్డదారులు తొక్కినా ఆ రెండు జెడ్పీటీసీ స్థానాల్లో తమ అభ్యర్థులకు ఘోర పరాజయం తప్పదని తమ అంతర్గత సర్వేల్లో తేలడంతో పెదబాబు, చినబాబు నిస్సిగ్గుగా బరితెగించారు. ఎలాగైనా సరే.. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో గెలిచి తీరాల్సిందేనని తమ కాలకేయ సైన్యానికి దిశా నిర్దేశం చేశారు. అత్యంత క్రూరులైన పచ్చ కాలకేయులకు కొంత మంది పోలీసు అధికారులను పెదబాబు, చినబాబు జత చేశారు. దీంతో మంగళవారం పోలింగ్ సందర్భంగా టీడీపీ కాలకేయ సైన్యం ఆకాశమే హద్దుగా చెలరేగింది. విచక్షణ మరచి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. పోలీసులే ముందుండి అరాచకంస్వేచ్ఛగా ఓటు వేసేందుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాల్సిన పోలీసులే అరాచకానికి తెరతీశారు. పోలింగ్ ప్రారంభానికి 2.30 గంటల ముందే అంటే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకే వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డిలను పోలీసులు నిర్బంధించారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలో 15 పోలింగ్ బూత్‌లు ఉంటే, ఏ ఒక్క బూత్‌లోకి కూడా వైఎస్సార్సీపీ ఏజెంట్లను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలింగ్ బూత్‌కు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న ఓటర్లను పోలీసులే అడ్డుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని మహిళా ఓటర్లు కాళ్లు పట్టుకున్నా పోలీసులు కనికరించలేదు. తమ కళ్లెదుటే స్లిప్పులను ఓటర్ల నుంచి టీడీపీ గూండాలు లాక్కుని దౌర్జన్యం చేసినా ప్రేక్షక పాత్ర వహించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు, నాయకులపై టీడీపీ గూండాలు అత్యంత పాశవికంగా దాడులు చేస్తున్నా పోలీసులు కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదు. సోమవారం రాత్రికే జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ గూండాలు, రౌడీలు ఒక్కో పోలింగ్ బూత్ వద్దకు 300 నుంచి 400 మంది వరకు చేరుకుని, అక్కడే తిష్టవేశారు. పోలింగ్ బూత్‌లను హైజాక్ చేసి.. మంగళవారం ఉదయం 7 గంటలకే ఆ రౌడీలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారు.. రిగ్గింగ్ చేశారు. చివరకు పులివెందుల జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి.. అతని జనరల్ ఏజెంట్ ఎం.బాలరామిరెడ్డిని ఓటు వేయనివ్వకపోగా.. వారి ఓట్లను కూడా దొంగగా వేసుకున్నారంటే టీడీపీ గూండాల దౌర్జన్యం, పోలీసుల అరాచకం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1951 అక్టోబర్ 25న తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. అంటే 74 ఏళ్ల దేశ ఎన్నికల చరిత్రలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నిక పోలింగ్ అంత దుర్మార్గంగా మరో ఎన్నిక జరగలేదని ఎన్నికల నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ రిటైర్డు ఐఏఎస్ అధికారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకే ఈ ఉప ఎన్నిక కళంకంగా నిలిచిపోతుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు అత్యంత దుర్మార్గంగా పోలింగ్ ⇒ పులివెందుల వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంతరెడ్డి ఇంటి చుట్టూ మంగళవారం తెల్లవారుజామునే 200 మందికిపైగా జమ్మలమడుగు, కమలాపురం నుంచి వచ్చిన టీడీపీ గూండాలు చేరుకుని సాయంత్రం వరకు అక్కడే తిష్ట వేసి పార్టీ చేసుకున్నారు. హేమంతరెడ్డిని ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. ⇒ పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలో 15 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పటికీ.. ఎక్కడా వైఎస్సార్సీపీ ఏజెంటు కూర్చునేందుకు భద్రత కల్పించలేదు. టీడీపీ నేతల దౌర్జన్యానికి, వారిపై గ్రామస్తులు తిరుగుబాటు చేయకుండా పోలీసులు పహారా కాశారు. ⇒ రాగిమానుపల్లె, అచ్చవెళ్లి, ఎర్రిపల్లె, యర్రబల్లె–1, యర్రబల్లె–2, ఈ.కొత్తపల్లె పంచాయతీల పరిధిలో 15 పోలింగ్ బూత్‌లు ఉండగా, ఏ ఒక్కచోట కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థి పోలింగ్ ఏజెంటును కూర్చోనివ్వలేదు. హేమంతరెడ్డి సొంతూరు తుమ్మలపల్లి, బాలరామిరెడ్డి సొంతూరు నల్లపురెడ్డిపల్లెలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ గూండాలు వందల మంది పోలింగ్ కేంద్రం వద్ద మకాం వేశారు. పోలింగ్ బూత్‌కు వెళ్లేందుకు ఆస్కారం లేకుండా అడ్డగించారు. వస్తే దాడి చేస్తామని హెచ్చరికలు పంపారు. పోలీసులను రక్షణ కల్పించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. ⇒ పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లుగా కూర్చునేందుకు పోలీసులు, టీడీపీ గూండాలు అనుమతించలేదని తెలిసి మహిళలు సాహసం చేశారు. తాము పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటామని ఎర్రిపల్లెకు చెందిన అన్నారెడ్డి మమత, మునేశ్వరీ, గంగాభవానీ వెళ్లారు. టీడీపీ రౌడీలు అడ్డగించినా లెక్కచేయకుండా పోలింగ్ బూత్‌లోకి వెళ్తుంటే.. పోలీసులు అడ్డుతగిలి బెదరగొట్టి వెనక్కు పంపారు. ⇒ నల్లగొండువారిపల్లెకు చెందిన సంధ్య నల్లపురెడ్డిపల్లెలో ఏజెంటుగా కూర్చునేందుకు వచ్చినా పోలీసులు అదే రీతిలో బెదరగొట్టారు. ‘ఎవ్వరూ ఏజెంటుగా లేకపోతే, మీరొచ్చి ఏమి చేద్దామని? నోరు మూసుకొని పోండి’ అంటూ టీడీపీ రౌడీ మూక బెదిరించింది. విశ్వ ప్రయత్నం చేసినా పోలీసులు సహకరించక పోవడంతో వారు వెనుతిరిగి వెళ్లారు.రాజ్యమేలిన రౌడీయిజంపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ రౌడీయిజం రాజ్యమేలింది. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇంటికి పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐలు వెంకటరమణ, ఉలసయ్య, చాంద్‌బాషా నేతృత్వంలో భారీగా పోలీసులు చేరుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసి, కడప వైపు తీసుకెళా్లరు. ‘పోలీసులకు సహకరిస్తాం, హౌస్ అరెస్టు చేసుకోండి, ఎక్కడికీ వెళ్లను, పైగా జ్వరం వస్తోంది’ అని చెప్పినా పోలీసులు అత్యంత కిరాతకంగా లాక్కువెళ్లి వాహనంలోకి బలవంతంగా తోశారు. ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయడం.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డితోపాటు కీలక నేతలను పోలీçÜులు గృహ నిర్బంధం చేయడంతో పెదబాబు, చినబాబు పన్నిన కుట్ర అమలుకు మార్గం సుగమమైంది. పోలీసుల ఏకపక్ష చర్యల కారణంగా కేడర్ పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లలేకపోయింది. మరింతగా రెచ్చిపోయి టీడీపీ నేతలు ఏకపక్షంగా పోలింగ్ నిర్వహించుకున్నారు.ఎక్కడికక్కడ ఓటర్ల అడ్డగింతస్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాల్సిన పోలీసులే అరాచకానికి తెగబడ్డారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్న వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఓటర్లను పోలీసుల పహారాలో టీడీపీ రౌడీమూకలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఓటర్ల నుంచి ఓటరు స్లిప్పులు లాక్కుని వారిని వెనక్కి పంపించేశారు.అవే ఓటరు స్లిప్పులను ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ రౌడీలకు ఇచ్చి దొంగ ఓట్లు వేయించారు. టీడీపీ వర్గీయులైన వారిని మాత్రమే ఓటు వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ముందస్తు పథకం ప్రకారం క్యూలైన్లలో టీడీపీ గూండాలను బారులు తీరేలా చేసి.. పూర్తిగా ఏకపక్షంగా సైక్లింగ్ చేసుకుంటూ.. దొంగ ఓట్లు వేసుకున్నారు.. రిగ్గింగ్ చేసుకున్నారు.పోలింగ్ బూత్‌ల వద్దనున్న బీఎల్ఓల నుంచి ఓటర్ల వివరాలు తీసుకుని.. కడప పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్‌రెడ్డి పీఏ సుదర్శన్‌రెడ్డి దగ్గరుండి స్లిప్‌లు రాయిస్తూ దొంగ ఓట్లను ప్రోత్సహించారు. ఎర్రిబల్లిలో టీడీపీ నేత పుత్తా లక్ష్మిరెడ్డి, కమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ రాఘవరెడ్డి, జమ్మలమడుగు జంబాపురం రమణారెడ్డి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మల్లికార్జున, సర్పంచ్ పుల్లారెడ్డి, గూడెంచెరువు శివారెడ్డి, చిన్నదండ్లూరు రామచంద్రయ్య, కల్వటాల రాజన్న, కంబాలదిన్నె కుళాయి, బీమగుండం రాజగోపాల్, నవాబుపేల మర్రి ప్రకాశం, రామస్వామిరెడ్డి, ద్వారకచర్ల జనార్ధన్‌రెడ్డి.. కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ వర్గీయులంతా 15 పోలింగ్ బూత్‌ల్లో ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు వేశారు.ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాలు మీడియానూ వదలలేదు. ఏకపక్ష పోలింగ్‌పై ఎలాంటి కవరేజ్ లేకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో ‘రికార్డు చేయవద్దని చెబుతుంటే అర్థం కాలేదా..’ అని గద్దిస్తూ కర్నూలు నుంచి వచ్చిన ఎన్టీవీ ప్రతినిధి కెమెరాను యర్రబల్లెలో ధ్వంసం చేశారు. ‘సాక్షి’ ప్రతినిధులకు అడుగడుగునా ఆటంకం కలిగిస్తూ.. భౌతిక దాడులు చేసేందుకు యత్నించారు. పచ్చ మూకల రౌడీయిజంతో మంగళవారం పులివెందుల మండలం అట్టుడికింది. -
టీడీపీ గూండాగిరీకి పోలీసుల గులాంగిరీ
జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాక్షిగా పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఖాకీలే పచ్చరౌడీల్లా తెగబడ్డారు. పోలీసు పహారాలోనే అధికారిక రిగ్గింగ్ యథేచ్ఛగా సాగిపోయింది. టీడీపీ కూటమి కుతంత్రాన్ని పచ్చ ఖాకీలు అంతా తామై అమలు చేశారు. రాజ్యాంగాన్ని నిర్భీతిగా కాలరాశారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో పోలీసులు సర్వం తామై ఎన్నికల అక్రమాలకు బరితెగించారు. ఓటు వేసే ప్రజల రాజ్యాంగ హక్కును అడ్డుకున్నారు. దాడులతో తెగబడి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. సామాన్యులు కనీసం పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ గూండాలు దాడులకు తెగిస్తూ బీభత్సం సృష్టిస్తున్నా చోద్యం చూశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ రౌడీలు దొంగ ఓట్లు వేసేందుకు రాచబాట పరిచారు. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు ప్రభుత్వ అరాచకానికి వత్తాసు పలకడమే విద్యుక్త ధర్మం అంటూ పోలీసులు కొత్త మాన్యువల్‌ను అమల్లోకి తెచ్చారు. పత్తేపారం చేస్తున్నారా అనే దిగజారుడు భాషతో పచ్చ ఖాకీల అధికారిక రౌడీయిజానికి డీఐజీ కోయ ప్రవీణ్ రింగ్ మాస్టర్‌గా వ్యవహరించారు. ఈయన ఓ టీడీపీ మాజీ ఎంపీ అల్లుడే కావడం గమనార్హం. లాఠీచార్జితో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెల్లాచెదురు చేయమని పచ్చ పైత్యం ప్రదర్శించారు. ఇక, కాల్చిపారేస్తా.. నా కొడకా అంటూ డీఎస్పీ మురళీనాయక్ పచ్చిరౌడీలా చెలరేగిపోయారు. ఎస్పీ అశోక్‌కుమార్ నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు మొత్తం పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కుట్రలో భాగస్వామిగా మారింది. ఓటర్లను అడ్డుకునేందుకు పక్కా స్కెచ్ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అక్రమాలు, టీడీపీ రిగ్గింగ్‌కు అడ్డుఅదుపు లేకుండా చేసేందుకు పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. రెక్కీ నిర్వహించి హత్యలు చేసే కిరాయి మూకల్లా ఖాకీలు పులివెందులపై పడ్డారు. వెయ్యిమందికిపైగా పోలీసులు మండలాన్ని అష్ట దిగ్బంధం చేశారు. వారం రోజులుగా పులివెందులలో పోలీసు మార్క్ రౌడీయిజంతో అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ ప్రభుత్వ కుతంత్రంతో ఓ గ్రామంలోని ఓటర్లకు వేరే గ్రామంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి వద్దకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వెళ్లకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడపడితే అక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక మంగళవారం పోలింగ్ సందర్భంగా పోలీసులు పూర్తిగా బరితెగించేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ఓటర్లను లాఠీలు ఝళిపిస్తూ బూతులు తిడుతూ వెనక్కి పంపించేశారు. అయినా సరే తాము ఓట్లు వేస్తామని పట్టుబట్టినవారిపై విరుచుకుపడ్డారు. అనుమతించాలని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. ఓటర్ల చేతుల్లోని స్లిప్‌లను గుంజుకున్నారు. ‘‘మీ దగ్గర ఓటరు స్లిప్పులు లేవు కాబట్టి అనుమతించం’’ అని తర్వాత చెప్పడం గమనార్హం. ఓ విధంగా చెప్పాలంటే ఖాకీ గూండాగిరీ రాజ్యమేలింది. పోలీసు పహారాలోనే టీడీపీ రిగ్గింగ్ టీడీపీ రిగ్గింగ్‌కు పోలీసులు రక్షాకవచంగా నిలిచారు. పులివెందులలోని అన్ని పోలింగ్ బూత్‌లలోని వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే వారిని బలవంతంగా బయటకు గెంటేశారు. అనంతరం ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకున్నారు. కాగా, జమ్మలమడుగు, కమలాపురం నుంచి టీడీపీ కూటమి గూండాలను కూడా రప్పించారు. వాస్తవానికి ఇతర ప్రాంతాల వారిని పోలింగ్ రోజున అనుమతించకూడదు. పోలీసులు అవేమీ పట్టించుకోకుండా కూటమి గూండాలకు రాచబాట పరిచారు. దీంతో పచ్చ గూండాలు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. భారీగా ఓటర్లు ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని మరీ విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, సామాన్యులు ఓటు వేసేందుకు వెళ్లకుండా నిరోధించారు. స్లిప్పులను తీసుకుని చింపివేశారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వర్గీయులు, గూండాలు పోలింగ్ కేంద్రాల్లోకి దూసుకెళ్లి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. పోలీసులే వారిని దగ్గరుండి తీసుకువెళ్లి మరీ దొంగ ఓట్లు వేయించడం గమనార్హం. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగిసేవరకు పోలీసుల పహారాలోనే టీడీపీ రిగ్గింగ్ యథేచ్ఛగా కొనసాగింది. వైఎస్సార్సీపీ కార్యాలయంపై ఖాకీల దండయాత్ర డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ఆశోక్‌కుమార్, ఏఎస్పీ ప్రకాష్ బాబు, డీఎస్పీ మురళీనాయక్, మరో ఆరుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, వందలమంది పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారు. వారికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా లాఠీచార్జితో చెదరగొట్టాలని డీఐజీ ఆదేశించారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. తమను ఓట్లు వే సేందుకు అనుమతించాలని ఓటర్లు కాళ్లా వేళ్లా పడినా పోలీసులు ఏమాత్రం కనికరించలేదు. ఇదే అదనుగా వైఎస్సార్సీపీ కార్యాలయం గేటుకు తాళం వేసి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీ అవినాశ్‌రెడ్డిని నిర్బంధంలోనే ఉంచారు. డీఐజీ కోయ ప్రవీణ్ ఆయన పక్కనే కూర్చుని మరీ ఈ కుతంత్రాన్ని పకడ్బందీగా పర్యవేక్షించారు. రిగ్గింగ్ ఆధారాలు ఉంటే ఇవ్వండి: డీఐజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి సాయంత్రం వరకు గృహ నిర్బంధంలో ఉంచామని డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాకు తెలిపారు. తాము బందోబస్తు కోసమే వచ్చామని చెప్పుకొచ్చారు. రిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలుంటే ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. రిగ్గింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఉంటే ఎన్నికల సంఘం, కోర్టుకు ఇస్తారు కానీ డీఐజీకి ఎందుకు ఇస్తారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.కాల్చిపడేస్తా నా కొడకా.. అంటూ డీఎస్పీ రౌడీయిజంపులివెందుల డీఎస్పీ మురళీనాయక్ అయితే వైఎస్సార్సీపీ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తమను ఓటు వేయనీయడం లేదని, రిగ్గింగ్‌ను ఆపాలంటూ ఓటర్లు పోలీసులకు విజ్ఞప్తి చేసే యత్నం చేశారు. అక్కడే ఉన్న డీఎస్పీ ఓటర్లపై చిందులు తొక్కారు. ‘కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్, యూనిఫాం ఇక్కడ..’ అంటూ రౌడీ తరహాలో చెలరేగిపోయారు. పోలీసులు కుట్రపూర్వకంగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు యత్నించారు. లాఠీచార్జి చేసి చెదరగొట్టాలని డీఐజీ ఆదేశించడం.. పరుష వ్యాఖ్యలతో డీఎస్పీ మురళీనాయక్ చెలరేగిపోవడం.. ఇద్దరు, ముగ్గురు సీఐలు విరుచుకుపడడం అంతా పక్కా పన్నాగంతోనే సాగింది. కార్యకర్తలు ప్రతిఘటించి పరిస్థితి అదుపుతప్పితే.. అదే సాకుగా ‘తీవ్రమైన చర్యల’కు తెగించాలన్నది పోలీసుల కుతంత్రం. కాల్పులకూ తెగించేందుకు వారు సంసిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది. పోలీసులు ఉద్దేశం గుర్తించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కార్యకర్తలను వారించారు. ‘ఎలాంటి ఉద్రిక్తతలు వద్దు. కార్యకర్తలు సంయమనం పాటించాలి’ అని హితవు పలికారు. రిగ్గింగ్ రింగ్ మాస్టర్ డీఐజీ కోయ ప్రవీణ్ మొన్న విపరీత వ్యాఖ్యలు.. నేడు అధికార దుర్వినియోగం పులివెందుల మండలంలో టీడీపీ అధికారిక రిగ్గింగ్‌కు రింగ్ మాస్టర్‌గా డీఐజీ కోయ ప్రవీణ్ వ్యవహరించారు. ఐపీఎస్ అధికారిగా తన చట్టబద్ధమైన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ దిగజారుడుతనం ప్రదర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు సృష్టించి కుతంత్రానికి బరితెగించారు. ఎస్పీ అశోక్ కుమార్‌తో పాటు యావత్ పోలీసు యంత్రాంగాన్ని తన కుట్రలో భాగస్వామిగా చేసుకుని చెలరేగిపోయారు. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్, పార్టీ కీలక నేత వేల్పుల రాములపై హత్యాయత్నాన్ని డీఐజీ ప్రవీణ్ తక్కువ చేసి చూపించేందుకు యత్నించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి ‘ఒక ఊరివారు మరో ఊరికి ఎందుకు వెళ్లారు? పత్తేపారం చేయడానికా’ అంటూ వెటకారం ఆడారు. తద్వారా ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు వత్తాసు పలకడమే తన ఉద్దేశం అని చాటారు. పోలింగ్ సందర్భంగా ప్రవీణ్ అధికార దుర్వినియోగం పతాక స్థాయికి చేరింది. ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అక్రమ గృహ నిర్బంధం, వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి తరహాలో పోలీసులు చొచ్చుకుపోవడాన్ని ప్రవీణ్ స్వయంగా పర్యవేక్షించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జికి స్వయంగా ఆదేశించడం గమనార్హం. ప్రవీణ్ ఆదేశాలతోనే ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ మురళీనాయక్‌తో పాటు పోలీసులు అక్రమాలకు తెగబడ్డారు. తెల్లవారుజామునే పోలీసుమార్కు గూండాయిజం ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అక్రమ నిర్బంధం పులివెందులలో మంగళవారం సూర్యోదయానికి ముందే పచ్చ ఖాకీలు గూండాగిరీకి తెరతీశారు. భారీగా పోలీసు అధికారులు, సిబ్బంది వేకువజామునే ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి నివాసంపై దండెత్తారు. దురాక్రమణదారుల మాదిరిగా ఇంట్లోకి దూసుకెళ్లారు. ఎంపీని అక్రమంగా అరెస్టు చేశారు. ఎంపీగా తన నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పర్యవేక్షించడం ఆయన హక్కు, బాధ్యత. కానీ, దీన్ని పోలీసులు కాలరాశారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసుల దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలపగా వారిని ఈడ్చి పడేశారు. ఎంపీని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని ముద్దనూరు వైపు తీసుకువెళ్లారు. నిడిజివ్వి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి ఇంటి వద్ద దింపి ఇక్కడే ఉండాలని ఆదేశించారు. అక్కడికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు యర్రగుంట్ల వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎంపీ పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. -
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నేడు పోలింగ్
సాక్షి, అమరావతి /సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు కోసం వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులు, అక్రమ కేసుల బనాయింపు మొదలు.. ఎన్ని అడ్డదారులు తొక్కినప్పటికీ టీడీపీ అభ్యర్థికి ఘోర పరాజయం తప్పదని అంతర్గత సర్వేల్లో స్పష్టమవడంతో పెదబాబు, చినబాబు ఇద్దరూ బరితెగించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జెడ్పీటీసీ ఉప ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు పథక రచన చేశారు. మంగళవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సోమవారం కొత్త కుట్రకు తెరతీశారు.ఇప్పటికే అధికారులు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పుల్లో తప్పులు ఉన్నాయని అబద్ధం చెబుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తల ద్వారా వాటిని సేకరిస్తున్నారు. ఇవ్వని వారి నుంచి బలవంతంగా లాక్కున్నారు. సోమవారం సాయంత్రం వరకు పంపిణీ చేయని ఓటరు స్లిప్పులను అధికారుల నుంచి గంపగుత్తగా టీడీపీ నాయకులు తీసేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు, కమలాపురంతోపాటు.. సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను భారీ ఎత్తున రప్పించి పులివెందుల మండలంలో పోలింగ్ బూత్‌లు ఉన్న గ్రామాల్లో తిష్ట వేయించారు.ఈ ఓటరు స్లిప్పులను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఒక గ్రామం పోలింగ్ బూత్‌ను పక్క గ్రామంలోకి మార్చిన నేపథ్యంలో ఓట్లు వేయడానికి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి పలు గ్రామాల ఓటర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, యర్రబల్లె ఓటర్లను మార్గం మధ్యలో పోలీసుల ద్వారా ఆపేసి.. పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పి అడ్డుకోవాలనే ఎత్తు వేశారు. తద్వారా వారి ఓట్లను కూడా ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దొంగ ఓట్లు వేయించుకోవాలన్నది టీడీపీ నేతల పన్నాగం.ఏజెంట్లపై దాడి చేసి వెళ్లగొట్టే కుట్ర మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన వెంటనే పోలింగ్ బూత్ నుంచి వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి, పోలీసుల ద్వారా వారిని వెళ్లగొట్టేందుకు టీడీపీ నేతలు కుట్ర చేశారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను బూత్ నుంచి వెళ్లగొట్టడం ద్వారా తమ అడుగులకు మడుగులొత్తే పోలీసులు, అధికారుల సహకారంతో పోలింగ్ బూత్‌ను పూర్తిగా తమ అ«దీనంలోకి తీసుకుని యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకోవాలన్నది టీడీపీ నేతల ఎత్తుగడ. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ శ్రేణులను ప్రతి పోలింగ్ బూత్ వద్ద కనీసం వంద మంది చొప్పున ఇప్పటికే మోహరించారు. పోలింగ్ ప్రారంభం కాక ముందే పోలింగ్ బూత్ వద్ద వారితో యథేచ్ఛగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయించి, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా చేసి.. పోలీసులతో లాఠీఛార్జ్ చేయించి.. పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకోవడానికి మరో కుట్ర చేస్తున్నారు. తద్వారా రిగ్గింగ్ చేసుకోవాలన్నది టీడీపీ నేతల ఎత్తుగడ. ఎస్ఈసీ, పోలీసులు ప్రేక్షకపాత్ర ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే పులివెందుల మండల స్థానికులు మినహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు వెనక్కు వెళ్లిపోవాలి. ప్రచారం ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాల వారు ఎన్నిక జరిగే ప్రాంతంలో ఉండటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా బస చేస్తే వారిపై ఎస్ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషన్) అధికారులు, పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ.. ఇతర ప్రాంతాల నుంచి వందలాది వాహనాల్లో వచి్చన టీడీపీ శ్రేణులు పులివెందుల మండలంలోని గ్రామాలకు చేరుకుంటున్నప్పటికీ.. వారిని అడ్డుకోకుండా ఎస్ఈసీ, పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పులివెందుల మండలంలోనే కాదు.. ఒంటిమిట్ట మండలంలోనూ ఇదే దుస్థితి నెలకొంది. అంతులేని అక్రమాలు ⇒ పులివెందుల మండలంలో ఇటు అధికారులు, అటు పోలీసులు అందరూ ఏకమై వైఎస్సార్సీపీపై కుయుక్తులకు పాల్పడుతున్నారు. పులివెందులకు విలన్లా మారిన మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు కుట్రలను అమలు చేస్తున్నారు. ఎలాగైనా సరే గెలిచి.. వైఎస్ జగన్ అడ్డాలో పాగా వేశామని చెప్పుకునేందుకు పులివెందులను రణరంగంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ⇒ కూటమి నేతల అరాచకంపై ఎన్నికల కమిషన్‌కు ఎన్నిమార్లు విన్నవించినా స్పందనే లేదు. మరోవైపు ఆయా కేసుల్లో అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచి్చనప్పటికీ మోట్నూతలపల్లె గ్రామానికి చెందిన అర్జున్, గంగన్న, చంద్రగిరికి చెందిన మస్తాన్‌వల్లి, మల్లికార్జునపురానికి చెందిన హరి, రచ్చుమర్రిపల్లె మైసూరారెడ్డి, లోపట్నూతల ప్రకాష్‌రెడ్డి, కారంపల్లె మహేష్‌నాయక్, బాలాజీ నాయక్, సర్పంచ్ రామాంజనేయులు, కోరా కిరణ్‌కుమార్‌రెడ్డి, రవిప్రకాష్రెడ్డిలను ఇప్పటికే పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. మరోవైపు ప్రలోభాలకు గురిచేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.⇒ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ సోమవారం పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లె, ఎర్రిపల్లె, కొత్తపల్లె, కనంపల్లె, యర్రబల్లె గ్రామాల్లో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జమ్మలమడుగు ఇన్చార్జి భూషేష్రెడ్డిలు రౌడీïÙటర్లను వెంటబెట్టుకుని హల్చల్ చేశారు. పోలింగ్ ప్రారంభం కాకముందే కొన్ని ఓట్లు వేసుకునేలా సరికొత్త కుట్రకు పదును పెట్టినట్లు తెలిసింది. ⇒ పోలింగ్ పారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు టీడీపీ నేతల మాట మాత్రమే వినాలని పోలీసులకు ఓ ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.నేడు పోలింగ్∙ 14వ తేదీన ఓట్ల లెక్కింపు వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోవివిధ కారణాలతో 28 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా, కోర్టులో కేసుల పేరుతో కేవలం పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. -
ఈ వారంలోనే కార్పొరేషన్ డైరెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయి నాయకత్వానికి ఈ వారంలోనే పదవుల పంపకానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, బోర్డులకు డైరెక్టర్లు, సభ్యుల నియామకాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ నిర్ణయించారు. దీంతో నామినేటెడ్ పదవుల కోసం మండల, జిల్లా స్థాయి కాంగ్రెస్ నేతల ఎదురుచూపులకు మోక్షం కలగనుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలో నెలకొన్న పరిణామాలపై చర్చించేందుకు మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. గంటన్నరకుపైగా సాగిన ఈ భేటీలో నామినేటెడ్ పదవులు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, జనహిత పాదయాత్ర, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పారీ్టపరంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై చర్చించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చలో భాగంగా ఆ నియోజకవర్గంలోని ప్రజలకు పార్టీని మరింత దగ్గర చేసే కార్యాచరణ రూపొందించాలని.. మంత్రులతోపాటు పార్టీ నాయకత్వానికి కూడా మరిన్ని బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే జూబ్లీహిల్స్ ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మరింత విస్తృతంగా సర్వే నిర్వహించాలని కూడా ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. మరోవైపు జనహిత పాదయాత్ర జరిగిన తీరు గురించి రేవంత్‌రెడ్డికి మహేశ్‌గౌడ్ వివరించారు. ఈ యాత్రలో ప్రభుత్వ పనితీరు గురించి సేకరించిన ప్రజాభిప్రాయాలను సీఎంకు తెలియజేశారు. ఈ నెల 23 తర్వాత రెండో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నానని.. వీలు చూసుకొని పాల్గొనాలని మహేశ్‌గౌడ్ విజ్ఞప్తి చేయగా రేవంత్ సానుకూలత వ్యక్తం చేశారని తెలిసింది. తనతోపాటు మంత్రివర్గం కూడా పాదయాత్రకు వస్తుందని ఆయన చెప్పినట్టు సమాచారం. -
చేతులెత్తేసిన ఎస్ఈసీ?
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార టీడీపీ నేతల అరాచకంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేతులెత్తేసిందా? అన్న ప్రశ్నకు అధికార వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానం వినిపిస్తోంది. ఓటింగ్ శాతాన్ని తగ్గించే కుట్రలో భాగంగా పులివెందుల మండలంలోని ఎర్రబెల్లి, నల్లగొండువారిపల్లి, నల్లపురెడ్డిపల్లిలో 6, 7, 8, 9, 10, 11 పోలింగ్ బూత్‌లను ఇష్టానుసారం మార్చేశారు. ఏ ఊరిలో వారు ఆ ఊళ్లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వీలు లేకుండా చేశారు. తద్వారా వైఎస్సార్సీపీకి గట్టి పట్టు ఉన్న ఈ ఊళ్లలో ఓటింగ్ శాతం తగ్గించేలా అధికార పార్టీకి నిబంధనలకు విరుద్ధంగా అధికారులు లబ్ధి చేకూర్చారు.దీనిపై వైఎస్సార్సీపీ బృందం పలుమార్లు ఎస్ఈసీకి వినతి పత్రాలు అందజేసింది. పోలింగ్ కేంద్రాలు ఇదివరకటిలాగే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ అంశంపై జిల్లా కలెక్టర్ నుంచి సమగ్ర నివేదిక కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. ఎర్రబెల్లి, నల్లగొండువారిపల్లి, నల్లపురెడ్డిపల్లిలో పోలింగ్ బూత్‌లు మార్చింది వాస్తవమేనని తెలిపారు. రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఎక్కడివారు అక్కడే ఓటు వేసేలా పోలింగ్ బూత్‌లు ఉండాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరుతుండగా, టీడీపీ అభ్యర్ధి మాత్రం తాజా మార్పు మేరకే పోలీంగ్ బూత్‌లు ఉండాలని వినతిపత్రం ఇచ్చారని నివేదికలో పేర్కొన్నారు.ఇప్పటికే 70 శాతం ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ చేశామని తెలిపారు. దీంతో ప్రస్తుత పరిస్థితినే కొనసాగించేలా ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఓటర్లకు దూరంగా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసిన గ్రామాలకు ప్రజా రవాణా సౌకర్యం కల్పించాలని కడప కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ విషయం సోమవారం కోర్టులో విచారణకు వస్తే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితిలో బూత్‌లను మార్చలేమని చెప్పనున్నట్లు సమాచారం. -
రౌడీయిజం వికటాట్టహాసం
సాక్షి, అమరావతి/ సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యయుతంగా గెలవడం అసాధ్యమని ఆదిలోనే గ్రహించిన సీఎం చంద్రబాబు తొక్కని అడ్డదారులు లేవు.. సామ దాన భేద దండోపాయాలను వాడిగా ప్రయోగించినా విజయం దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయామనే దుగ్ధతో అరాచకాలకు మరింతగా పదును పెట్టారు. కాలకేయులు.. పిండారీలు.. బందిపోట్లను మరిపించే గూండాలతో కూడిన టీడీపీ మూక, రౌడీ గ్యాంగ్‌కు కొమ్ముకాసే కొంత మంది పోలీసు అధికారులను ముఠాగా ఏర్పాటు చేసి, పోలింగ్ ప్రక్రియను హైజాక్ చేసే కుట్రకు తెర తీశారు.వైఎస్సార్సీపీ శ్రేణులు, సానుభూతిపరులపై అత్యంత కిరాతకంగా పాశవికంగా దాడులు చేసి, దౌర్జన్యం చేసి పోలింగ్ శాతాన్ని తగ్గించడం– పోలింగ్ బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకోవడం, ఈ అరాచకకాండ బయటకు తెలియ నీయకుండా చేసేందుకు మీడియాను కూడా పోలీసులతోనే కట్టడి చేయిస్తున్నారు. దేశ చరిత్రలో ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఈ స్థాయిలో వికృత దాడులు, దౌర్జన్యాలు.. అధికార దుర్వినియోగానికి పాల్పడిన దాఖలాలు లేవంటూ సీనియర్ రాజకీయ నేతలు నివ్వెరపోతున్నారు.14 నెలల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటం సీఎం చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లాలో పులివెందుల, అన్నమయ్య జిల్లాలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడం.. ఆ రెండు స్థానాల్లో టీడీపీ ఘోర పరాజయం పొందడం ఖాయమని తాను నిర్వహించిన అంతర్గత సర్వేల్లో తేలి పోవడంతో సీఎం చంద్రబాబు విద్యార్థి దశ నుంచే అలవర్చుకున్న రౌడీ రాజకీయానికి మరింత పదునుపెట్టారు.అధికార దుర్వినియోగానికి పరాకాష్ట పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆ మండలాల్లోనే వైఎస్సార్సీపీ కీలక నాయకులు, క్రియాశీలక కార్యకర్తలపై సీఎం చంద్రబాబు పోలీసులను ఉసిగొలిపి బైండోవర్ కేసులు పెట్టించారు. వందల కొద్దీ నాయకులు, కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెట్టినా వైఎస్సార్సీపీ శ్రేణులు వెరకపోవడంతో.. కోట్ల కట్టలను వెదజల్లి ప్రలోభపెట్టి లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. ప్రలోభపర్వం కూడా బెడిసికొట్టడంతో దౌర్జన్యకాండకు తెరతీశారు. సీఎం చంద్రబాబు రచించిన పథకం మేరకు.. ఆగస్టు 5న పులివెందులలో ఓ పెళ్లికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గూండాలు వికృతంగా దాడి చేశారు.ఆగస్టు 6న నల్లగొండువారిపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత రమేష్ యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలపై హత్యాయత్నం చేయించారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు ఈ దాడి కళ్లెదుటే జరుగుతున్నప్పటికీ ప్రేక్షక ప్రాత వహించారు. పోలీసులు అధికార టీడీపీకి ఏకపక్షంగా వత్తాసు పలుకుతుండటం అడుగడుగునా కనిపిస్తోంది. ఏకంగా డీజీపీ కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. అరాచకం, రౌడీయిజం, పోలింగ్ బూత్‌ల మార్పిడిపై వైఎస్సార్సీపీ నేతలు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిద్ర నటిస్తుండటం దుర్మార్గం. ఓటింగ్ క్యాప్చర్ లక్ష్యం⇒ అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తే అధికారులు వైఎస్సార్సీపీ ఓట్లను తగ్గించేందుకు గ్రామాల పోలింగ్ బూత్‌లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఒక ఊరిలోని ఓటర్లు మరో ఊరికి వెళ్లి ఓటు వేసేలా సరికొత్తగా ‘జంబ్లింగ్’ విధానాన్ని తీసుకొచ్చి లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామాల ప్రజలు ఓటేయడానికి వెళ్లనివ్వకుండా బెదిరించడం, భౌతికదాడులకు పాల్పడి భయపెట్టడం, తద్వారా పోలింగ్ శాతాన్ని తగ్గించడం, రిగ్గింగ్‌కు పాల్పడేందుకు పన్నాగం పన్నారు.⇒ మరోవైపు ప్రచారం ముగియడంతో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు గుంపగుత్తగా ఓట్లు కొనేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. ఇంత దారుణం జరుగుతుంటే సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్, ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌లు ప్రకటించారు. ఇప్పటికే ఓటర్లు స్లిప్పులు 95 శాతం పంపిణీ చేశామని చెప్పారు. వాస్తవానికి స్లిప్పులు ఓటర్లకు చేరలేదు. ⇒ ఎన్ని అక్రమాలు చేసినా విజయ సూచనలు ఏమాత్రం కనిపించక పోవడంతో అరెస్టులు, దౌర్జన్యాలపై టీడీపీ పెద్దలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా తప్పుడు ఫిర్యాదుతో నల్లగొండుగారిపల్లిలో జరిగిన దాడిలో బాధితులపైనే వేల్పుల రాము సహా 50 మందిపై రివర్స్‌లో ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. ఈ కేసును అడ్డుపెట్టుకుని.. పోలింగ్ రోజున వారంతా ఉండకుండా అరెస్టులకు ఉపక్రమించారు. తద్వారా పోలింగ్ ప్రక్రియను టీడీపీ గూండాలు హైజాక్ చేసేందుకు అనువైన పరిస్థితులను కల్పించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారు. ⇒ టీడీపీ నేతల దాడులకు నిరసనగా పులివెందులలో వైఎస్సార్సీపీ చేసిన శాంతి ర్యాలీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనంటూ మరో 150 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గోటూరు చిన్నప్పలకు నోటీసు జారీ చేశారు. ఇంకా వైఎస్సార్సీపీ నేతల వేట కొనసాగుతూనే ఉంది.సోమవారం రాత్రి లోగా టీడీపీ పెద్దలు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసి స్వామిభక్తి చాటుకునే పనిలో కొంత మంది అధికారులు నిమగ్నమై ఉన్నారు. పోలింగ్ నాటికి వైఎస్సార్సీపీ క్రియాశీలక నేతలెవ్వరు బయట ఉండకుండా చేయాలనే లక్ష్యం మేరకు ఏకపక్ష చర్యలు తీవ్రతరమయ్యాయి. తద్వారా పూర్తిగా టీడీపీ అనుకూల ఓటింగ్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం ఇంతగా ఖూనీ కావడంపై.. వ్యవస్థలు నిర్వీర్యం కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పరిశీలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఎన్నికల కమిషన్ చేష్టలుడిగి చూస్తుండటం దారుణమని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క జెడ్పీటీసీ స్థానంలో ఎన్నికలు నిర్వహించడంలో యంత్రాంగం ఘోర వైఫల్యం చెందిందని మండి పడింది. దౌర్జన్యాలు, దాడులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోరా? అని నిలదీసింది. పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని కోరుతూ ఆ పార్టీ ప్రతినిధి బృందం శనివారం ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, రమేష్‌కుమార్ యాదవ్, సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్‌కుమార్, సుధాకర్‌బాబు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ తదితరులను పోలీసులు బయటే ఆపేయడంతో తోపులాట జరిగింది. దీంతో వారంతా కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదని నిప్పులు చెరుగుతూ వాగ్వాదానికి దిగారు.‘ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి.. పోలీసుల దౌర్జన్యం నశించాలి.. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణి విడనాడాలి..’ అని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో వారిని వినతిపత్రం అందజేసేందుకు పోలీసులు అనుమతించారు. పోలింగ్ బూత్‌లు మార్చడానికి వీల్లేదని, బైండోవర్ కేసులు పెట్టి కనిపించకుండా దాచిన వైఎస్సార్సీపీ నాయకులను విడుదల చేయాలని, సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ చేయాలని వారు ఎన్నికల కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దయనీయం.. ఘోరం రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరుగుతున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా, దయనీయంగా, ఘోరంగా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతుంటే కళ్లు, చెవులు మూసుకొని కమిషన్ ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకుని నిద్ర నటిస్తోంది. ఎన్నికల కమిషన్ ఓటు హక్కును ప్రోత్సహించడం కోసం, ఓటింగ్ శాతం పెంచడానికి వ్యవస్థను ఓటర్ల వద్దకు తీసుకెళ్లాల్సింది పోయి.. పులివెందులలో అందుకు విరుద్ధంగా ఓటర్లకు దూరంగా పోలింగ్ కేంద్రాలను తీసుకెళుతుండటం దారుణం. – పేర్ని నాని, మాజీ మంత్రి దేవుని దయవల్ల బతికి బయట పడ్డానుబీసీ సామాజిక వర్గానికి చెందిన నాపై అతి ఘోరంగా బండరాళ్లు, సుత్తులతో దాడి చేశారు. పెట్రోలు పోసి నన్ను చంపేందుకు ప్రయతి్నంచారు. దేవుని దయతో బతికి బట్ట కట్టాను. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తామే గెలవాలనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాలను ఒక ఊరి నుంచి మరో ఊరికి మార్చారు. – రమేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ఈ అధికారం శాశ్వతమా? పులివెందులలో ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ ఎన్నికల కోసం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమాలకు తెరలేపారు. ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వమా? ఎన్నికల కమిషనా? వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే ఇక్కడ మమ్మల్ని పోలీసుల చేత నెట్టించే ప్రయత్నం చేయడం దారుణం. ఎందుకంత కండకావరం? ఈ అధికారం శాశ్వతమా? – టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే పులివెందులలో రాజ్యాంగం అమలులో లేదు పులివెందులలో రాజ్యాంగం అమలులో లేదు. అధికారులు వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల కమిషనర్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. – దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు -
ఆటవికం.. అరాచకం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచేందుకు ఎన్ని అడ్డదారులు ఉన్నాయో.. అన్నింటినీ ఉపయోగించినా ఫలితం కనిపించక పోవడంతో టీడీపీ పెద్దలు ఇదివరకెన్నడూ లేని విధంగా అరాచకానికి తెరలేపారు. పిండారీలు, కాలకేయులు, బందిపోట్లను తలదన్నే రీతిలో టీడీపీ మూక వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం నల్లగొండువారిపల్లెలో అత్యంత క్రూరంగా, కిరాతకంగా చేసిన దాడిలో.. తీవ్రంగా గాయపడి, ఒంటి నిండా రక్తమోడుతూ ప్రాణంతో బతికి బట్టకట్టిన బాధితుడినే ప్రథమ (ఏ1) నిందితుడిగా చేస్తూ మరో 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆ కేసులో తొమ్మది మందిని పోలీసులు.. శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇదే కేసులో పులివెందుల మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులను ఇరికించి, అరెస్టు చేసి.. జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ రోజున వారిని లేకుండా చేయాలన్నదే ముఖ్యనేత ఎత్తుగడ. కానీ.. అత్యంత కిరాతకంగా క్రూరంగా హత్యాయత్నానికి తెగబడ్డ టీడీపీ కాలకేయులు కళ్లెదుటే తిరుగుతున్నా, వైఎస్సార్సీపీ శ్రేణులపై యథేచ్ఛగా దాడులు చేస్తున్నా.. వారి వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదు.చంద్రబాబు పోలీసు యంత్రాంగం సాగిస్తున్న ఈ ఆటవిక, అరాచకానికి పులివెందుల వేదికైంది. టీడీపీ మూక పాశవికంగా చేసిన దాడిలో.. తీవ్రంగా గాయపడి, ప్రాణాలతో బయట పడిన వేల్పుల రాము (రామలింగారెడ్డి)ను పోలీసులు ఏ–1గా చేరుస్తూ ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. జరగని ఘటనలు జరిగినట్లు.. కళ్లెదుట కన్పిస్తున్న వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరిస్తూ.. పోలీసు యంత్రాంగం అరాచకం సృష్టిస్తోంది. టీడీపీ మూక దాడిలో తల పగిలి వేల్పుల రాము శరీరంపై రక్తపుధారలు కారుతున్న దృశ్యాలు ససాక్ష్యంగా కన్పిస్తున్నా.. వైఎస్సార్సీపీ నేతలకు రక్తపు గాయాలు ఏమీ కాలేదని, తాము స్పందించకపోయి ఉంటే వారి తలలు ఎగిరిపోయేవని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు పోలీసుల దమనకాండకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉప ఎన్నిక గండం గట్టెక్కేందుకే అరాచకం సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీలను అటకెక్కించడం.. రెడ్ బుక్ కుట్రలు, కుతంత్రాలతో టీడీపీ మూక రక్తపుటేరులు పారిస్తుండటం.. అవినీతి, అక్రమాలను వ్యవస్థీకృతం చేసి, నీకింత నాకింతా అంటూ చంద్రబాబు గ్యాంగ్ దోచుకుతింటుండటంతో 14 నెలల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. దాంతో ప్రజల దృష్టి మళ్లించడానికి ఎప్పటికప్పుడు కుట్రలు, కుతంత్రాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతూ చంద్రబాబు నెట్టుకొస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు బరితెగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.పోలీసు యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలను తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురిచేశారు. భారీ ఎత్తున ప్రలోభపెట్టి లొంగదీసుకోవడానికి కుట్రలు చేశారు. కానీ ఆ కుట్రలు ఏవీ పారక పోవడంతో ముఖ్య నేత కనుసైగలతో పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పులివెందుల శ్రీకర్ ఫంక్షన్ హాల్లో వివాహానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు సైదాపురం సురేష్‌కుమార్‌రెడ్డి (చంటి), అమరేష్‌రెడ్డి, నాగేష్, శ్రీకాంత్, తన్మోహన్రెడ్డిలపై టీడీపీ రౌడీ మూకలు హత్యాయత్నం చేశాయి. అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌బాషా (కిరికిరి బాషా) ముఠా దాడి చేసి వెళ్లిపోయింది.ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఏమాత్రం పట్టించుకోలేదు. బుధవారం నల్లగొండువారిపల్లెలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై బందిపోటు దొంగల ముఠా తరహాలో టీడీపీ రౌడీ మూకలు మెరుపు దాడి చేశాయి. ఒక్కసారిగా దాదాపు 100 మంది రాడ్లు, కర్రలు, ఇతర మారణాయుధాలతో వారిని చుట్టుముట్టి మట్టు బెట్టేందుకు యత్నించారు. వేల్పుల రామలింగారెడ్డి తలపై రాడ్డుతో కొట్టారు. దీంతో తల పగిలి ఆయన కింద పడిపోయారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పైనా అదే స్థాయిలో దాడి చేశారు. రమేష్ యాదవ్ తల తిప్పడంతో భుజంపై రాడ్ల దెబ్బలు పడ్డాయి. ఎమ్మెల్సీ రేంజ్ రోవర్, వేల్పుల రామలింగారెడ్డికి చెందిన ఫారŠుచ్యనర్, స్కార్పియో వాహనాలనూ సమ్మెటలతో ధ్వంసం చేశారు.రామలింగారెడ్డి ఉన్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించబోయారు. గ్రామస్తులు ప్రతిఘటించేందుకు సిద్ధమవడంతో రౌడీ మూకలు పారిపోయాయి. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రాంతానికి సమీపంలోనే పోలీసులు ఉన్నప్పటికీ.. చూసి చూడనట్లు పట్టించుకోక పోవడం కుట్రకు నిదర్శనం. ఈ దాడి విషయమై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడికి పాల్పడిన వారు పోలీసుల కళ్లెదుటే తిరుగుతున్నా పట్టించుకోకపోగా, బాధితులైన వైఎస్సార్సీపీ శ్రేణులపైనే కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకోవడం.. అరెస్టు చేయడం ప్రభుత్వ దమనకాండకు, దుర్మార్గానికి నిదర్శనంగా నిలుస్తోంది. పరాకాష్టకు చేరిన ఆకృత్యాలు అదే బుధవారం రోజున జరగని ఘటనను జరిగినట్టుగా టీడీపీ నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మేరకు వేల్పుల రామును ఏ–1గా, హేమాద్రి రెడ్డిని ఏ–2గా చేర్చుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయడం గమనార్హం. ఈ కేసును అడ్డం పెట్టుకుని శుక్రవారం రాత్రి 12 మంది వైఎస్సార్సీపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శనివారం ముగ్గురిని వదిలేసి.. మిగతా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇదే కేసులో పులివెందుల మండలంలో కీలకమైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా ఇరికించి, అరెస్టు చేయడానికి పోలీసులు పావులు కదుపుతున్నారు.ఎన్నికల ప్రక్రియ నుంచి వైఎస్సార్సీపీ నాయకులను తప్పించడానికే తప్పుడు ఫిర్యాదులు, అక్రమ కేసులు, అరెస్టుల కుట్రకు తెరతీశారన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు ఆదేశాలకు తలొగ్గుతూ పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. తమ రాజకీయ జీవితాల్లో ఇంతటి దుర్మార్గాలు ఎన్నడూ చూడలేదంటూ రాజకీయ పార్టీల నేతలు నివ్వెరపోతున్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో కీలకమైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బైండోవర్ చేస్తున్నారు. ఒక్క పులివెందుల మండలంలోనే శనివారం రాత్రి వరకు 150 మందిని బైండోవర్ చేశారు.నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్‌ల మార్పు ఇన్నిన్ని అరాచకాలకు పాల్పడినా ఫలితమివ్వక పోవడంతో టీడీపీ నేతలు తాజాగా మరో కుట్రకు తెరలేపారు. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గించి, లబ్ధి పొందాలనే కుట్రలకు పదును పెడుతున్నారు. ఏ గ్రామంలోని ఓటర్లు ఆ గ్రామంలోనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా అక్కడి ఓట్లు ఇక్కడికి, ఇక్కడి ఓట్లు అక్కడికి మార్చేస్తున్నారు. పులివెందుల మండలంలోని ఎర్రబల్లె కొత్తపల్లె పంచాయతీలో 6, 7 నంబర్ల పోలింగ్ బూత్‌లు, నల్లగొండువారిపల్లెలో పోలింగ్ బూత్ 8, నల్లపురెడ్డిపల్లెలో 9, 10, 11 బూత్‌లు ఉన్నాయి.ఇది వరకు ఏ గ్రామానికి చెందిన ఓటర్లు ఆ గ్రామంలోని పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకునే వారు. తాజాగా ఎర్రబల్లె కొత్తపల్లె ఓటర్లు నల్లపురెడ్డిపల్లె బూత్‌లలో, నల్లపురెడ్డిపల్లె ఓటర్లు ఎర్రబల్లె కొత్తపల్లె బూత్‌ల పరిధిలోకి వచ్చేలా అధికారులు మార్పిడి చేశారు. ఓటర్ల పరిశీలన (వెరిఫికేషన్) సందర్భంగా ఈ విషయం బహిర్గతం కావడంతో పలువురు అవాక్కవుతున్నారు. ఓటు వేయాలంటే 4 కిలోమీటర్లు పక్క గ్రామంలోకి వెళ్లాల్సిన పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకుని పోలింగ్‌ను ప్రభావితం చేయడానికి టీడీపీ స్కెచ్ వేసింది.ఓట్లు వేయకుండా అడ్డుకోవడం, లేదా రిగ్గింగ్ చేయడానికి ఈ ఎత్తుగడ వేశారు. పోలీసుల అండదండలతో పోలింగ్ బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకునేలా టీడీపీ రాక్షస వ్యూహం రచించింది. దీనికి పోలీసులు, అధికార వర్గాలు దన్నుగా నిలస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. పోలింగ్ బూత్‌లను మార్చవద్దని, యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేసింది. కానీ.. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు స్పందించక పోవడం గమనార్హం. -
పోలింగ్ బూత్‌ల మార్పుతో ప్రభుత్వం కుట్ర
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ బూత్‌ల మార్పుతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పులివెందులలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12న జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ పోలింగ్ బూత్‌లను మార్చడం దారుణమన్నారు. ఎర్రబల్లె గ్రామానికి చెందిన పోలింగ్ బూత్‌ను నల్లపురెడ్డిపల్లె గ్రామానికి, నల్లపురెడ్డిపల్లె పోలింగ్ బూత్‌ను ఎర్రబల్లెకు, నల్లగొండువారిపల్లెకు చెందిన పోలింగ్ బూత్‌ను నల్లపురెడ్డిపల్లెకు మార్చారన్నారు. ఈ విధంగా చేయడంవల్ల ఎర్రబల్లె ప్రజలు నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు వేయాలి, నల్లపురెడ్డిపల్లె ప్రజలు ఎర్రబల్లెకు వెళ్లి ఓటు వేయాలని, అలాగే నల్లగొండువారిపల్లె ప్రజలు నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు వేయాల్సి వస్తుందన్నారు. నల్లగొండువారిపల్లెలో దాదాపు 632 ఓట్లు ఉన్నాయని, వీరందరూ 4 కి.మీ. దూరంలోని నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నల్లపురెడ్డిపల్లె ప్రజలందరూ నల్లగొండువారిపల్లెకు వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉందని, ఇలా ఎందుకు చేశారో తెలియడం లేదన్నారు. అదే 2021లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు ఏ గ్రామంలోని ఓట్లు ఆ గ్రామంలోనే వేసేలా బూత్‌లు ఏర్పాటు చేయడంతో పోలింగ్ శాతం పెరిగిందన్నారు. కానీ ఇప్పుడు పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. నల్లగొండువారిపల్లెలో హత్యాయత్నం ఏ స్థాయిలో జరిగిందో, కార్లను ఎలా ధ్వంసం చేశారో, పెట్రోలు క్యాన్లు తెచ్చి కార్లను తగలబెట్టే ప్రయత్నం చేశారో, మనుషుల తలలను పగులగొట్టే ప్రయత్నం ఎలా జరిగిందో, ఇనుప రాడ్లు, కర్రలు ఎలా వాడారో చూసిన తర్వాత ఓటర్లు ఏ ధైర్యంతో 4కి.మీ. ప్రయాణం చేసి నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు ఎలా వేయగలరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా ఎందుకు చేశారనేది ఆలోచిస్తే కేవలం పోలింగ్ శాతం తగ్గించడానికి, పోలింగ్ బూత్‌లలో పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ ఏమైనా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసేందుకా అనిపిస్తోందన్నారు. అధికార పార్టీ ప్రభావంతోనే..ప్రతి ఒక్కరు ఓటు వేసే సౌలభ్యం కల్పించాల్సిన ఎలక్షన్ కమిషన్, ఇవాళ రూలింగ్ పార్టీ ప్రభావంతో పనిచేస్తోందన్నారు. ఈ ఓటర్ల మార్పు ఆరు పోలింగ్ కేంద్రాలపై ఉందని...అంటే 3,900 ఓట్ల మీద ఉందని, ఈ ఎలెక్షన్ 10,600 ఓట్లకు కాగా, 36 శాతం ఓటర్లకు ఈ సమస్య ఉంటుందన్నారు. ఇప్పటికే ఇష్టమొచి్చనట్లు తమ కార్యకర్తలపై బైండోవర్, తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇవన్నీ సరిపోవన్నట్లు ఇంకో ఘనకార్యం చేశారని.. బూత్‌లు షిఫ్ట్ కాకుండా ఓటర్లనే వేరే ఊరికి షిఫ్ట్ చేశారని చెప్పారు. విషయం తమకు తెలిసిన వెంటనే ఎన్నికల కమిషన్, కలెక్టర్, ఎన్నికల అధికారి తదితరుల దృష్టికి తీసుకెళ్లామని, తమ నాయకులు కూడా వాళ్లను కలుస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో దీనిని సరిదిద్ది ఏ ఊరి ఓటరు ఆ ఊరిలోనే స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల కమిషన్ టీడీపీ ప్రభావం నుంచి బయటకు రావాలన్నారు. ఎన్నికల కమిషన్‌కు చాలా వినతులు చేశామని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలెక్షన్ కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద, పరిసరాలలో కూడా సీసీ కెమెరాలను అమర్చాలని అడిగామన్నారు. ముఖ్యంగా సైక్లింగ్, రిగ్గింగ్ జరగకుండా ఉండాలంటే కంప్లీట్ సీసీ ఫుటేజీ ఎన్నికల కమిషన్ వద్ద ఉండాలన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కోర్టుకు కూడా వెళతామన్నారు. -
పోలింగ్ కేంద్రాలను మార్చొద్దు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను మార్చాలన్న ఎన్నికల అధికారి (ఈవో) నిర్ణయంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్లను అసౌకర్యానికి గురిచేసే ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను (ఎస్ఈసీ) కోరింది. ఈ మేరకు శుక్రవారం శాసన మండలి మాజీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ రాజగొల్ల రమేష్ యాదవ్‌లు ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ మూర్తిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విపరీత పోకడలకు పోకుండా ప్రజస్వామ్య పద్ధతిలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిపిస్తే, ప్రజలే తగిన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘‘పులివెందుల జెడ్పీటీపీ ఉప ఎన్నికలో ఎర్రబల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లోని రెండు సెంటర్లను నల్లపురెడ్డిపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్‌కు, నల్లగొండువారిపల్లిలోని మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ సెంటర్‌ను నల్లపురెడ్డిపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్‌కు, నల్లపురెడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లోని రెండు సెంటర్లను ఎర్రబల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్‌కు, నల్లపురెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో ఉన్న మరో సెంటర్‌ను నల్లగొండువారిపల్లిలోని మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్‌కు మార్చాలని ఎన్నికల అధికారి నిర్ణయించారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఓటర్లు చాలా ఇబ్బందిపడతారు. ఈ ఆరు పోలింగ్ కేంద్రాలను మార్చాలన్న ఎన్నికల అధికారి నిర్ణయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఎస్ఈసీని కోరాం. ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలి. మార్చిన పోలింగ్ కేంద్రాలను చూస్తే... ప్రజలు ఓటు వేయాలని కోరుకుంటున్నారా? మీరెవరూ ఓటు వేయొద్దు. మేమే వేసుకుంటాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మాకు వర్తించదు అని చెప్పదల్చుకున్నారా? ఇక్కడున్నదల్లా రెడ్ బుక్ రాజ్యాంగం, దాని ద్వారానే ఇష్టం వచి్చనట్లు చేస్తాం? అనే ఉద్దేశంలో ఉన్నారా?. దగ్గరగా ఉన్న పోలింగ్ కేంద్రాలను ఎత్తేసిఎన్నికల ప్రక్రియలో పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. నిర్భయంగా ఓటు వేసే పరిస్థితులను అధికారులు కల్పించాలి. కానీ, ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లి 2 కి.మీ., నల్లగొండువారిపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లి 4 కి.మీ. దూరం. గతంలో పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు దగ్గరగా ఉండేవి. ప్రజలు ఇబ్బంది లేకుండా ఓటు వేసేవారు. దూరంగా తరలించడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడతారు. దూరంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు వారంతా వైఎస్సార్సీపీ సానుభూతిపరులని చెప్పి, ఓటు వేయనీయకుండా టీడీపీ నిరోధించే ప్రమాదం ఉంది. ఉప ఎన్నిక ప్రచారంలో ఈ నెల 6న మా పార్టీ నాయకులపై ఏ స్థాయిలో భౌతిక దాడి జరిగిందో అందరూ చూశారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి, వారు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయాలన్న కుట్రతోనే అధికార పార్టీ వారు ఈ దాడికి పాల్పడ్డారు. అందుకని పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా 6 పోలింగ్ కేంద్రాలను (6వ నంబరు నుంచి 11 వరకు) ఏ మార్పు లేకుండా యథాతథంగా కొనసాగేలా చూడాలి. ఎలాగైనా గెలవాలని టీడీపీ దుశ్చర్యలు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ వారు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఖాకీ చొక్కాలను పక్కనపెట్టి పచ్చ చొక్కాలను ధరించి వైఎస్సార్సీపీ నాయకులను అడుగడుగునా భయపెడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అయినా, ప్రజలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారన్న ఆలోచనతో ఏదో ఒకలా వారిని ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. దాడులకు దిగుతున్నారు. చివరికి బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ రాజగొల్ల రమేష్ యాదవ్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. రెవెన్యూ యంత్రాంగం.. ఎలాగైనా టీడీపీని గెలిపించాలని పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. వాటికి అనుగుణంగా పనిచేస్తున్నామని నిస్సిగ్గుగా చెబుతోంది. 20 ఏళ్ల క్రితం బిహార్ లో ఉన్న పరిస్థితులను టీడీపీ ఇప్పుడు ఏపీలో తీసుకొస్తోంది. హైకోర్టు తీర్పును గౌరవించండి సీసీ కెమెరాల ఏర్పాటు, వెబ్ కాస్టింగ్, మానిటరింగ్, అభ్యర్థులకు రక్షణ, ఓటర్లు నిర్భయంగా ఓటు వేయడానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని అమలు చేయాలి. వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మేం ఏనాడూ తప్పుడు పనులు చేయలేదు. ప్రజాస్వామ్యవాదులంతా రాష్ట్రంలోని అప్రజాస్వామ్యిక పాలనను గమనించాలి. -
టీడీపీ తొండాట!
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఏం చేస్తారో చేయండి.. అక్కడ మనం బలం చాటుకోవాలి.. ఎప్పటికప్పుడు మీకు ఏ సహాయం కావాలో చెబితే వెంటనే అందే ఏర్పాటు చేస్తాం.. అధికారులంతా మీకు సహకరిస్తారు.. రాష్ట్రంలో అందరి దృష్టీ ఆ ఎన్నికపైనే ఉండాలి’ అని ‘ముఖ్య’ నేత కొందరు టీడీపీ నేతలకు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై దిశా నిర్దేశం చేయడం వల్లే కొద్ది రోజులుగా ఇక్కడ అరాచకం రాజ్యమేలుతోంది. స్థానిక టీడీపీ నేత బీటెక్ రవి, మరికొందరు నేతలు రెచ్చిపోతున్నారని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, తప్పుడు కేసులు, భయభ్రాంతులకు గురి చేయడాలు, ప్రలోభాలు.. ఇలా ఏవీ ఫలితమివ్వక పోవడంతో తాజాగా మరో కుట్రకు తెరలేపారు. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గించి, అధికార టీడీపీకి మేలు చేకూర్చాలన్న కుట్రలకు పదును పెడుతున్నారు. ఏ గ్రామంలోని ఓటర్లు ఆ గ్రామంలోనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా అక్కడి ఓట్లు ఇక్కడికి, ఇక్కడి ఓట్లు అక్కడికి మార్చేస్తున్నారు. పులివెందుల మండలంలోని ఎర్రబల్లె కొత్తపల్లె పంచాయతీలో 6, 7 నంబర్ల పోలింగ్ బూత్‌లు, నల్లగొండువారిపల్లెలో పోలింగ్ బూత్ 8, నల్లపురెడ్డిపల్లెలో 9, 10, 11 బూత్‌లు ఉన్నాయి. ఇది వరకు ఏ గ్రామానికి చెందిన ఓటర్లు ఆ గ్రామంలోని పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకునే వారు. తాజాగా ఎర్రబల్లె కొత్తపల్లె ఓటర్లు నల్లపురెడ్డిపల్లె బూత్‌లలో, నల్లపురెడ్డిపల్లె ఓటర్లు ఎర్రబల్లె కొత్తపల్లె బూత్‌ల పరిధిలోకి వచ్చేలా అధికారులు మార్పిడి చేశారు. ఓటర్ల పరిశీలన (వెరిఫికేషన్) సందర్భంగా ఈ విషయం బహిర్గతం కావడంతో పలువురు అవాక్కవుతున్నారు. ఇలాగైతే తాము మూకుమ్మడిగా పోలింగ్ బహిష్కరిస్తామని నల్లగొండువారిపల్లె గ్రామస్తులు అధికారులకు తేల్చి చెప్పారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా మార్చారని ఆరా తీస్తే.. టీడీపీ నేతల కుట్రను అధికారులు అమలు చేస్తున్నారని స్పష్టమైంది. పోలింగ్ శాతం తగ్గించడమే లక్ష్యం పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో మొత్తం 10,601 ఓట్లు ఉన్నాయి. అందులో కణంపల్లె, కొత్తపల్లె, నల్లపురెడ్డిపల్లె పంచాయతీల్లో 65 శాతం ఓటర్లు ఉన్నారు. ఆయా పంచాయతీల్లో వైఎస్సార్సీపీకి గట్టి పట్టు ఉంది. ఈ పరిస్థితిలో అక్కడి ఓటర్లు ఓట్లు వేస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు సునాయాసం. ఈ క్రమంలో ఓటర్ల బూత్‌లను తారుమారు చేశారు. దీంతో స్వల్ప వివాదాలు తలెత్తినా.. అంత దూరం వెళ్లి ఓటు వేసేందుకు ఓటర్లు స్వతహాగా నిరాసక్తత చూపుతారన్నది అధికార పార్టీ నేతల ఎత్తుగడ. పైగా ఓటింగ్ వెళ్లే దారిలో ప్రలోభ పెట్టేందుకు, భయభ్రాంతులకు గురిచేసేందుకు అవకాశం ఉంటుందని కూడా ఎత్తు వేసినట్తు తెలుస్తోంది. దీంతోపాటు ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేయడం మొదలెట్టారు. ఇంకోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థికి పడిన ఓట్లు ఎక్కువగా చెల్లనివిగా చేసేందుకు బ్యాలెట్ పేపర్ ముద్రించడంలో కూడా ఎత్తుగడలు వేశారని తెలుస్తోంది. 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్క పేజీలో బ్యాలెట్ పేపర్ ముద్రిస్తే సరిపోతుంది. అలా కాకుండా డబుల్ సైడ్ గుర్తులు ఇస్తూ బ్యాలెట్ ముద్రించేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. తద్వారా ఒకటవ గడిలో ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి గుర్తుపై ఓటు వేయడం ద్వారా ఆ ఓటు చెల్లకుండా పోవాలనే కుట్ర దాగి ఉంది. ‘ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. మెరుగైన సమాజం కోసం ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించండి. ప్రతి ఒక్కరూ పోలింగ్‌లో పాల్గొనండి.. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి’ అన్న ప్రచారానికి భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎలాగైనా సరే గెలవడానికి ఓటర్లను గందరగోళానికి గురి చేసి, పోలింగ్ కేంద్రం వద్దకు రాకుండా చేయాలన్న ప్రభుత్వ పెద్దల కుతంత్రానికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. రోజుకో దాడితో భయభ్రాంతులకు గురిచేసే ఎత్తుగడవైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ చంద్రబాబు అండ్ గ్యాంగ్ బరితెగించి కుట్రలు, కుతంత్రాలకు తెర లేపింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే గెలుపు దరిదాపులకు వెళ్లడం అటుంచి.. డిపాజిట్ కూడా దక్కదనే విషయం తెలిసి రౌడీయిజంతో బందిపోట్ల తరహాలో వైఎస్సార్సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసేందుకు దాడులకు తెగబడింది. ఇందులో భాగంగా మంగళవారం పులివెందుల శ్రీకర్ ఫంక్షన్ హాల్లో వివాహానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు సైదాపురం సురేష్‌కుమార్‌రెడ్డి (చంటి), అమరేష్‌రెడ్డి, నాగేష్, శ్రీకాంత్, తన్మోహన్రెడ్డిలపై టీడీపీ రౌడీ మూకలు హత్యాయత్నం చేశాయి. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఏమాత్రం పట్టించుకోలేదు. బుధవారం నల్లగొండువారిపల్లెలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై బందిపోటు దొంగల ముఠా తరహాలో టీడీపీ రౌడీ మూకలు మెరుపు దాడి చేశాయి.ఒక్కసారిగా దాదాపు 100 మంది రాడ్లు, కర్రలు, ఇతర మారుణాయుధాలతో వారిని చుట్టుముట్టి మట్టు బెట్టేందుకు యత్నించారు. వేల్పుల రామలింగారెడ్డి తలపై రాడ్డుతో కొట్టారు. దీంతో తల పగిలి ఆయన కింద పడిపోయారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పైనా అదే స్థాయిలో దాడి చేశారు. రమేష్ యాదవ్ తల తిప్పడంతో భుజంపై రాడ్ల దెబ్బలు పడ్డాయి. ఎమ్మెల్సీ రేంజ్ రోవర్, వేల్పుల రామలింగారెడ్డికి చెందిన ఫార్చ్యునర్, స్కార్పియో వాహనాలనూ సమ్మెటలతో ధ్వంసం చేశారు. రామలింగారెడ్డి ఉన్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించబోయారు. గ్రామస్తులు ప్రతిఘటించేందుకు సిద్ధమవడంతో రౌడీ మూకలు పారిపోయాయి. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రాంతానికి సమీపంలోనే పోలీసు క్యాంప్ ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోక పోవడం గమనార్హం. ఫ్లెక్సీని వారే చింపేసుకుని వైఎస్సార్సీపీ నేతలపై కేసు సాక్షి, టాస్క్ ఫోర్స్: పులివెందులలో కూటమి నాయకులు, పోలీసుల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఓబుల్ రెడ్డి పేరుతో జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందుల మండలం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ విషయంపై పులివెందుల పోలీసులు అదే గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకుడు శంకర్ నారాయణకు ఫోన్ చేసి, అక్కడ టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని సూచించారు. దీనిపై శంకర్ నారాయణ స్పందిస్తూ.. ఆ ఫ్లెక్సీని తొలగించాల్సిన అవసరం తనకు లేదని బదులిచ్చారు. అనంతరం కొద్ది గంటల్లోనే శంకర్ నారాయణతో పాటు మరో ముగ్గురిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ధ్వంసం చేశారంటూ వారిపై కేసు నమోదు చేశారు. కూటమి నాయకుల ఆదేశాలతో పోలీసులు ముందస్తు వ్యూహంలో భాగంగా ఈ అక్రమ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. -
పులివెందుల ZPTC ఉప ఎన్నికలో భాగంగా ఎర్రిపల్లిలో ఇంటింటి ప్రచారం
-
బరితెగించిన 'బాబు గ్యాంగ్'
పూర్వం రాజుల కాలంలో బందిపోట్లుండేవారు.. ఉన్నట్లుండి మెరుపు దాడులు చేస్తూ దోచుకెళ్లేవారు.. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు దొంగల ముఠా అంతకు మించి అన్నట్లు బరితెగించి వ్యవహరిస్తోంది.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ ముఠా అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేయడమే లక్ష్యంగా మెరుపు దాడులకు ఉపక్రమించింది.. గుంపులు గుంపులుగా వాహనాల్లో రావడం.. ఆయుధాలు చేత పట్టుకుని విచక్షణా రహితంగా దాడులు చేసి వెళ్లడం పరిపాటిగా మారింది.. ఇదంతా పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతుండటం దుర్మార్గం.. ఎలాగైనా సరే పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా చేసి.. ఓటింగ్ క్యాప్చర్ చేసి గెలవాలనే కుతంత్రంతో ఇలా చేస్తోంది.. ఈ అరాచకం చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఆటవిక పాలనకు అచ్చుగుద్దినట్లు అద్దం పడుతోంది.సాక్షి, టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ చంద్రబాబు అండ్ గ్యాంగ్ బరితెగించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే డిపాజిట్ కూడా దక్కదనే భయంతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా కుట్రలు, కుతంత్రాలకు తెగబడింది. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా వైఎస్సార్సీపీ నేతలపై వరుస దాడులకు పాల్పడుతూ వసు్తన్న ఈ సైకో గ్యాంగ్.. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల మండల నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి (వేల్పుల రాము)లపై బుధవారం పులివెందుల రూరల్ మండలం నల్లగొండువారిపల్లెలో హత్యాయత్నం చేసింది. ఇనుప సమ్మెటలు, రాడ్లు చేత పట్టుకుని టీడీపీ రౌడీ మూకలు విచక్షణారహితంగా దాడికి దిగాయి. వాడే.. టార్గెట్.. వేయండి.. అంటూ సైకోల్లా అరుపులు, కేకలతో అరగంటపాటు రెచ్చిపోయాయి. ఈ దాడిలో రామలింగారెడ్డి తలకు బలమైన గాయం కాగా, ఎమ్మెల్సీ భుజం ఎముక విరిగింది. ఊహించని పరిణామాన్ని ఎదుర్కొన్న వైఎస్సార్సీపీ నేతలకు ఆ గ్రామ మహిళలు అండగా నిలిచి, ప్రతిఘటించేందుకు సిద్ధమవడంతో టీడీపీ మూకలు అక్కడి నుంచి తోకముడిచాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... పులివెందుల మండలం నల్లగొండువారిపల్లె గ్రామానికి చెందిన చెన్నారెడ్డి.. వేల్పుల రామలింగారెడ్డికి సమీప బంధువు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఆయనతో చర్చించేందుకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో కలిసి వేల్పుల రామలింగారెడ్డి బుధవారం ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఆయనతో మాట్లాడిన తర్వాత పక్కనే ఉన్న సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఈశ్వరరెడ్డితో మాట్లాడేందుకు వెళ్తుండగా, ఒక్కమారుగా టీడీపీ రౌడీ మూకలు వారిని చుట్టుముట్టాయి. వేల్పుల రామలింగారెడ్డి తలపై రాడ్డుతో కొట్టారు. దీంతో తల పగిలి ఆయన కింద పడిపోయారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పైనా అదే స్థాయిలో దాడి చేశారు. రమేష్ యాదవ్ తల తిప్పడంతో భుజంపై రాడ్ల దెబ్బలు పడ్డాయి. దాంతో ఆయన భుజం ఎముకలు విరిగిపోయాయి. ఆపై ఎమ్మెల్సీ రేంజ్ రోవర్, వేల్పుల రామలింగారెడ్డికి చెందిన ఫార్చ్యూనర్, స్కార్పియో వాహనాలను సమ్మెటలతో ధ్వంసం చేయగా..అలజడి రేగడంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన మహిళలు.. కింద పడిపోయిన రామలింగారెడ్డికి అడ్డుగా నిలిచారు. ఆయనపై మళ్లీ దాడి చేయబోతుండగా టీడీపీ మూకలను అడ్డుకున్నారు. కొంత మంది మహిళలు ఆయనను లాక్కెళ్లి పక్కనే ఉన్న ఇంట్లో వేసి తాళం వేశారు. దీంతో టీడీపీ రౌడీలు.. తాళం వేసిన ఇంటి లోపలికి పెట్రోల్ చల్లారు. నిప్పు పెట్టేందుకు విఫలయత్నం చేశారు. గొడవ జరుగుతోందనే విషయం గ్రామం మొత్తానికి తెలియడంతో గ్రామస్తులంతా అక్కడికి వచ్చారు. గ్రామస్తులు తిరగబడటంంతో టీడీపీ రౌడీ మూకలు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు.తుద ముట్టించేందుకు పక్కా ప్రణాళికవేల్పుల రామలింగారెడ్డి ఆ ప్రాంతంలో టీడీపీ నాయకులకు కంటగింపుగా ఉన్నారు. టిఫెన్ బెరైటీస్ కంపెనీ కేర్‌టేకర్‌గా కొనసాగుతున్నారు. అందులో నిల్వ ఉన్న కోట్లాది రూపాయల విలువైన బెరైటీస్ దోపిడీపై.. టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి సహకారంతో వేముల పార్థసారథిరెడ్డి, మబ్బుచింతపల్లె శ్రీనాథరెడ్డి దొంగిలించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిఫెన్ బెరైటీస్‌లో అక్రమ మైనింగ్‌కు అడ్డుగా నిలవగంతో ఆయన టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం కనంపల్లె, మోట్నూతల గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయాయి. పక్కా ప్రణాళికతో ఆయన్ను తుద ముట్టించాలని టీడీపీ శ్రేణులు కుట్ర పన్నాయి. బుధవారం ఆయన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో కలిసి నల్లగొండువారిపల్లెకు వెళ్లారని తెలుసుకుని.. ఇనుçప సమ్మెటలు, రాడ్లు.. పెట్రోల్ బాటిళ్లు తదితర మారణాయుధాలతో అక్కడికి వెళ్లి మాటు వేశారు. ఇవన్నీ పరిశీలిస్తే వేల్పుల రామలింగారెడ్డిని అంతం చేయాలని పక్కా ప్రణాళికతోనే టీడీపీ మూకలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తలపై రాడ్డుతో కొట్టగానే రామలింగారెడ్డి కింద పడిపోగా, ఆ వెంటనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై వారు దాడికి దిగారు. ఆ సమయంలో గుంపులో నుంచి ‘వీడితో పాటు వాడిని కూడా వదలొద్దు’ అంటూ కేకలు విన్పించడంతో మళ్లీ రామలింగారెడ్డి వైపు తిరిగారు. అప్పటికే మహిళలు అడ్డుగా నిలవడంతో రెండోసారి దాడి చేయడం సాధ్యపడలేదని తెలుస్తోంది. గ్రామంలో కాకుండా మార్గం మద్యలో దాడి జరిగి ఉంటే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ హత్యకు గురై ఉండే వారని గ్రామస్తులు చెబుతున్నారు. హైకోర్టు ఆదేశించినా భద్రత కరువుటీడీపీ నేతలతో ప్రాణహాని ఉందని, టిఫెన్ బెరైటీస్ కంపెనీకి కేర్ టేకర్‌గా ఉన్న తనకు పలువురితో ముప్పు ఉందని.. భద్రత కల్పించాలని వేల్పుల రామలింగారెడ్డి పోలీసు యంత్రాంగాన్ని అభ్యర్థించారు. ఏడాదిగా ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వన్ ప్లస్ వన్ భద్రత కల్పించాలని ఆదేశించింది. గన్మెన్ల జీతాలు సొంతంగా చెల్లించేందుకు ఆయన అంగీకరించడంతో ఆ దిశగా హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు వెలువడి నెల అవుతున్నా, వాటిని పోలీసులు అమలు పరచలేదు. అంటే ఆయన్ను తుద ముట్టించే కుట్రలో వారు కూడా భాగస్వాములు కావడం దుర్మార్గం. ఈ దాడిలో ఆయన ఆ గ్రామ మహిళల అండతో వెంట్రుక వాసిలో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఏ ఒక్కరిపై బుధవారం రాత్రి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.వరుస ఘటనలు.. యథేచ్ఛగా నిందితులుమంగళవారం పులివెందుల శ్రీకర్ ఫంక్షన్ హాల్లో వివాహానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు సైదాపురం సురేష్‌కుమార్‌రెడ్డి (చంటి), అమరేష్‌రెడ్డి, నాగేష్, శ్రీకాంత్, తన్మోహన్రెడ్డి పై టీడీపీ రౌడీ మూకలు హత్యాయత్నం చేశాయి. అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌బాషా (కిరికిరి బాషా) ముఠా దాడి చేసి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. బుధవారం వేల్పుల రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లపై హత్యాయత్నం ఘటనలో కూడా అదే ముఠాతో పాటు వేముల పార్థసారథిరెడ్డి సోదరుడు పేర్ల శేషారెడ్డి సమీప బంధువులు పాల్గొన్నారు. ఈ ఘటనలోనూ పోలీసులు వెంటనే స్పందించక పోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంతమైన పులివెందులలో ఉద్రిక్తతలకు బ్రేక్ వేయాల్సిన పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నందునే వరుస ఘటనలు తెరపైకి వస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కర్రలు, రాళ్లతో దాడి చేశారు.. మా గ్రామంలో సింగిల్ విండో ప్రెసిడెంట్ ఈశ్వరరెడ్డి, చెన్నారెడ్డిల ఇళ్ల వద్దకు వేల్పుల రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లు మాట్లాడేందుకు వచ్చారు. ఇది తెలుసుకున్న టీడీపీ అల్లరి మూకలు 15 వాహనాల్లో మా ఊరికి వచ్చారు. వచ్చీ రాగానే నాలుగు వాహనాలను ధ్వంసం చేసి.. రామలింగారెడ్డి, రమేష్ యాదవ్‌లను గాయపరిచారు. కర్రలు, రాడ్లతో కొట్టారు. – సునీల్ కుమార్‌రెడ్డి, గ్రామస్తుడు, నల్లగొండువారిపల్లె ఎదురుపడి ఉంటే చంపేసేవారు మా గ్రామం రోడ్డుపై వేల్పుల రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లు ఎదురుపడి ఉంటే టీడీపీ మూకలు వారిని చంపేసేవి. వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు అడ్డుపడకపోతే వారిని హతమార్చేవారు. – వెంకట్రామిరెడ్డి, గ్రామస్తుడు, నల్లగొండువారిపల్లె ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదుజెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగకూడదనే టీడీపీ వారు ఇలా దాడులకు పాల్పడ్డారు. ఇంటిపై పెట్రోలు పోసి.. నిప్పంటించబోయారంటే ఎంతగా తెగించారో ఇట్టే తెలుస్తోంది. 40 ఏళ్లుగా ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదు. – వై.వేణుగోపాల్‌రెడ్డి, గ్రామస్తుడు, నల్లగొండువారిపల్లెపోలీసుల తీరుపై శాంతియుత ర్యాలీవైఎస్సార్సీపీ నాయకులపై వరుసగా హత్యాయత్నాలు జరుగుతున్నా పోలీసు అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం, నిందితుల్ని అరెస్టు చేయకుండా యథేచ్ఛగా మరిన్ని దాడులు చేసేందుకు ఆస్కారం కల్పించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు కడపలో బుధవారం శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ మంత్రి అంజాద్‌బాషా, కమలాపురం ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వందలాది మందితో 3 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. అనంతరం అర్బన్ పోలీసు స్టేషన్లో డీఎస్పీ మురళీనాయక్‌కు వినతిపత్రం అందించారు.బాబు డైరెక్షన్.. బీటెక్ రవి యాక్షన్⇒ పులివెందుల నియోజకవర్గంలో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరెక్షన్లో ఎమ్మెల్సీ బీటెక్ రవి యాక్షన్ చేస్తున్నారు. మంగళవారం రాత్రి వైఎస్సార్సీపీ నేతలు సురేష్ కుమార్‌రెడ్డి, అమరేష్‌రెడ్డి తదితరులపై హత్యాయత్నం ఘటనలో టీడీపీ వర్గీయులైన అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి, కిరికిరిబాషా బృందంపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మీడియా ముందుకు వచ్చిన బీటెక్ రవి.. సురేష్ కుమార్‌రెడ్డికి వైఎస్సార్సీపీ నేతలకు మధ్య తేడాలు వచ్చాయని, అందుకే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారని.. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయనపై దాడి చేసి, నింద తమపై మోపారని చెప్పుకొచ్చారు. బుధవారం నాటి ఘటనతో టీడీపీకి సంబంధం లేనిదని తప్పించుకోజూశారు. ⇒ మరోవైపు రామలింగారెడ్డి వేముల మండలానికి చెందిన ఎస్సీ కార్యకర్తలను కులం పేరుతో దూషించడంతోనే ఘర్షణ చోటుచేసుకుందని ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కొద్ది రోజులుగా ఇక్కడ ఏం జరుగుతోందో స్థానికులందరికీ స్పష్టంగా తెలిసినా, బీటెక్ రవి ఇలా బరితెగించి మాట్లాడటంపై విస్తుపోతున్నారు. ⇒ టీడీపీ పులివెందుల ఇన్చార్జి బీటెక్ రవి కుట్రలు, ఎత్తుగడలకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తోడయ్యారు. వరుసగా వైఎస్సార్సీసీ నాయకులపై దాడి చేయడం ఈ కుట్రలో భాగం. బహుళ ప్రయోజనాలు ఆశించి ఇలా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరింత మంది వైఎస్సార్సీపీ నేతల్ని టార్గెట్ చేసి దాడి చేయనున్నట్లు సమాచారం. ఇలా వరుస దాడులతో పులివెందుల మండల ఓటర్లలో భయాందోళన సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తద్వారా జెడ్పీటీసీ ఉప ఎన్నికలను వైఎస్సార్సీపీ బహిష్కరించేలా చేయడం, లేదా ఒకవేళ ఓటింగ్ జరిగినా ఓటర్లు ఎవరూ పోలింగ్ కేంద్రాలకు రాకుండా చూడటమే లక్ష్యమని తెలుస్తోంది.ఓటమి తప్పదనే భయోత్పాతంవైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటుసాక్షి, అమరావతి: పులివెందులలో టీడీపీ గూండాల దాడి ఘటనను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదన్న సంగతి అర్థమై, కూటమి నేతలు ఇలా భయోత్సాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిను బుధవారం ఆయన ఫోన్లో పరామర్శించారు. వారితోపాటు టీడీపీ నేత బీటెక్ రవి అనుచరుల దాడిలో మంగళవారం గాయపడ్డ వైఎస్సార్సీపీ నేతలు సైదాపురం సురేష్ రెడ్డి (చంటి), అమరేష్ రెడ్డితో కూడా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో గెలవాలనే ప్రయత్నాన్ని కూటమి నేతలు చేస్తున్నారని, దీనిని తిప్పికొడదామని పార్టీ నేతలకు జగన్ సూచించారు. టీడీపీ కూటమి నేతలు వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. ఈ అనైతిక కార్యక్రమాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని.. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నేతలంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. -
పులివెందులలో పచ్చనేతల అరాచకం
పులివెందుల: ఏదైనా ఎన్నిక వస్తే ప్రజలకు తాము చేసిన మంచిని చెప్పుకొని ఓట్లు అడగడం రాజకీయ పార్టీలు పాటించే పద్ధతి. అనుకోని పరిస్థితుల్లో పదవిలో ఉన్న నాయకుడు చనిపోతే ఉప ఎన్నిక లేకుండా వారి కుటుంబానికి చెందిన వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేయడం గౌరవ సంప్రదాయం...! అయితే, తాము చేసింది ఏమీ లేక, రాజకీయాల్లో హుందాతనమూ మరిచిన టీడీపీ నేతలు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో బరితెగించారు. ఈ నెల 12న జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిట పచ్చ పార్టీ మూకలు చెలరేగాయి. పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వరరెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక నిర్వహిస్తుండగా టీడీపీ తమ అభ్యరి్థని నిలిపింది. తీవ్ర అనైతిక కార్యకలాపాలకు తెరలేపింది. చివరకు వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు కూడా తెగిస్తోంది. ఇదంతా పోలీసుల అండతోనే జరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. జైడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకుడు సైదాపురం సురేష్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో సురేష్‌రెడ్డిపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సురేష్‌రెడ్డి మంగళవారం ∙బంధువు అమరేశ్వరరెడ్డితో కలిసి పులివెందులలో టీడీపీ కార్యాలయ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుకకు హాజరయ్యారు. వారు కురీ్చల్లో కూర్చుని ఉండగా టీడీపీ కార్యాలయం నుంచి 30 మందిపైగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్రలు, రాళ్లతో వచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారు. సురేష్‌కు సంబంధించిన వాహనాన్ని ధ్వంసం చేశారు. దాడిలో అమరేశ్వరరెడ్డి తలకు బలమైన గాయమైంది. సురేష్ రెడ్డికి కమిలిన గాయాలయ్యాయి. చేయి విరిగింది. వీరిని పులివెందులలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెంటనే ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఓటమి ఖాయమై అసహనంతోనే దాడులు: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బాధితులను పరామర్శించిన అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ వారికి ఎక్కడా గెలుపు ఆశ కనిపించలేదని దీంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి ఉప ఎన్నికను కంట్రోల్లోకి తెచ్చుకోవాలని కుటిల పన్నాగం పన్నారని పేర్కొన్నారు. అమరే‹Ù, జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న సురేష్ రెడ్డి ఓ పెళ్లికి వెళ్లగా ఐదు వాహనాల్లో అక్కెళ్ల విజయ్‌కుమార్‌రెడ్డి, కిరికిరి బాషా, 30 మందిపైగా టీడీపీ కార్యకర్తలు కర్రలతో, రాడ్లతో దాడి చేశారని తెలిపారు. కేవలం ఈ ఎన్నిక కోసం భయభ్రాంతులకు గురిచేయడానికి, హత్యలకు సైతం వెనుకాడడం లేదని మండిపడ్డారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఇన్చార్జి, చంద్రబాబుకు నిజంగా వారి పాలనపై నమ్మకం ఉంటే, సూపర్ సిక్స్ అమలు చేశామన్న ధీమా ఉంటే, ఉప ఎన్నికను పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేశారు. అంతేగాని తమ కార్యకర్తలు, ఇతరుల మీద తీవ్ర దాడులు చేసి ప్రజ లను, భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికలను నియంత్రించాలని అనుకోవడం పిరికిపంద చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అడ్డుపెట్టుకుని, పోలీసులు తొత్తులుగా ఉండడంతో తప్పుడు పనులు చేస్తున్నారని... చంద్రబాబు తప్పుడు సంస్కృతికి బీజం వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న పులివెందులలో రెచ్చగొట్టేలా దాడులు చేస్తే ఎవరూ భయపడరని తేల్చిచెప్పారు. దాడులు తక్షణమే మానుకోవాలని టీడీపీ నేతలను హెచ్చరించారు. లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు. తాము కూడా కోర్టుల దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ తెలిపారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను కేసులున్నా, లేకపోయినా బైండోవర్ చేస్తున్నారని, మంగళవారం ఒక చిన్న మండలంలో వందమందిని బైండోవర్ చేశారని పేర్కొన్నారు. దీన్నిబట్టే వైఎస్సార్సీపీని ఎదుర్కొనడానికి చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో తెలుస్తోందని చెప్పారు. ఉప ఎన్నిక సజావుగా జరిగేలా ఎన్నికల కమిషన్‌కు మనవి చేస్తున్నామని, మీడియా కూడా ఫెయిర్ పోలింగ్‌కు చొరవ తీసుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. -
అజ్జూ భాయ్‌కే జూబ్లీహిల్స్?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీచేసే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్స్ క్రమంగా వీడుతోంది. ఈ సీటు కోసం మైనార్టీ, కమ్మ, బీసీ సామాజిక వర్గాల నేతలు పోటీ పడుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ వైపే ఈసారి కూడా పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుంచి అభ్యరి్థని ఎంపిక చేసే అంశం కూడా పరిశీలనలో ఉందని, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌ను బరిలో దించే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకోవైపు బీసీ కోటాలో నవీన్ యాదవ్ పేరు కూడా విన్పిస్తున్నా.. మైనార్టీ వర్గం వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుందనే అభిప్రాయం పార్టీవర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రతి మంత్రి పరిధిలో కొందరు చైర్మన్లు బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఏడాది అక్టోబర్‌లో ఉప ఎన్నిక జరగవచ్చనే అంచనాలో ఉన్న అధికార కాంగ్రెస్ ఇప్పటినుంచే గెలుపు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్‌లకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. తాజాగా 25 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా రంగంలోకి దింపింది. ప్రతి మంత్రి పరిధిలో కొందరు చైర్మన్లు బూత్‌స్థాయిలో పనిచేసేలా కార్యాచరణ రూపొందించింది. కార్పొరేషన్ చైర్మన్లు కేస వేణు, పటేల్ రమేశ్‌రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, మువ్వా విజయ్‌బాబు, మానాల మోహన్‌రెడ్డి, బండ్రు శోభారాణి, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, గుత్తా అమిత్‌రెడ్డి, ఇనగాల వెంకట్రామిరెడ్డి, శివసేనారెడ్డి, బెల్లయ్య నాయక్, తాహెర్ బిన్ అహ్మద్, లక్ష్మణ్ యాదవ్, రాయల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్, ఈరవత్రి అనిల్, జంగా రాఘవరెడ్డి, రియాజ్, ఎన్.ప్రీతంలను ముగ్గురు మంత్రుల పరిధిలో పనిచేయాల్సిందిగా టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఆదేశించారు. సోషల్ మీడియాకు మన్నె సతీశ్, సాంస్కృతిక బృందాలకు పుంజాల అలేఖ్య, వెన్నెల, వికలాంగ ఓటర్ల ప్రచారానికి ముత్తినేని వీరయ్య వర్మలు సారథ్యం వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కార్పొరేషన్ చైర్మన్లతో.. మంత్రి పొన్నంతో కలిసి మరో మంత్రి తుమ్మల నాగేశ్వరావు తన నివాసంలో భేటీ అయ్యారు. పోలింగ్ బూత్ స్థాయిలో అమలు చేయాల్సిన కార్యాచరణపై వారితో చర్చించారు. -
హెచ్‌సీఏ కంటే జూబ్లీహిల్స్ బైఎలక్షనే నాకు ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌లో చోటు చేసుకున్న పరిణామాలపై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించారు. హెచ్‌సీఏ అవినీతి సర్వసాధారణం అయ్యిందన్న ఆయన.. తాను ఆ విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేనని అన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ..‘‘రూల్స్ పాటించకపోతే ఇలాంటి కష్టాలే వస్తాయ్. హెచ్‌సీఏలో చాలా సమస్యలున్నాయ్. అసోషియేషన్ అనేది ఎప్పుడూ స్వలాభంతో నడవకూడదు. ఫోర్జరీ చేసినందుకే ప్రస్తుత ప్రెసిడెంట్ అరెస్ట్ అయ్యాడు. కాబట్టి, ఇప్పటివరకు జరిగిన అవకతవకలు బయటకి తీయాలి. హెచ్‌సీఏలో జరుగుతున్న పరిణామాలపై బీసీసీఐ ఫోకస్ పెట్టాలి. హెచ్‌సీఏ సభ్యులు, కోచ్‌ల పిల్లలనే క్రికెట్ ఆడిస్తున్నారు. సెలక్టర్లలో కూడా అవినీతి ఉంది. మొత్తంగా అవినీతి అనేది కామన్‌గా మారింది. పార్టీ ఆదేశిస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తా. జూబ్లీహిల్స్ రేసులో నేను కూడా ఉన్నాను. హెచ్‌సీఏ కంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో పోటీ చేయడమే నా ముఖ్య లక్ష్యం’’ అని అజారుద్దీన్ కుండబద్ధలు కొట్టారు. -
జూబ్లీహిల్స్‌లో విజయం మాదే: పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. విజయం కాంగ్రెస్ పార్టీదే అని చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటి నుండి గ్రౌండ్ లెవెల్లో ప్రణాళిక ద్వారా ముందుకు పోవాలని సూచించారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుండి సన్నద్ధం కావాలి అని అన్నారు.ఈరోజు హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..‘జూలై నాలుగో తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సందర్భంగా సభను విజయవంతం చేయాలి. హైదరాబాద్‌లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి ముఖ్య నేతలు సభలో పాల్గొనాలి. సభ ఏర్పాట్లపై నేతలు, కార్యకర్తలు యాక్టివ్‌గా ఉండాలి. హైదరాబాద్‌లో పార్టీకి సంబంధించిన ఇష్యూ నా దృష్టికి వచ్చాయి.దేవాలయ కమిటీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, బోనాల చెక్కుల పంపిణీ తదితర ప్రోటోకాల్ సమస్యలపై చర్చించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న వారికి నామినేటెడ్ పోస్టులు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుండి సన్నద్ధం కావాలి. జీహెచ్ఎంసీ మేయర్ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. ప్రభుత్వ సంక్షేమమే కాంగ్రెస్‌ను గెలిపిస్తుంది’ అని వ్యాఖ్యలు చేశారు. -
Jubilee Hills By Election: బరిపై మజ్లిస్ గురి!
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ ‘జూబ్లీహిల్స్’ అసెంబ్లీ ఉప ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే పాతబస్తీలో ఎదురులేని రాజకీయ శక్తిగా అవతరించిన ఆ పార్టీ.. జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సెగ్మెంట్లలోని డివిజన్లలో ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఉప ఎన్నికల్లోనైనా జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్ధానాన్ని దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వాస్తవంగా తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఇక్కడి బరిలో దిగి ఢీ.. అంటే ఢీ అనే విధంగా పోటీపడి స్పల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంతో నిలిచింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ దోస్తీ కోసం బరిలో దిగలేదు. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసినప్పటికీ పరాజయం తప్పలేదు. తాజాగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌తో సత్సంబంధాలు కలిగి ఉన్నా.. సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ది కావడంతో పోటీలో ఉండాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ బరిలో దిగే అవకాశం ఉన్నా.. స్నేహపూర్వకంగానే పోటీ ఇచ్చి అసెంబ్లీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ఇది చక్కని అవకాశంగా భావిస్తోంది. ఇదీ పరిస్థితి.. 2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ గట్టి పోటీ ఇచి్చంది. అప్పటో ఆ పార్టీ తరఫున రంగంలో దిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ తొమ్మిదివేల పైచిలుకు ఓట్లతో తేడాతో రెండో స్థానంలో నిలిచారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పటి మిత్రపక్షమైన అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. నవీన్ యాదవ్ మజ్లిస్‌కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసి సుమారు 18 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన మజ్లిస్.. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగింది. వాస్తవంగా అధికార పక్షం దోస్తీ కోసం పార్టీ విస్తరణను సైతం స్వయంగా అడ్డుకట్ట వేసుకునే మజ్లిస్.. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి షేక్‌పేట కార్పొరేటర్ మహ్మద్ రషీద్‌ను బరిలో దింపడం వెనుక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముస్లిం మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ పారీ్టకి మళ్లకుండా చేసి అధికార బీఆర్ఎస్కు సహకరించేందుకు మజ్లిస్ పార్టీ బరిలో దిగినట్లు ప్రచారం సాగింది. అందరూ ఊహించినట్లే బీఆర్ఎస్కు లాభం చేకూరింది. కానీ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేజారగా.. కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆ తర్వాత కాంగ్రెస్‌తో మజ్లిస్ స్నేహం కుదరింది. తాజాగా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.ముస్లిం ఓటర్లు మూడో వంతుజూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడోవంతు ముస్లిం ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ పరిధిలోని పలు డివిజన్లలో మజ్లిస్ ప్రాతినిధ్యం కలిగి ఉంది. ప్రతినిత్యం స్థానిక సమస్యలపై పైదల్ దౌరా (పాదయాత్ర) నిర్వహిస్తుండటంతో ప్రజల్లో కూడా గట్టి పట్టు ఉంది. దీంతో రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనారిటీలు మజ్లిస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఈసారి ఉప ఎన్నికల బరిలో గెలుపు గుర్రాన్ని నిలిపేందుకు కసరత్తు చేస్తోంది.ఇటీవల పోటీ చేసిన షేక్‌పేట కార్పొరేటర్ మహ్మద్ రషీద్ పెద్దగా ఓట్లు రాబట్టుకోక పోవడంతో ఈసారి మరొకరిని పోటీకి దింపాలని యోచిస్తోంది. మజ్లిస్ పార్టీ పక్షాన మహిళా సాధికారత కోసం గళం విప్పుతున్న విద్యావంతురాలు, జాతీయ కరాటే చాంపియన్ సయ్యదా ఫలక్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోంది. గతంలో ఉమ్మడి పౌరసత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌తో పాటు దేవబంద్, ఢిల్లీ, షాహీన్‌బాగ్‌లలో జరిగిన నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించి పార్టీ దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు కార్పొరేటర్ల అభ్యర్థిత్వాలను సైతం పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
జూబ్లీహిల్స్ బరిలో నేనే ఉన్నా: మహ్మద్ అజారుద్దీన్
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారని అంశంపై పార్టీలోను, నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో ఏ నలుగురిని కదిలించినా కూడా ఇదే అంశంపై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ ఆయన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు.తాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడానని తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగిందని అన్నారు.మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సగం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా తాను పనిచేశానని అన్నారు. తమ పార్టీలోనే ఉన్న కొంతమంది వ్యక్తులు కావాలని కొన్ని పత్రికల్లో, మీడియా మాధ్యమాల్లో, వెబ్ సైట్ల లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని, తనకు టికెట్ ఇవ్వడంలేదని ప్రచారం చేస్తున్నారని ఈ విషయాన్ని కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసి వేణు గోపాల్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గడిచిన ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికీ పలుమార్లు బూత్ స్థాయి లో, డివిజన్ స్థాయిలో సమావేశాలు సైతం నిర్వహించామని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ తెచ్చుకొని, గెలిచి రాహుల్ గాంధీ కి బహుమతిగా అందిస్తామని అన్నారు. -
హైదరాబాద్‌లో మరో ఉప ఎన్నిక!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నగరంలో మరో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన లాస్య నందిత 2024 ఫిబ్రవరి 23న కారు ప్రమాదంతో మృతి చెందడంతో మే నెలలో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన లాస్య నందిత సోదరి నివేదితకు ఓటమి ఎదురైంది. సీనియర్ నాయకుడు జి.సాయన్న మరణంతో ఆయన వారసురాలిగా లాస్యనందిత రాజకీయాల్లోకి రావడం తెలిసిందే. ఆమె మరణంతో మేలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన నారాయణ్ శ్రీగణేశ్ గెలిచారు. తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో మళ్లీ ఉప ఎన్నిక జరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయ్యాక ఆర్నెల్ల లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగాక రెండేళ్లలోపునే రెండు ఉప ఎన్నికలు.. హైదరాబాద్‌లోనే కాదు.. బహుశా ఏ జిల్లాలోనూ జరిగి ఉండవు. -
ఉప ఎన్నికలు రావు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘శాసనసభ 2014 నుంచి 2023 వరకు ఏ సంప్రదాయాలను ఆచరించిందో ఇప్పుడు కూడా వాటినే ఆచరిస్తున్నం. అప్పటి నుంచి చట్టం మారలే.. న్యాయం మారలే.. స్పీకర్ పదవి, విప్ పదవి మారలే.. పాలకపక్షం, ప్రతిపక్షం అట్లనే ఉన్నాయి. రాజ్యాంగం అసలే మారలేదు. ఇంక ఎట్లొస్తయ్ ఉప ఎన్నికలు? సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థలో పాటించిన పద్ధతులను పరిగణనలోకి తీసుకుని గతంలో అవలంబించిన విధానాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. వాటి ప్రకారం ఏ ఉప ఎన్నికలు రావని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో సీఎం రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్టీ మారారా, మారలేదా అంటే మేం మారనే లేదు. అభివృద్ధిలో భాగంగా సీఎంని కలసి వచ్చామని కాంగ్రెస్‌లో చేరినవాళ్లు అంటున్నారు. మీరు మంత్రులు చేసినవాళ్లు అనర్హులు కాలేదు. ఉప ఎన్నికలు రాలేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని, వచ్చే వారమే ఉప ఎన్నికలని అంటున్నారు. ఎట్లా వస్తాయి? రూల్‌బుక్ వాళ్లే రాశారు. రూల్‌బుక్ కూడా మారలేదు కదా. ప్రచారం కూడా చేసుకుంటున్నరు.. ఒకాయన (తాటికొండ రాజయ్య) నేనే అభ్యరి్థని అని ఆడ, ఈడ ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన అమాయకుడు. తెల్లపంచె కట్టుకొని తిరుగుతున్నడని గతంలో ఉప ముఖ్యమంత్రి పదవినే ఊడబీకిన్రు. ఇప్పుడు ఆయన.. ఉప ఎన్నిక వచ్చింది. వచ్చే వారమే ఎలక్షన్ అని తిరుగుతున్నరు. సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారు (హరీశ్‌రావు) ఉప ఎన్నిక కోరుకున్నా కూడా రావు. ఒకవేళ ఆయన ఇటొచి్చనా, అటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు. సభకు కోర్టు నుంచి రక్షణ ఉంటుంది.. పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. సభలో నేను మాట్లాడితే కొంత రక్షణ ఉంటుంది. బయట మాట్లాడేవాళ్లకు ఆ ప్రొటెక్షన్ ఉండదు. సభ బయట ఉప ఎన్నికలు వస్తాయని.. వచ్చే వారమే ఉప ఎన్నిక అని అంటున్నారు. అదంతా ఉత్తదే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీదనే మేం దృష్టి పెట్టాం. ఎన్నికలు, ఉప ఎన్నికల మీద మాకు దృష్టి లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలి. తప్పు చేసినవాళ్లను శిక్షించాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలనేదే మా ఉద్దేశం..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నారు?
సాక్షి, నూఢిల్లీ : తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ప్రజాప్రతినిధులపై దాడి జరుగుతుంటే అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. దాడికి పాల్పడ్డ వారి పేర్లు ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదని నిలదీసింది. ఈ ఘటనపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి శుక్రవారం నోటీసులిచ్చింది. తిరుపతి ఘటనపై వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి 18న ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ‘ఫిబ్రవరి 3న తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు నేను, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం బస్సులో వెళ్తున్నాం. మాతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. వేరే పార్టీకి చెందిన కొందరు మా బస్సును అడ్డగించారు. రాడ్లతో బస్సు అద్దాలు ధ్వంసం చేసి లోపలకు చొరబడ్డారు. నాపైన, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లపైన భౌతిక దాడికి పాల్పడ్డారు. చొక్కాలు చించి మరీ భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటన అంతా పోలీసుల సాక్షిగానే జరిగింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే’ అంటూ ఎంపీ గురుమూర్తి ఆ ఫిర్యాదులో తెలిపారు.ఎఫ్ఐఆర్లో ఎంపీ ఫిర్యాదు చేసిన వారి పేర్లేవి?ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ ఘటనకు సంబంధించిన వార్తలు కూడా న్యూస్ ఛాన్నెళ్లు, పత్రికల్లో కూడా వచ్చాయి. దాడికి పాల్పడ్డ వారి పేర్లను ప్రస్తావిస్తూ తిరుపతి ఎస్పీకి ఎంపీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. అయితే ఎస్వీయూ పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ 18/2025లో ఎంపీ ప్రస్తావించిన పేర్లు లేవు. ప్రజా ప్రతినిధులు వెళుతున్న బస్సుకు పోలీసు ఎస్కార్ట్ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్‌ను సైతం ఎస్పీకి ఇచ్చారు. అయినా వారికి పోలీసులు సరైన భద్రత ఎందుకు కల్పించలేదు?’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు ఎందుకు చేర్చలేదో, ప్రస్తుతం ఆ ఎఫ్ఐఆర్పై జరిపిన విచారణ, పూర్తి సమాచారం, ఆధారాలతో సహా నివేదిక ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. -
విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
సాక్షి, ఢిల్లీ: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను ఈసీ రద్దు చేసింది. -
బీజేపీ నేతలు ప్రజానుబంధం ఏనాడో తెంచుకున్నారు
వయనాడ్: వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ వాద్రా విమర్శలను పెంచారు. ఆదివారం నైకెట్టి, సుల్తాన్ బతేరీ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆమె ఎన్నికల ప్రచారర్యాలీల్లో గిరిజనులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ ఇక్కడున్న పెద్దవాళ్లలో చాలా మందికి మా నాన్నమ్మ ఇందిరాగాంధీ బాగా తెలిసే ఉంటుంది. గిరిజనులతో ఆమెకు ఎంతో అనుబంధం ఉండేది. ఇక్కడి భూమి, అడవులు, నేల, నీరుతో గిరిజనులు అవినాభావ సంబంధం ఉంది. పేదల అభ్యున్నతి కోసమే అటవీ చట్టం, గ్రామీణ ఉపాధ హామీ పథకం, విద్యాహక్కుచట్టం తెచ్చాం. అదే బీజేపీ నేతలు సొంతవాళ్లనే పట్టించుకుంటూ గిరిజనులను, జనాలను గాలికొదిలేసింది. అసలు బీజేపీ నేతలు ప్రజలతో బంధాన్ని ఏనాడో తెంచుకున్నారు’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. -
వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ: ప్రియాంక గాంధీ
వయనాడ్: వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ అని ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఇదే సమయంలో బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం ప్రజాక్షేమం కోసం కాకుండా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందంటూ కామెంట్స్ చేశారు.వయనాడ్ ఉప ఎన్నికల సందర్బంగా ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో ప్రియాంక మాట్లాడుతూ..‘వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ. వయనాడ్ ప్రజలు అణచివేతదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏ మతానికి చెందిన వారైనా అందరూ కలిసి జీవించే భూమి వయనాడ్. పజాస్సి రాజా, తలక్కల్ చంతు, ఎడచెన కుంకన్ వంటి నాయకుల స్ఫూర్తి కలిగిన బలమైన చరిత్ర మీకు ఉంది. మీరు ఎల్లప్పుడూ సరైన దాని కోసం పోరాడారు. అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు.ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా ప్రియాంక.. తన వ్యాపార మిత్రుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. దేశంలో నిరుద్యోగుల గురించి మోదీ సర్కార్ ఏనాడు ఆలోచించదు. మెరుగైన ఆరోగ్యం, విద్య కోసం కార్యక్రమాలు చేపట్టడం లేదు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే బీజేపీకి ఉండదు. ఏం చేసైనా అధికారంలో ఉండాలన్నదే వారి లక్ష్యం. ప్రజలను విడగొట్టడం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజాస్వామిక సంస్థలను నీరుగార్చడం ద్వారా అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. అలాగే, రాహుల్ గాంధీని విమర్శించడమే బీజేపీ పనిగా పెట్టుకోవడంతో ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. కానీ, వయానాడ్ ప్రజలకు రాహుల్‌కు ఎప్పుడూ అండగానే ఉన్నారని ప్రశంసించారు.ఇదిలా ఉండగా.. వయనాడ్‌లో నవంబర్ 13వ తేదీన పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ బరిలో ఉండగా.. బీజేపీ తరఫున నవ్య హరిదాస్ పోటీలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. #WATCH | Wayanad, Kerala: Congress leader and party's candidate for Wayanad Lok Sabha by-election, Priyanka Gandhi Vadra says, "Modi ji's government works only for his big businessman friends. His objective is not to give you a better life. It is not to find new jobs. It is not… pic.twitter.com/l5fkrO7pGX— ANI (@ANI) November 3, 2024 -
మదర్ థెరిసా మా ఇంటికి వచ్చారు: ప్రియాంకా గాంధీ
తిరువనంతపురం: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె వయనాడ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోమవారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. తనకు మానవతవాది, నొబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాతో ఉన్న అనుబంధాన్ని ప్రజలతో పంచుకున్నారు.‘‘నాకు 19 ఏళ్ల వయసులో మా నాన్నగారు( మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) చనిపోయారు. ఆ సమయంలో మదర్ థెరిసా మా అమ్మను (రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ)ని కలవడానికి మా ఇంటికి వచ్చారు. ఆ రోజు నాకు జ్వరం వచ్చి నా గదిలో ఉన్నాను. ఆమె నన్ను కూడా కలవడానికి వచ్చి.. నా తలపై చేయి వేసి, నా చేతికి రోజరీ అందించారు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేను బాధలో ఉన్నానని ఆమె గ్రహించి ఉండవచ్చు. .. ఆమె నాతో 'నువ్వు వచ్చి నాతో పని చేయి' అని చెప్పారు. నేను ఢిల్లీలోని మదర్ థెరిసా ఆశ్రమంలో పనిచేశాను. నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పటం ఇదే తొలిసారి. ఆశ్రమంలో నాకు పని నేర్పించారు. బాత్రూమ్లు కడగడం, పాత్రలు శుభ్రం చేయడం, పిల్లలను బయటికి తీసుకెళ్లడం. వారితో కలిసి పనిచేయడం ద్వారా నేను వారు ఎదుర్కొన్న బాధ, ఇబ్బందులు, సేవ చేయడం అంటే ఏంటో అర్థం చేసుకోగలిగాను. ఒక సంఘం ఎలా సహాయం చేస్తుందో తెలుసుకున్నా. ప్రజల అవసరాలు ఏంటో ఇప్పుడు నేను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నేను వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. మీ సమస్యలేమిటో వినాలనుకుంటున్నా’’ అని ర్యాలీలో పాల్గొన్న ఓటర్లతో అన్నారు.ఏప్రిల్-జూన్ సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ సీటులో గెలిచిన రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ స్థానంలో కూడా విజయం సాధించారు. వయనాడ్ స్థానానికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ స్థానంలో ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఇక.. ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు.చదవండి: రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ -
యూపీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ దూరం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న తొమ్మది స్థానాలను ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సమాజ్‌వాదీ పారీ్టకే వదిలేయడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థులకే మద్దతివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ నిర్ణయం చేసిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే గురువారం తెలిపారు. నిజానికి çపాండే ప్రకటనకు ముందే ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఉప ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులందరూ తమ పార్టీ ఎన్నికల గుర్తు ’సైకిల్’పై పోటీ చేస్తారని ప్రకటించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఐక్యంగా ఉన్నాయని, భారీ విజయం కోసం భుజం భుజం కలిపి పనిచేస్తాయని, ఈ ఎన్నికల విజయంతో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తామని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అఖిలేశ్ ప్రకటన అనంతరం కాంగ్రెస్ తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించింది. నిజానికి ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న 9 స్థానాలకు గానూ కాంగ్రెస్ 5 స్థానాలను ఆశించింది. దీనిపై చర్చలు కొనసాగుతుండగానే 6 స్థానాల్లో ఎస్పీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన మూడు స్థానాల్లో ఘాజియాబాద్, ఖైర్ స్థానాల్లో కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు సుముఖత తెలిపింది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ గెలుపు అవకాశాలు లేకపోవడం, బీజేపీకి మెరుగైన అవకాశాలు ఉండటంతో ఈ స్థానాల్లో పోటీ చేయకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ‘ఇండియా కూటమి 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. మాకు గుర్తు ముఖ్యం కాదు..బీజేపీ దుష్పరిపాలన అంతం ముఖ్యం. శాంతి భద్రతలు ముఖ్యం‘అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్ పేర్కొన్నారు. దీనికి కౌంటర్‌గా బదులిచ్చిన బీజేపీ, ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’నినాదాన్ని ఎస్పీ నిజం చేస్తోందని ఎద్దేవా చేసింది. -
వయనాడ్ ఎవరది?.. డైనమిక్ లీడర్ నవ్య Vs ప్రియాంక
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. వయనాడ్‌ను దక్కించుకునేందుకు కాంగ్రెస్.. ప్రియాంక గాంధీని బరిలో నిలిపింది. ఈ నేపథ్యంలో ప్రియాంకకు పోటీగా యంగ్ డైనమిక్ లీడర్, కేరళ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ నవ్య హరిదాస్‌ను ఖరారు చేసింది. దీంతో, వీరి మధ్య పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.ఇక, బీజేపీ నవ్య హరిదాస్(39) పేరును ఖరారు చేయడంతో ఆమె ఎవరు? ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి? అనే చర్చ నడుస్తోంది. నవ్య ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. బీటెక్ చదవి ఉద్యోగం చేసిన నవ్య.. రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీలో తన ముద్ర వేసి తక్కువ కాలంలోనే అందరి దృష్టిలో పడ్డారు. తాజాగా వయనాడ్ బరిలోకి టికెట్ పొంది బంపరాఫర్ దక్కించుకున్నారు.నవ్య హరిదాస్ రాజకీయ నేపథ్యం..👉నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు.👉బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు.👉నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు.👉బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.👉2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి.👉అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.👉నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.ఇదిలా ఉండగా.. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలి రెండు స్థానాల నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించిన రాహుల్.. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ పార్లమెంట్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీన వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ ఉప ఎన్నిక జరగనుంది.Navya Haridas to take on PriyankaGandhi from the Wayanad Lok Sabha seat on a BJP ticket👍👍 pic.twitter.com/joo5dXrEhT— tsr. (@srikanth690935) October 19, 2024 -
వయనాడ్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును బీజేపీ ప్రకటించింది. నవ్య హరిదాస్ ఇక్కడి నుంచి తమ పార్టీ తరపున బరిలో ఉంటారని వెల్లడించింది. నవ్య కేరళ బీజేపీ మహిళామోర్చాకు ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. వయనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ రాజీనామాతో వయనాడ్‌కు ఉప ఎన్నిక వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌ను వదులుకుని ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. నవంబర్ 13న వయనాడ్ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జరగనుంది. ఇదీ చదవండి: జార్ఖండ్‌లో కాంగ్రెస్,జేఎంఎం మధ్య కుదిరిన పొత్తు -
వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి ఖుష్బూ!
సాక్షి, న్యూఢిల్లీ: వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున సినీనటి ఖుష్బూ సుందర్‌ను బరిలోకి దింపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోందని తెలుస్తోంది. పార్టీ తరఫున పోటీలో నిలిపే అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌లో ఖుష్బూ పేరును సైతం చేర్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీకి ఖుష్బూ అయితేనే గట్టిపోటీ ఇవ్వగలరనే భావన వ్యక్తమవుతోంది. వయనాడ్‌లో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. పార్టీ సీనియర్లయిన ఎంటీ రమేశ్, శోభా సురేంద్రన్, ఏపీ అబ్దుల్లా కుట్టి, షాన్ జార్జ్ పేర్లను బీజేపీ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ కసరత్తు కొలిక్కి వస్తున్న వేళ ఖుష్బూ పేరు తెరపైకి వచ్చింది. నిజానికి ఖుష్బూ 2010లో డీఎంకేలో చేరి, అనంతరం 2014లో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అనంతరం 2021లో కాంగ్రెస్‌ను వీడి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆమె ప్రస్తుతం బీజేపీ తమిళనాడు యూనిట్లో భాగంగా ఉన్నారు. తమిళనాడు నేపథ్యం ఉన్న ఆమెను వయనాడ్‌లో పోటీకి నిలిపే విషయమై బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్ర శాఖ తెలిపే అభిప్రాయం మేరకు అభ్యర్థిత్వంపై పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకట్రెండు రోజుల్లోనే పార్టీ అభ్యర్థిని ప్రకటించనుంది. -
ప్రియాంక ప్రత్యర్థి సత్యన్ మొకెరి
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీపై పోటీకి వామపక్ష ఎల్డీఎఫ్ సత్యన్ మొకెరిని ఎంపిక చేసింది. సీపీఐకి చెందిన మొకెరి కొజికోడ్ జిల్లాలోని నాదపురం మాజీ ఎమ్మెల్యే. వ్యవసాయ రంగానికి చెందిన సమస్యలపై పనిచేసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. వయనాడ్‌లో సత్యన్ మొకెరి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా ఉంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వమ్ గురువారం ప్రకటించారు. మొకెరి 2014 వయనాడ్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఐ.షానవాజ్ చేతిలో దాదాపు 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచి రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచి్చన విషయం తెలిసిందే. నవంబరు 13న వయనాడ్‌లో పోలింగ్ జరగనుంది. -
కాంగ్రెస్‌తో మైత్రి కొనసాగుతుంది: అఖిలేశ్
ఇటావా(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరిగే 10 స్థానాలకుగాను ఆరింటికి ఏకపక్షంగా టికెట్లు ఖరారు చేసిన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ పరిణామంపై గురువారం స్పందించారు. కాంగ్రెస్‌తో తమ పార్టీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఇండియా కూటమి ఉంటుంది. కాంగ్రెస్‌తో మా మైత్రి కూడా కొనసాగుతుంది అని మాత్రం చెప్పదలుచుకున్నా’అని తెలిపారు. రాజకీయాలపై చర్చించేందుకు సమయం కాదంటూ సీట్ల ప్రకటన వ్యవహారాన్ని దాటవేశారు. హరియాణా, కశ్‌మ్రీŠ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాల విషయం ప్రస్తావించగా మరోసారి మాట్లాడతానన్నారు. యూపీలో ఉప ఎన్నికలు జరిగే 10 స్థానాలకు గాను కాంగ్రెస్ ఐదింటిని డిమాండ్ చేస్తోంది. ఈ పది చోట్ల ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో గెలవడంతో ఖాళీ అయ్యాయి. -
కడియం శ్రీహరికి బుద్ధి చెప్తాం: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: రానున్న ఉప ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య శుక్రవారం(సెప్టెంబర్2) కేటీఆర్‌తో హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నియోజకవర్గం పార్టీలో మరింత ఉత్సాహం నింపేలా సంస్థాగతంగా మరింత బలంగా తీర్చిదిద్దేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల కేసులో ఇటీవలే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నెల రోజుల్లో ఈ విషయంలో చర్యలు మొదలు పెట్టాలని విచారణ స్టేటస్ రిపోర్టును తమకు నివేదించాలని స్పీకర్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. లేదంటే సుమోటోగా కేసు విచారిస్తామని తెలిపింది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటట్రావు, దానం నాగేందర్లపై బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఇదీ చదవండి.. రెండు నాలుకల కాంగ్రెస్.. ఇది ముమ్మాటికి మోసమే: కేటీఆర్ -
ఏపీలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 12న ఉప ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీతో పాటు కర్ణాటక, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని ఒక్కో స్థానానికి మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూలై 12న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. వీటిలో మూడు స్థానాలకు ఎమ్మెల్సీల రాజీనామా కారణంగా, రెండు స్థానాలకు అనర్హత వేటు కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఏపీలో సి.రామచంద్రయ్యపై అనర్హత వేటు పడగా, షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉంది. ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. -
వయనాడ్ నుంచి ప్రియాంక
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ స్థానాల్లో ఎంపీగా విజయం సాధించిన రాహుల్ గాంధీ ఇకపై రాయ్‌బరేలీ నుంచే కొనసాగుతారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. రెండింటా గెలిస్తే చట్టం ప్రకారం ఒక స్థానంలోనే కొనసాగాలి కాబట్టి రాయ్‌బరేలీ నుంచే రాహుల్ గాంధీ కొనసాగుతారని స్పష్టంచేశారు. ఎంతో అంతర్మథనం, చర్చల తర్వాత పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించిన రాహుల్‌కు ఖర్గే ధన్యవాదాలు తెలిపారు. రాయ్‌బరేలీ స్థానంతో రాహుల్ కుటుంబానికి తరతరాలుగా అనుబంధం ఉందని గుర్తుచేశారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా రాయ్‌బరేలీ నుంచే రాహుల్ కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు. వయనాడ్ ప్రజల ప్రేమాభినాలు రాహుల్‌కు లభించాయన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రియాంకా గాంధీ ఎంతో సహకరించారని ఖర్గే అభినందించారు. రాహుల్ ఏ స్థానం వదులుకోవాలన్న అంశంపై కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్, ప్రియాంకా గాం«దీ, కె.సి.వేణుగోపాల్ తదితరులు సోమవారం ఢిల్లీలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ అనంతరం ఖర్గే, రాహుల్ మీడియాతో మాట్లాడారు. రాయ్‌బరేలీతోపాటు వయనాడ్‌తో తనకు భావోద్వేగపూరిత అనుబంధం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. వయనాడ్‌ను వదులుకోవడం చాలా కఠిన నిర్ణయమేనని వెల్లడించారు. గత ఐదేళ్లపాటు వయనాడ్ ఎంపీగా కొనసాగడం అద్భుతమైన అనుభవం అని చెప్పారు. వయనాడ్ ప్రజలు తనకు అండగా నిలిచారని, సంక్షోభ సమయాల్లో తనకు కొత్త శక్తిని ఇచ్చారని కొనియాడారు. వారిని ఎప్పటికీ మర్చిపోలేనని వ్యాఖ్యానించారు. ఇకపై కూడా వయనాడ్‌ను సందర్శిస్తూనే ఉంటానని, అక్కడి ప్రజలకు ఇచి్చన హామీలను నెరవేరుస్తానని ఉద్ఘాటించారు. ఐదేళ్లపాటు ఎంతో ప్రేమాభిమానాలు పంచిన వయనాడ్ ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు తెలియజేశారు. వయనాడ్ నుంచి తన సోదరి ప్రియాంక పోటీ చేస్తుందని తెలిపారు. తమకు ఇద్దరు ఎంపీలు ఉన్నట్లుగా భావించాలని వయనాడ్ ప్రజలకు రాహుల్ సూచించారు. సంతోషంగా ఉంది: ప్రియాంకా గాంధీ వయనాడ్ నుంచి తాను పోటీ చేయాలని పార్టీ తీసుకున్న నిర్ణయంపై ప్రియాంకా గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా రాయ్‌బరేలీ, అమేథీలో పనిచేశానని, ఆ బంధం ఎట్టి పరిస్థితుల్లోనూ తెగిపోదని అన్నారు. ఆ బంధాన్ని కొనసాగించేందుకు తాను, రాహుల్ ఉన్నామని చెప్పారు. రాయ్‌బరేలీ, వాయనాడ్‌లో తనతోపాటు రాహుల్ ఉంటూ ఇద్దరం కలిసి పనిచేస్తామని తెలిపారు. రాహుల్ అందుబాటులో లేరన్న అభిప్రాయం వయనాడ్ ప్రజల్లో కలగకుండా చూస్తానని ప్రియాంక గాంధీ చెప్పారు. తొలిసారిగా పోటీ చేస్తున్న ప్రియాంక ప్రియాంకా గాంధీ 2019లో క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. అతిత్వరలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ లేదా ఆమేథీ లేదా వారణాసిలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, పోటీకి దూరంగానే ఉన్నారు. ప్రచారంలో పాల్గొన్నారు. రాయ్‌బరేలీ, ఆమేథీలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. రాహుల్ ఖాళీ చేస్తున్న వయ నాడ్ రాడ్ స్థానానికి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరుగనుంది. 52 ఏళ్ల ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా రాకపోయినప్పటికీ తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉండడంతో ఆయన్నే విజేతగా ప్రకటించారు. గత నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరగ్గా, , నల్లగొండలో ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మూడు రోజులపాటు నిరి్వరామంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. రెండోరోజు గురువారం రాత్రి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యతతో రాని మెజారిటీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,55,095 ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు పోల్ కాగా, అందులో 3,10,189 ఓట్లు చెల్లుబాటు అయినట్టు అధికారులు ప్రకటించారు. 25,824 ఓట్లు చెల్లలేదు. చెల్లుబాటు అయిన ఓట్లలో సగానికిపైగా అంటే 1,55,095 ఓట్లు గెలుపునకు టార్గెట్ కోటాగా నిర్ణయించారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు 29,697 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులందరికి కలిపి 10,118 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో అత్యధికంగా ఓట్లు వచ్చిన మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి కంటే 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయినా గెలుపు కోటా 1,55,095 ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను గురువారం సాయంత్రం నుంచి లెక్కించారు. రెండు ప్రాధాన్యతలోనూ దక్కని కోటా ఓట్లు రెండో ప్రాధాన్యత ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేసి వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థులకు (ఓటర్లు రెండో ప్రాధాన్యతను ఎవరికి ఇచ్చారో వారికి) కలుపుతూ లెక్కించారు. 48 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,24,899 ఓట్లు , రాకేష్‌రెడ్డికి 1,0,5,524 ఓట్లు , ప్రేమేందర్‌రెడ్డికి 43,096 ఓట్లకు చేరుకున్నారు. అయినా గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో నాలుగోస్థానంలో ఉన్న స్వతంత్ర పాలకూరి అశోక్‌ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారో లెక్కించారు.అప్పటికీ గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాలేదు. దీంతో మూడోస్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయన ఓట్లు లెక్కించారు. అయినా కూడా గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన 52 మంది అభ్యర్థుల్లో 50మందిని ఎలిమినేట్ చేశారు. అందులో ముందుగా నిర్ణయించిన గెలుపు టార్గెట్ ఓట్లు తీన్మార్ మల్లన్న, రాకేశ్‌రెడ్డి లకు రాలేదు. ఎన్నికల సంఘం వివరణకు లేఖ రాసిన ఆర్ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపునకు అవసరమైన టార్గెట్ కోటా ఓట్లు (1,55,095) ఎవరికీ రాకపోవడం, మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించాలా? లేదంటే సమీప ప్రత్యర్థి రాకేశ్‌రెడ్డికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత టార్గెట్ రీచ్ అయ్యే వరకు వేచి ఉండాలా అని, ఎన్నికల సంఘానికి రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ రాశారు. శుక్రవారం అర్థరాత్రి దాటాక ఈసీ నుంచి అత్యధిక ఓట్లు పొందిన అభ్యరి్థని విజేతగా ప్రకటించాలని సమాచారం అందింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటిస్తూ ఆర్ఓ హరిచందన ధ్రువీకరణపత్రం అందజేశారు. -
వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
-
ఎమ్మెల్సీ పోలింగ్ 72.37%.. ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్న ఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియాల్సి ఉన్నా ఓటర్లు బారులు తీరారు. ఆ సమయంలోగా పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన అందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగింది. మొత్తంగా 72..37 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల కౌంటింగ్ జూన్ 5న జరగనుంది. ఈ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉండటంతో బ్యాలెట్ పేపర్‌కూడా భారీగానే ఉంది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.గతంలో కంటే తగ్గిన పోలింగ్మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 కొత్త జిల్లాల్లో గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గిపోయింది. 2021 ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా అందులో 3,85,996 మంది (76.35 శాతం) ఓటువేశారు. ఈసారి 4,63,839 మంది మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు. ఈసారి పోలింగ్ 68.65 శాతం నమోదైంది. నల్లగొండ సమీపంలోని దుప్పపల్లి వేర్ హౌజింగ్ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులన్నింటినీ నల్లగొండకు తరలించే ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి తరువాత కూడా కొనసాగింది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.నార్కట్‌పల్లిలో స్వతంత్ర అభ్యర్థి ధర్నాపోలింగ్ సందర్భంగా నార్కట్‌పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేసుకున్నామని చెబుతున్న డోకూరి ఫంక్షన్ హాల్ వద్దకు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌గౌడ్ తన అనుచరులతో అక్కడికి వెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా అశోక్ అనుచరులు వీడియో తీస్తుండగా తోపులాట జరిగింది. దీంతో తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారని నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ ముందు« ధర్నాకు దిగారు. కాగా, నకిరేకల్‌లోని జడ్పీ హైస్కూల్లో పోలింగ్ కేంద్రంలో ఓ వికలాంగురాలు తనకు ఓటు వేసేందుకు వీల్ చైర్ అందుబాటులో పెట్టలేదని నిరసన తెలిపారు.ప్రశాంతంగా పోలింగ్ : రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారన్నారు. ప్రత్యేకించి మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54 శాతం, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. -
పట్టభద్రుల పట్టమెవరికి ?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో 52 మంది ఉన్నా, ప్రధానపోటీ మాత్రం ముగ్గురి మధ్యే నెలకొంది. ఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పారీ్టలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.సోమవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వారి తరఫున ఆయా పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించాయి. తమకు మద్దతు ఇవ్వాలని వాయిస్ కాల్స్ ద్వారా ఆయా పారీ్టల అధినేతలతోపాటు అభ్యర్థులు పట్టభద్రులను కోరారు. మిగతా గుర్తింపు పొందిన పారీ్టలతోపాటు స్వతంత్రులు పోటీలో ఉన్నా, ప్రధాన పారీ్టలకు పోటీగా ప్రచారం చేయలేకపోయారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచి్చనా, నియామకాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని, ఉద్యోగులది అదే పరిస్థితి అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేయడంతోపాటు ఎన్నికల తర్వాత పాలనలో పారదర్శకత, ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతోంది. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, తమ పార్టీ అభ్యరి్థని గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతూ ప్రజల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ మోసం చేసిందంటున్న బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులతోపాటు ఉద్యోగులను కూడా మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జాబ్ క్యాలెండర్ లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేయలేదని, తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలను తాము భర్తీ చేశామని కాంగ్రెస్ చెబుతూ మోసం చేస్తోందని ఆరోపిస్తోంది.ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందో ఎప్పుడు పరీక్షలు పెట్టిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఎన్నికలో పట్టుభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ అభ్యరి్థని గెలిపిస్తే పెద్దలసభలో ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాల కల్పనకు జాబ్‌క్యాలెండర్ ప్రకటించేలా ఒత్తిడి తెస్తామని, పోరాడే పారీ్టకి పట్టం కట్టాలంటూ పట్టభద్రులకు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తోంది.రెండూ మోసకారి పార్టీలే అంటున్న బీజేపీకాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసకారి పారీ్టలేనని, వాటి వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వాటిని విస్మరించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని, ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే అధికంగా అబద్ధాలు చెబుతూ మోసం చేస్తోందని బీజేపీ అంటోంది.నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల నియామకంలో బీఆర్ఎస్ విఫలం కాగా, కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇవ్వకుండా, పరీక్షలు నిర్వహించకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు మాటలతో ప్రజలు, పట్టభద్రులను మోసం చేస్తోందని ప్రచారంలో ఆరోపణలు గుప్పిచింది. ఇలాంటి పారీ్టలకు బుద్ధిచెప్పి బీజేపీకి మద్దతు ఇస్తే నిరుద్యోగుల తరఫున పోరాడుతామని పట్టభద్రులకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. మొత్తానికి త్రిముఖ పోటీలో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’పట్టభద్రుల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్లలో పట్టు సాధించేందుకు విస్తృతంగా ప్రచారం సాగిస్తోంది. ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక వ్యూహాన్ని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు.అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇప్పటికే పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉన్న జిల్లాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ప్రచారం చేసిన కేటీఆర్ బుధవారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.ఎన్నికల ప్రచారం ఈ నెల 25న ముగియనుండటంతో సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనే ఆయన ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇక నాగర్‌కర్నూలు నుంచి బీఆర్ఎస్ తరపున లోక్‌సభ అభ్యరి్థగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటరునూ కలిసి.. శాసన మండలి ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ స్థానం నుంచి బీఆర్ఎస్ వరుసగా నాలుగు పర్యాయాలు గెలవడంతో ప్రస్తుత ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచార గడువు, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయానికి బీఆర్ఎస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది.మండలాల వారీగా పట్టభద్రులు నియోజకవర్గం ఓటరు జాబితాను సమన్వయకర్తలకు అందజేసి, క్షేత్ర స్థాయిలో ప్రతీ ఓటరును పార్టీ కేడర్ కలిసేవిధంగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ వైఫల్యాలు, ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల జారీలో వైఫల్యం, పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి విద్యార్హతలు, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి తదితరాలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతీ ఓటును ఒడిసి పట్టేందుకు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటరును ప్రత్యక్షంగా కలవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అసంతృప్త నేతలకు బుజ్జగింపు ఏనుగుల రాకేశ్‌రెడ్డి అభ్యరి్థత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలతో కేటీఆర్ స్వయంగా మాట్లాడి బుజ్జగిస్తున్నారు. ఈ ఉప ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో విభేదాలు వీడి కలిసి పనిచేయాలని కోరుతున్నారు. త్వరలో ఏర్పాటయ్యే పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో ప్రాధాన్యతను ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యరి్థత్వం ఆశించిన వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మంగళవారం కేటీఆర్‌ను కలిశారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. కేటీఆర్, హరీశ్ ప్రచార షెడ్యూలు ఇదే కేటీఆర్ ఈ నెల 22న ములుగు, నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశి్చమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. హరీశ్‌రావు ఈ నెల 23న భూపాలపల్లి, వర్దన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, 24న సత్తుపల్లి, వైరా, మధుర, పాలేరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. -
‘గ్రాడ్యుయేట్స్’పై బీజేపీ గురి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ దృష్టి సారించింది. ఈ నెల 27న జరగనున్న నల్లగొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొంది సత్తా చాటాలనే సంకల్పంతో రాష్ట్ర నాయకత్వం ముందుకు సాగుతోంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఇప్పటికే మూడుజిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ 3,4 రోజు లుగా మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. జహీరా బాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ త్వరలోనే ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించను న్నట్టు సమాచారం. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలుపొందిన అనుభవంతో పాటు విస్తృత పరిచ యాలు, ఎమ్మెల్సీ క్యాంపెయిన్‌కు సంబంధించి అవగాహన ఉన్న ఎన్.రామచందర్‌రావు ఈ ఎన్ని కకు పార్టీ తరఫున ఇన్చార్జ్గా వ్యవహరిస్తు న్నారు. ప్రచారం ముమ్మరం చేశామని, ఈసారి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని ‘సాక్షి’కి ఆయన వెల్ల డించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్ని కల్లో పార్టీ పట్ల ఉన్న సానుకూలత తప్పకుండా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఉపయోగపడుతుందన్నారు. మంచి ఫలితం వస్తుంది: గుజ్జులరాష్ట్రపార్టీ నాయకత్వం, ముఖ్యనేతలు, వేలాది మంది కార్యకర్తల తోడ్పాటుతో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ›ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్ వారీగా మూడు, 4 బృందాలను ఏర్పాటు చేసి పార్టీనాయకులు, కార్య కర్తలు ఇంటింటికి వెళ్లి పట్టభద్ర ఓటర్లను కలుస్తు న్నారన్నారు. కోర్టులు, వాకర్స్‌ను కలుసుకో వడం, చిన్న చిన్నసమావేశాల నిర్వహణ ద్వారా ఓటర్స్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. క్షేత్రస్థాయిలో ‘మోదీవేవ్’ స్పష్టంగా కనిపిస్తోందని, ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందుతాననే నమ్మకం తనకు ఏర్పడిందని ధీమా వ్యక్తం చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు రెండో ప్రాధాన్యత ఓటుపైనా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. -
ఇక ‘పట్టభద్రుల’ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఈ నెల 27న జరిగే శాసనమండలి పట్టభద్రుల కోటా ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానం అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి కైవసం చేసుకోవడాన్ని బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ పోలింగ్ ముగిసిన వెంటనే రంగంలోకి దిగింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం కీలక భేటీ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశంఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2027 ఏప్రిల్ వరకు అవకాశం ఉన్నా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 27న ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్‌కు కేవలం 12 రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ముమ్మర ప్రచారం నిర్వహించేలా కేటీఆర్ బుధవారం జరిగే భేటీలో దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచార, సమన్వయ బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ప్రచారాన్ని సమన్వయం చేస్తారు. మూడు జిల్లాల్లో సుమారు 4.61 లక్షల మంది పట్టభద్రులైన ఓటర్లు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, మహిళలు కీలకం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలను లక్ష్యంగా చేసుకుని సాగించాల్సిన ప్రచారంపై బీఆర్ఎస్ వ్యూహాన్ని ఖరారు చేస్తోంది. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు గ్రామాలు, మండలాల వారీగా ఓటర్ల జాబితాను అందజేసి వారితో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది.లోక్‌సభ పోలింగ్ సరళిపై సమీక్షరెండురోజుల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం కూడా సమీక్షించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ను పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు పార్టీ నేతలు కలిశారు. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా పోలింగ్ సరళిపై ఈ సందర్భంగా ఆయన ఆరా తీశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపారనే కోణంలో చర్చ జరిగింది. కాగా మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమా కేసీఆర్ వ్యక్తం చేసినట్లు నేతలు వెల్లడించారు. -
ఆ రెండూ ప్రతిష్టాత్మకమే
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉపఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికలతోపాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆ తర్వాత ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండూ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కావడంతో వాటిని తిరిగి గెలుచుకోవడంపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక రాగా, ఈ నెల 13న జరిగే లోక్‌సభ పోలింగ్తోపాటు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా పోలింగ్ జరగనుంది. మరోవైపు ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పల్లా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా పల్లా పదవీకాలం 2027 ఏప్రిల్‌లో ముగియనుంది. తాజాగా ఎన్నికల కమిషన్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9 వరకు నామినేషన్ల స్వీకరణ, ఈ నెల 27న పోలింగ్ జరుగుతుంది.లాస్య నందిత సోదరి కోసం.. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్లో తమ అభ్యర్థి నివేదిత గెలుపు కోసం బీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి ప్రచార సమన్వయ బాధ్యతలు అప్పగించగా, పార్టీ నేత రావుల శ్రీధర్‌రెడ్డి నియోజకవర్గ ప్రచార ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు మల్కాజిగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డులు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక డివిజన్ వారీగా ప్రచార బాధ్యతలు పంచుకొని పనిచేస్తున్నారు.అయితే ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ ఆశించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర ఆశావహులు గజ్జెల నాగేశ్ కేసీఆర్ బస్సు యాత్రలో ఉండగా, ఎర్రోâ¶ ్ల శ్రీనివాస్ సంగారెడ్డి ప్రచార సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. నివేదిత తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రచారంపై ఆ ప్రభావం పడకుండా చూడాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు ఇప్పటికే నియోజకవర్గంలో రోడ్‌షోల్లో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు.నేడు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్శాసనమండలి ఆరంభం నుంచి బీ ఆర్ఎస్ అభ్యర్థులే ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఈ నేప థ్యంలో ప్రస్తుతం ఈ స్థానానికి జరుగు తున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరును అధినేత కేసీఆర్ రెండు రోజుల క్రితం ఖరారు చేశారు. రాకేశ్ రెడ్డి మంగళ వారం నల్ల గొండ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. బీఆర్ ఎస్ టికెట్ పార్టీ నేతలు ఓ.నర్సింహారెడ్డి, డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సుందర్ రాజు తదితరులు ఆశించారు. అయినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ రెడ్డికి టికెట్ దక్కింది. ఇక్కడ గెలుపును బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమ న్వయంతో పనిచేయడం ద్వారా ప్రచారంలో పైచేయి సాధించాలని భావి స్తోంది. దీంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న పార్టీ అధి నేత కేసీఆర్ ఈ నెల 12న లేదా 14న మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్యనేతలతో తెలంగాణభవన్‌లో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
కంటోన్మెంట్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ టికెట్ మళ్లీ ఆ ఫ్యామిలీకే ?
సాక్షి,హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆదివారం(ఏప్రిల్ 7) ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ సమావేశమై కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేత హరీశ్‌రావు, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే బీఆర్ఎస్ టికెట్ మళ్లీ దక్కడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల సాయన్న కూతురు సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం మృతి చెందడంతో ఈ సీటు ఖాళీ అయి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరపున లాస్యనందిత సోదరి నివేదితను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే అభ్యర్థిని అధికారికంగా మంగళవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ ఆశించిన బీఆర్ఎస్ నేతలు పలువురు ఈ ఉప ఎన్నికలోనూ టికెట్ కోసం పార్టీని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. వీరందరి అభ్యర్థిత్వంపై చర్చించిన తర్వాత టికెట్ సాయన్న కుటుంబానికే ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన గణేష్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా పార్టీ ఆయనను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు మరో షాక్ -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన పక్షంలో దీని ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై చూపే అవకాశం ఉండటంతో కౌంటింగ్ చేపట్టొద్దని ఎన్నికల కమి షన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ రెండో తేదీన ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఐదో తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల రెండో తేదీన అంటే మంగళవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ చేప ట్టాల్సి ఉంది. జిల్లాకేంద్రంలోని బాలుర జూని య ర్ కళా శాలలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందుగా ఉప ఎన్నిక రావడం.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ వ్యూహాలతో క్యాంప్ రాజకీ యాలకు తెరలేపడం.. సీఎం రేవంత్ సొంత ఇలా కాలో జరుగుతున్న పోరు కావటంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఉమ్మడి మహబూనగర్ జిల్లాపైనే పడింది. ఫలితాల కోసం పార్టీలు ఆతృతగా ఎదురు చూస్తున్న క్రమంలో కౌంటింగ్ వాయిదా పడడంతో నాయకుల్లో నిరుత్సాహం అలుముకుంది. -
జీవితాంతం కొడంగల్‌కు రుణపడి ఉంటా
కోస్గి/కొడంగల్: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. తాను ఏ స్థాయిలో ఉన్నా ఈ ప్రాంతం బిడ్డనేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తన ప్రతి కష్టంలోనూ కొడంగల్ ప్రజలు అండగా నిలిచారని.. వారు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని పేర్కొన్నారు. కొడంగల్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంతో చెప్పారు. తన కోసం ఎంతో చేసిన ఈ ప్రాంతాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. రేవంత్‌రెడ్డి గురువారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేయడానికి కొడంగల్‌కు వచ్చారు. ఎక్స్ అఫీషియో హోదాలో కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన ఓటు వేశారు. అనంతరం లాహోటీ కాలనీలోని తన నివాసంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లా డుతూ... త్వరలో కొడంగల్‌కు సిమెంట్ పరిశ్రమలు రానున్నాయన్నారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపురాయి గనులు ఉన్నాయని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తే భూముల విలువ పెరుగుతుందని చెప్పారు. ‘కొడంగల్‌కు ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమలు ఏర్పాటు చేయడం సులభతరం అవుతుంది. భూములు కోల్పోతున్న వారికి న్యాయమైన ధరను ప్రభుత్వం చెల్లిస్తుంది. పట్టా భూములకు ఇచ్చే ధరను అసైన్మెంట్ భూములకూ ఇస్తాం’ అని రేవంత్ పేర్కొన్నారు. ఏప్రిల్ 8న కొడంగల్‌కు మళ్లీ వస్తానన్నారు. కోస్గిలో పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కొడంగల్ మండలం అప్పాయిపల్లికి ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాల, పారామెడికల్ కళాశాలను మంజూరు చేసినట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో 50 వేలకు పైగా మెజారిటీ రావాలన్నారు. బూత్, మండలాలు, నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో సమర శంఖారావం సభకు నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వంశీచంద్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నువ్వా.. నేనా..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగియగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య నువ్వా, నేనా అన్నట్లు ఎన్నికల యుద్ధం నడిచించి. అయితే లెక్క ప్రకారం వెయ్యి మందికి పైగా ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కు ఉండగా.. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు పోలింగ్ సరళిని బట్టి రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, కర్ణాటక, గోవా, కొడైకెనాల్, ఊటీలోని క్యాంపుల నుంచి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిల ర్లు ప్రత్యేక వాహనాల్లో వచ్చి ఆయా కేంద్రాల్లో ఓటు వేశారు. వీరితోపాటు ఎక్స్అఫీషియో హోదా లో ఉమ్మడి పాలమూరులోని 14 మంది ఎమ్మెల్యే లు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఓటు వేశారు. ఏప్రిల్ 2న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. 99.86 శాతం పోలింగ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచారు. వీరితోపాటు స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ పోటీ చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 99.86 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా.. 1,437 మంది ఓటు హక్కు వినియోగించుకు న్నారు. కాగా, గద్వాలలో పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, సీఐ భీం కుమార్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఏఎస్పీ గుణశేఖర్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా.. లోక్‌సభ ఎన్నికలకు ముందుగా జరుగుతున్న ఉపఎన్నిక కావడంతో ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. క్యాంపుల్లో భాగంగా ఆయా పార్టీలు పోటాపోటీగా ప్రజాప్రతినిధులకు భారీ ఎత్తున తాయిలాలు ముట్టజెప్పినట్లు సమాచారం. మరోవైపు ఉమ్మడి జిల్లాలో బీజేపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వంద వరకు ఉన్నారు. వీరు కాంగ్రెస్ అభ్యర్థి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. మొత్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించనుండడంతో ఆయా పార్టీ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. క్రాస్‌ఓటింగ్ తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలను బరిలోకి దింపిన బీజేపీ
ఢిల్లీ:లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఐదు జాబితాను విడుదల బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. తాజాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎంపీ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ముగ్గురు కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. అనంతరం హిమాచల్ కాంగ్రెస్ అనర్హత ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు. తాజాగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో వారు చోటు సంపాధించుకున్నారు. సుధీర్‌శర్మ- ధర్మశాల, రవి ఠాకుర్- లాహౌల్ అండ్ స్పితి, రాజిందర్ రానా- సుజన్పూర్, ఇందర్ దత్ లకాన్ పాల్- బర్సార్, చైతన్య శర్మ- గాగ్రేట్, దేవిందర్ కుమార్ భుట్టో- కుట్లేహర్ స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. ఈ ఆరు స్థానాలకు ఏడు విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. అదే రోజు హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాకుల కూడా పోలింగ్ జరగనుంది. అదే విధంగా గుజరాత్లో ఐదు స్థానాలు, కర్ణాటకలో ఒక స్థానం, పశ్చిమ బెంగాల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ప్రకటించింది. BJP releases a list of candidates for upcoming by-elections in Gujarat, Himachal Pradesh, Karnataka and West Bengal pic.twitter.com/xiZsleW91d — ANI (@ANI) March 26, 2024 -
Hyd: కంటోన్మెంట్ ఉప ఎన్నికలో పోటీ చేస్తా.. లాస్య నందిత సోదరి నివేదిత
సాక్షి,హైదరాబాద్: కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత తెలిపారు. శనివారం కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. క్యార్యకర్తలు, కంటోన్మెంట్ ప్రజల కోరిన తర్వాతే పోటీ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. నాన్న సాయన్నను, చెల్లి లాస్యనందితను ఆదరించినట్లుగానే కంటోన్మెంట్ ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానన్నారు. త్వరలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. కాగా, ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లోని అవుటర్ రింగు రోడ్డు(ఓఆర్ఆర్) పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి లోక్‌సభ ఎన్నికలతో పాటే ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్వహించనుంది. ఉప ఎన్నికలో పోటీకి లాస్య నందిత సోదరి ముందుకు రావడంతో బీఆర్ఎస్ కూడా ఆమెకే టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నేను ఉంటా - దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత pic.twitter.com/M8Fm7gMlRK — Telugu Scribe (@TeluguScribe) March 16, 2024 -
పాలమూరు ‘లోకల్’ పోరుకు నేడు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలోని ఓ ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆదివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. 2022 జనవరిలో ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరేళ్ల పదవీ కాలం 2028 జనవరిలో ముగియాల్సి ఉంది. అయితే గత ఏడాది చివర్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కసిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సుమారు నాలుగేళ్ల కాలానికి ఉప ఎన్నిక జరగనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఉండగా, మరో స్థానానికి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్దే ఆధిపత్యం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జిల్లా, మండల పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలో ఓటర్లుగా పరిగణించబడతారు. జిల్లాలో మొత్తం 1,450 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఉండగా, వీరిలో మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. దీంతో తమకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు కొత్త ఆశావహులతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో జరుగుతున్న ఎన్నికను అధికార కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది. -
గ్యాస్ సిలిండర్ ధర రూ.3000 అవుతుంది..!
కోల్‌కతా: జల్పైగురి జిల్లాలోని ధుప్గురి ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి గ్యాస్ ధర రూ.3000 అవుతుందని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించడంపై స్పందిస్తూ డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీ పార్టీపైనా ప్రధాని నరేంద్ర మోదీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ ఇది రక్షాబంధన్ కానుక అంటారు.. ఏ.. రక్షాబంధన్ ఐదేళ్లకు ఒక్కసారే వచ్చిందా ఏంటి? ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రధాని కొత్త డ్రామాకు తెర తీశారన్నారు. 2024 ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం గ్యాస్ ధర రూ.3000కు చేరుతుందని అన్నారు. అదే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మాత్రం ఒక సిలిండర్ ధర కేవలం రూ.500కే అందిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అన్నారు.. మీకెవరికైనా ఆ డబ్బులు వచ్చాయా అని ప్రశ్నించారు. కేంద్రం ఆ డబ్బులు ఇవ్వకపోగా ఉపాధి హామీ నిధులను నిలిపివేసిందని అన్నారు. వందరోజుల పని దినాలు పథకం కింద పని చేసిన వారికి కూడా డబ్బులు ఎగ్గొట్టారని ఆరోపణలు చేశారు. పైగా వారంతా ఇక్కడికొచ్చి బాంగ్లాదేశ్ నినాదమైన 'జోయ్ బెంగాల్' ని ఇక్కడ బెంగాల్లో నినదించి ఈ ప్రాంతాన్ని అవమానిస్తారు. సెప్టెంబర్ 5న జరగబోయే ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఘోరంగా ఓడించాలని ఈ ఓటమికి ఆ అభ్యర్థి ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా సిగ్గుపడాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ దెబ్బతో బీజేపీ పార్టీకి ప్రజల బలం ఏమిటో తెలిసి రావాలని అన్నారు. ఈ సందర్బంగా అభిషేక్ ఈ ఉపఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సీఎంతో మాట్లాడి ధుప్గురికి మూడు నెలలో సబ్ డివిజన్ హోదా కల్పిస్తామని అన్నారు. అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష నేత సువెందు అధికారి.. ముందు ఆశా వర్కర్ల జీతాలు, గ్రూపు-డి ఉద్యోగుల జీతాలు ఎందుకంత తక్కువగా ఉన్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంతో సమానంగా డీఏ చెల్లించే విషయమై ఎంతకాలం ఎదురుచూడాలని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. అభిషేక్ బెనర్జీకి రాజ్యాంగం పట్ల కొంచెం కూడా గౌరవం లేదని ఉంటే ఎన్నికల సమయంలో ఆచరణసాధ్యం కానీ హామీలు ఇచ్చేవారు కాదని విమర్శించారు. ভোট মরশুমে মানুষের মন জয় করতেই রান্নার গ্যাসের দাম ২০০ টাকা কমিয়েছে কেন্দ্রের জনবিরোধী বিজেপি সরকার। আগামী দিনে কেন্দ্রের সরকার বদলে গেলে গ্যাসের দাম কমে ৫০০ টাকা হয়ে যাবে।#TrinamooleNaboJowar #WestBengal #Jalpaiguri pic.twitter.com/eATYbLdtv8 — Trinamoole Nabo Jowar (@TMCNaboJowar) September 2, 2023 ఇది కూడా చదవండి: ఇకపై బహుభార్యత్వం నిషేధం.. డిసెంబర్లో బిల్లు -
ఏపీలో నేడు స్థానిక ఉపఎన్నికలు
-
ఆ నిబంధన వర్తించదు.. కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: సాయన్న మరణంతో ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరిగే అవకాశాలు లేవు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేకపోవడమే దీనికి కారణం. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151ఏ నిబంధన ప్రకారం.. ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, చనిపోయిన/రాజీనామా చేసిన/అనర్హత వేటు పడిన సభ్యుడి పదవీ కాలం ఏడాదిలోపే ఉంటే ఈ నిబంధన వర్తించదు. శాసనసభ గడువు వచ్చే డిసెంబర్ 11తో ముగియనుంది. అంటే మరో 10 నెలలే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాలు తెలిపాయి. చదవండి: హైదరాబాద్‌లో ఈస్ట్‌జోన్‌వైపే మధ్యతరగతి ప్రజల ఆసక్తి -
ఉప ఎన్నికల వేళ తమిళనాడులో ట్విస్ట్.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం!
ఎడతెగని వ్యూహాలు.. ఎత్తులకు పైఎత్తులతో ప్రధాన పార్టీలన్నీ ఈరోడ్ ఉప సమరానికి సిద్ధమయ్యాయి. బుధవారం నామినేషన్లను ఎన్నికల అధికారి ఆమోదించడంతో ప్రచార పర్వానికి తెరలేపాయి. ముఖ్యంగా నాలుగు ప్రధాన పారీ్టలకు చెందిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రజా క్షేత్రంలో నువ్వా..నేనా అన్నట్లు ముందుకు సాగుతున్నాయి. సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కీలక దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చిల అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారి శివకుమార్ బుధవారం ఆమోదించారు. పరిశీలనలో మరో 76 నామినేషన్లు కూడా ఓకే అయ్యాయి. ఈ ఎన్నికల రేసుల నుంచి తాము తప్పుకుంటున్నట్లు అన్నాడీఎంకేలో చీలిక కారణంగా ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రకటించడం చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సీఎం ఎంకే స్టాలిన్ నియోజకవర్గంలో ఓట్ల వేటకు సిద్ధమయ్యారు. రసవత్తరంగా.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నిక అన్నాడీఎంకే రాజకీయాలను రసవత్తరంగా మార్చింది. ఆ పార్టీ శిబిరాల అభ్యర్థులుగా తెన్నరసు, సెంథిల్ మురుగన్, ఆ పార్టీలో చీలికతో ఆవిర్భవించిన అమ్మమక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా శివ ప్రశాంత్ నామినేషన్లు వేశారు. చివరకు సర్వసభ్య సభ్యుల మెజారిటీ మద్దతుతో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తన అభ్యర్థి సెంథిల్ మురుగన్‌ను పోటీ నుంచి తప్పించారు. అదే సమయంలో తాజాగా తమకు కుక్కర్ గుర్తు కేటాయించబోమని ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడాన్ని నిరసిస్తూ అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం కూడా ఎన్నికల నుంచి తప్పుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఏ విధంగా పన్నీరు సెల్వం తలొగ్గారో, అదే తరహాలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ కూడా వెనక్కి తగ్గినట్టు చర్చ సాగుతోంది. క్షణంలో ఎన్నికల రేసులో నుంచి తప్పుకున్నా, తాము ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గేది లేదని, తమకు అనుకూలమైన గుర్తు కేటాయించక పోవడం వల్లే బరిలో నుంచి తప్పుకున్నట్లు టీటీవీ స్పష్టం చేశారు. దుష్ట శక్తి డీఎంకే, ద్రోహ శక్తి అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి శిబిరం అభ్యర్థి తెన్నరసు మాత్రమే అధికారికంగా ఆ పార్టీ తరపున పోటీలో మిగిలారు. 121లో 80 నామినేషన్లకు ఆమోదం ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వద్ద గత నెల 31 నుంచి ఈనెల 7వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించారు. మొత్తంగా 121 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆరుగురు ఉన్నారు. ఇందులో ఇద్దరు వెనక్కి తగ్గారు. బుధవారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఎన్నికల పర్యవేక్షకుడు రాజ్ మోహన్ యాదవ్, ఎన్నికల అధికారి శివకుమార్ అన్ని నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 121 నామినేషన్లు దాఖలు కాగా, 80 ఆమోదం పొందాయి. ఇందులో తొలి ఆమోదం ఎన్నికల వీరుడు, స్వతంత్ర అభ్యర్థి పద్మరాజన్ది కావడం విశేషం. ఆ తర్వాత కోవైకు చెందిన స్వతంత్ర అభ్యర్థి నూర్ మహ్మద్ నామినేషన్‌ను ఆమోదించారు. మూడో నామినేషన్ కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్. అలాగే అన్నాడీఎంకే డీఎంకే అధికారిక అభ్యర్థి తెన్నరసు, డీఎండీకే అభ్యర్థి ఆనంద్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి మేనక నామినేషన్లకు కూడా ఆమోదం లభించింది. ఇక ఎన్నికల నుంచి తప్పుకున్న పన్నీరు సెల్వం వర్గం అభ్యర్థి సెంథిల్ మురుగన్, టీటీవీ అభ్యర్థి శివ ప్రశాంత్ నామినేషన్లు ఆమోదం పొందినా, వారు గురువారం ఉప సంహరించాలని నిర్ణయించారు. కాంగ్రెస్సా.. డీఎంకేనా..? ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే సమరం కాంగ్రెస్, అన్నాడీఎంకే అభ్యర్థులు ఈవీకేఎస్, తెన్నరసు మధ్య ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎండీకే, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు చీల్చే ఓట్లే కాంగ్రెస్, అన్నాడీఎంకే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతుగా ఆయా కూటమి పక్షాలైన బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్ తదితర పారీ్టలు ప్రచారానికి సిద్ధమయ్యాయి. బుధవారం పళని స్వామి నేతృత్వంలో మిత్ర పక్షాల నాయకులు సమావేశమయ్యారు. ఈనెల 12వతేదీ నుంచి నియోజకవర్గంలో పళని స్వామి ఇంటింటా సుడిగాలి ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు. కాగా అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపు కోసం తమ శిబిరం తరపున కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను పన్నీరు సెల్వం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇప్పటికే డీఎంకే మంత్రులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ కూడా ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈనెల 24, 25 తేదీల్లో ఈరోడ్‌లో 10 చోట్ల సీఎం ప్రసంగించనున్నారు. అలాగే సీఎం తనయుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ కూడా ఈనెల 19, 20 తేదీల్లో ఇలంగోవన్ కోసం ప్రచారం చేయనున్నారు. -
ఐదు రాష్ట్రాల ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల ...
-
పొలిమేర నుంచే ప్రణాళిక! సరిహద్దుల నుంచి కీలక నేతల పర్యవేక్షణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. హోరాహోరీగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈలోగానే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పలివెల వంటి ప్రాంతాల్లో ఒక పార్టీ వారు మరో పార్టీ వారిపై దాడులకు దిగారు. ప్రచారం ముగియడంతో ముఖ్య నేతలంతా నియోజకవర్గాన్ని వదిలివెళ్లారు. కానీ వ్యూహ, ప్రతి వ్యూహాల్లో దిట్టలైన కొందరు నేతలు మాత్రం మునుగోడు నియోజకవర్గం పక్కనే పొలిమేర గ్రామాల్లో తిష్టవేశారు. అక్కడి నుంచే వ్యూహాలను అమలు చేస్తున్నారని.. ఎప్పటికప్పుడు స్థానిక నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిసింది. ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఓట్లు వేయించేలా సూచనలు చేస్తున్నారని.. ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ వంటివన్నీ పర్యవేక్షిస్తున్నారని.. స్థానిక నాయకులను పిలిపించుకుని సూచనలు చేస్తున్నారని సమాచారం. సరిహద్దుల నుంచే సలహాలు.. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో బుధవారం ఓ టీఆర్ఎస్ నేతకు చెందిన కారు కనిపించిందని.. ఆయన నియోజకవర్గానికి అవతల ఓ గ్రామంలో మకాం వేశారని స్థానిక నేతలు చెప్తున్నారు. ఓ పార్టీ సీనియర్ నేత నల్లగొండ నియోజకవర్గం కనగల్ మండలంలో ఉండి పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. ఇక మర్రిగూడ మండలం శివారు దాటాక రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని ఒక స్థానిక నాయకుడి ఇంట్లో ఓ సీనియర్ నేత మకాం వేసి పర్యవేక్షిస్తున్నారని.. పోల్ మేనేజ్మెంట్పై అక్కడి నుంచే సూచనలు చేస్తున్నారని తెలిసింది. వనస్థలిపురం సంపూర్ణ థియేటర్ పరిసరాల్లోని ఒక హోటల్లో మరో సీనియర్ లీడర్ ఉండి పరిశీలన జరుపుతున్నారని.. మరో ఎమ్మెల్యే వాహనం సంస్థాన్ నారాయణపూర్ మండలంలో కనిపించిందని స్థానిక నేతలు చెప్తున్నారు. నార్కట్‌పల్లి వివేరా హోటల్లో అడ్డా వేసిన ఓ నేత మునుగోడులోని పరిసర మండలాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. మరోవైపు చౌటుప్పల్ మున్సిపాలిటీలో బుధవారం అధికార పార్టీ నేత వాహనం కనిపించింది. దీంతో ఆ కారులో డబ్బుల సంచులు ఉన్నాయని, కారును తనిఖీ చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆరోపించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగారెడ్డిగూడెంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ మకాం వేసినట్టు తెలిసింది. తక్కువగా ఇచ్చారంటూ ఓటర్ల ఆందోళన.. ప్రచారం సందర్భంగా ఓటర్లు ఏది అడిగితే అది ఇస్తామన్న నేతలు మంగళవారం సాయంత్రం నుంచే పంపిణీ మొదలు పెట్టగా.. ఈ ‘పని’లో ఏ ఇబ్బందీ రాకుండా ముఖ్యనేతలంతా చూసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల ప్రచార సమయంలో ఓటుకు రూ.20 వేలు.. రూ. 30 వేలు ఇస్తామని ఒక పార్టీ, తులం బంగారం ఇస్తామని మరో పార్టీ వారు చెప్పారని.. తీరా ఇప్పుడు రూ.3 వేలు, రూ.4వేలు ఇస్తున్నారని కొందరు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం కనిపించింది. మునుగోడు మండలం కొరటికల్తోపాటు ఇతర మండలాల్లోని పలు గ్రామాల్లో ఓటర్లు తమకు తక్కువ మొత్తం ఇచ్చారంటూ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మునుగోడు ఉప ఎన్నిక సర్వేలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఓ సర్వే ఒక పార్టీకి అనుకులంగా.. మరో సర్వే ఇంకో పార్టీకి అనుకూలంగా ఉందని ప్రచారం సాగిస్తున్నాయి. సొంత పార్టీ చేసుకున్న సర్వేలోనే వారు ఓడిపోతారని తేలిందంటూ మరికొందరు సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. చదవండి: ఓటమి భయంతోనే దాడులు.. ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ -
షిండే వర్గానికి ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ
ముంబై: అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు శివసేన ఏకానాథ్ షిండే వర్గానికి 'రెండు కత్తులు-డాలు' గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించించి. షిండే వర్గం పార్టీ పేరును 'బాలాసాబెబ్‌చీ శివసేన'గా ఈసీ సోమవారం ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. అసలైన శివసేన తమదంటే తమదే అని ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని ఈసీ తాత్కాలికంగా సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నికల కోసం కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి షిండే, థాక్రే వర్గాలు ఈసీకి కొన్ని ప్రతిపాదలను పంపాయి. వీటిని పరిశీలించిన అధికారులు థాక్రే వర్గానికి 'శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)' పేరు, కాగడా గుర్తును సోమవారం ఖరారు చేసింది. అలాగే షిండే వర్గానికి 'బాలాసాహెబ్ శివసేన' పేరును ఫైనల్ చేసింది. కానీ షిండే అడిగిన ఎన్నికల గుర్తులు కొన్ని ఇప్పటికే రిజిస్టర్ అయినందున ఎలాంటి గుర్తును కేటాయించలేదు. మళ్లీ కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే షిండే వర్గం మంగళవారం సూర్యుడు, కత్తి-డాలు, రావిచెట్టు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఈసీని మళ్లీ కోరింది. వీటిని పరిశీలించిన ఈసీ రెండు కత్తులు-డాలు గుర్తును ఫైనల్ చేసింది. శివసేన ఎవరిదో తేలేవరకు షిండే, థాక్రే వర్గాలకు ఈ పార్టీ పేర్లు, గుర్తులే ఉండనున్నాయి. చదవండి: ఇదేనా మీకు నేర్పింది? రిక్షా బోల్తాపడినా ఆగని కలెక్టర్ కాన్వాయ్ -
థాక్రే వర్గానికి పార్టీ పేరు గుర్తు ఖరారు చేసిన ఈసీ.. షిండేకు షాక్!
సాక్షి,న్యుఢిల్లీ: అంధేరీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) పేరు, కాగడా(ఫ్లేమింగ్ టార్చ్) గుర్తును ఖరారు చేసింది. మరోవైపు ఏక్నాథ్ షిండే వర్గానికి 'బాలసాహెబ్చీ శివసేన' పేరును ఫైనల్ చేసింది ఈసీ. అయితే ఎన్నికల గుర్తు మాత్రం ఖరారు చేయలేదు. షిండే వర్గం అడిగిన గుర్తులు ఇప్పటికే రిజిస్టర్ అయ్యాయని, కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. అయితే థాక్రే, షిండే అడిగిన త్రిశూలం, గధ, ఉదయించే సూర్యుడి గుర్తులను కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. కొన్ని గుర్తులు మతపరంగా ఉన్నాయని, ఉదయించే సుర్యూడి గుర్తు డీఎంకే రిజిస్టర్ చేసుకుందని పేర్కొంది. అసలైన శివసేన తమదంటే తమదే అని థాక్రే, షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నిక కోసం పార్టీ పేరు, గుర్తు కోసం రెండు వార్గాలు కొన్ని ప్రతిపాదనలను ఈసీకి పంపాయి. చదవండి: నన్ను గెలిపిస్తే రూ.20కే పెట్రోల్, ఇంటికో బైక్.. -
మునుగోడు బైపోల్ సమయంలో తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజానీకాన్ని విశేషంగా ఆకర్షిస్తున్నది. అయితే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం తీవ్ర ప్రభావితం చేస్తున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా ఉన్న సమయంలో రాహుల్ గాంధీ ఇక్కడే యాత్ర చేస్తూ ఉండటం కాంగ్రెస్‌కు కలసి వచ్చే అవకాశంగా కనిపిస్తోంది. ఇదే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంచనాలు పెంచుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక జరిగే నవంబర్ 3వ తేదీన రాహుల్ గాంధీ హైదరాబాద్ సరిహద్దులోని ముంతంగి నుంచి సంగారెడ్డి మధ్య ఉంటారని భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేసిన నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడుపై రాహుల్ గాంధీతో ఏదైనా ప్రకటన చేయిస్తారని పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ అంశంపై తమ రాజకీయ లబ్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
నవంబర్ 3న మునుగోడు దంగల్: ఆ మూడు పార్టీల గేమ్ ప్లాన్ ఇదే
సాక్షి, నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు నెల రోజులు మాత్రమే ఉంది. నవంబర్ 3 పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో మూడు ప్రధాన పార్టీలు తల మునకలయ్యాయి. మునుగోడు ముఖచిత్రాన్ని పరిశీలిస్తే మునుగోడులో మొత్తం ఓటర్లు 2 లక్షల 27 వేల 101. సామాజిక వర్గాల వారీగా అధికంగా ఉన్న ఓటర్లు గౌడ, ముదిరాజ్, యాదవ, పద్మ శాలి, ఎస్సీలు, రెడ్డి. మొత్తం మండలాలు ఏడు. మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల. నియోజకవర్గంలో మొత్తం రెండు మున్సిపాలిటీలు. చండూరు, చౌటుప్పల్. చదవండి: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాల్వాయి స్రవంతిలను ఆ పార్టీలు ప్రకటించాయి. టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లపై 22552 మెజారిటీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డికి వచ్చిన ఓట్లు 97239, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి వచ్చిన ఓట్లు 74687. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డికి వచ్చిన ఓట్లు 12725 ఓట్లు. మొత్తం మునుగోడులో ఉన్న గ్రామాల సంఖ్య 159. మునుగోడు లో ఉన్న బూతుల సంఖ్య 294. రెండు గ్రామాలకు ఒక ఇంఛార్జ్‌గా ఎమ్మెల్యేను నియమించే వ్యూహంలో టీఆర్ఎస్ ఉంది. ప్రతీ వంద మంది ఓటర్లకు ఒక ఇంచార్జ్‌ని నియమించేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. లక్ష ఓట్లు కొల్లగొట్టేవిధంగా బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. రెండు బూత్లకి ఒకరి చొప్పున 150 మంది ఇంచార్జులను కాంగ్రెస్ నియమించింది. 76 వేల ఓట్లను టార్గెట్‌గా కాంగ్రెస్ పెట్టుకుంది. -
Munugode By Polls: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 6న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. ♦ఈ నెల 14 వరకు నామినేషన్ల స్వీకరణ ♦నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 17 ♦15 న నామినేషన్ల పరిశీలన మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను ఆ పార్టీలు ప్రకటించాయి. టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
‘మునుగోడు’ ఉప ఎన్నిక సమన్వయానికి కమిటీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సమన్వయానికి ప్రత్యేకంగా కమిటీ వేయాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో చర్చించిన తర్వాత కమిటీని నియమించనున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని మంగళవారం జరిగిన పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో తీర్మానించారు. అలాగే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో 15న చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి అసెంబ్లీ ఎదుటనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. 17న విమోచన దినోత్సవంతో పాటు, ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు నుంచి వచ్చేనెల 2న మహాత్మాగాంధీ జయంతి దాకా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. కాగా 16 లోక్‌సభ నియోజకవర్గాలకు నియమించిన కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా పార్టీ ఇన్చార్జిలతో బుధవారం సంజయ్ ఇతర ముఖ్యనేతలు భేటీ కావాలని నిర్ణయించారు. ఇదీ చదవండి: దేశ రాజకీయాల పేరిట కేసీఆర్ కొత్త డ్రామాలు: బండి సంజయ్ -
మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లాలని, వినాయక చవితి తర్వాతి రోజు నుంచే టీఆర్ఎస్, బీజేపీలకు దీటుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 90 రోజుల కార్యాచరణను ఆ పార్టీ చేపట్టింది. మంగళవారం మధ్యాహ్నం గాంధీ భవన్ నుంచి నిర్వహించిన జూమ్ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఇన్చార్జులుగా నియమితులైన నేతలు, టికెట్ ఆశావహులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఉప ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇన్చార్జిలు నియోజకవర్గంలోనే ఉండాలి మండలాల ఇన్చార్జిలుగా నియమితులైన నేతలందరూ సెప్టెంబర్ 1 నుంచి ఉప ఎన్నిక ముగిసేంతవరకు నియోజకవర్గంలోనే మకాం వేయాలని రేవంత్, ఉత్తమ్ సూచించారు. స్థానికంగా ఉన్న పార్టీ కేడర్‌ను కాపాడుకోవడంతో పాటు టీఆర్ఎస్, బీజేపీలు ఎలా కుమ్మక్కై ఉప ఎన్నికను తీసుకువచ్చా యో, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయ డంలో ఆ రెండు పార్టీలు ఎలా విఫలమయ్యాయో ఓటర్లకు వివరించాలని చెప్పారు. మండలాల ఇన్‌చార్జిలే రోజుకో గ్రామం చొప్పున బాధ్యత తీసుకుని ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సెపె్టంబర్ మొదటి వారంలోనే టీపీసీసీ ఆధ్వర్యంలో మండల స్థాయిలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఓటర్లారా .. ఆలోచించండి టీపీసీసీ రూపొందించిన 90 రోజుల కార్యాచరణలో భాగంగా.. ఓటు ఎవరికి వేయాలో ఆలోచించాల్సిందిగా ఓటర్లను కరపత్రాల రూపంలో కాంగ్రెస్ నేతలు అభ్యర్థించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి లాంటి హామీలు.. కేంద్రం ఇచ్చిన ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షల జమ లాంటి అంశాలను కరపత్రంలో పొందుపరిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఓటర్లను నేరుగా కలిసి అభ్యరి్థంచే బాధ్యతను మండల ఇన్‌చార్జిలే తీసుకోవాలని సమావేశంలో సూచించారు. తామే అభ్యర్థి అనే రీతిలో బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చదవండి: ఇక్కడ రాజకీయాలు కూడా అంతే రిచ్‌గా..! -
మునుగోడుపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక దృష్టి
-
మునుగోడు ఉప ఎన్నిక ఫీవర్
-
బీజేపీ వాళ్లు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారు ??
-
అంతకు మించి.. కమలనాథులకు మంత్రి రోజా పంచులు
-
మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు ఏకపక్షం: చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
-
సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు: మంత్రి మేరుగు నాగార్జున
-
ప్రతిపక్షాలకు బుద్ధి రావాలి: ఆర్కే రోజా
-
వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బలపరుద్దాం
ఆత్మకూరు: రాష్ట్రంలో మూడేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు వెల్లివిరుస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని సమైక్యంగా బలపరుద్దామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా శ్రీధర్ గార్డెన్స్‌లో మంగళవారం నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నికలు జరుగుతాయని కలలో కూడా అనుకోలేదని, ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మూడేళ్లుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిబాగా లేకున్నా సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తు చేశారు. మూడు మార్లు ఎంపీగా జిల్లా ప్రజలు తనను గెలిపించారని, ఆత్మకూరు నుంచి గౌతమ్‌రెడ్డికి రెండు సార్లు ఘన విజయం అందించారని ఈ రుణం తీర్చుకోలేనిదన్నారు. ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో విక్రమ్‌రెడ్డి పోటీ చేస్తున్నారని, ఆయన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. తమ కోడలు శ్రీకీర్తి గౌతమ్‌రెడ్డి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉన్నారని, ఆ ఫౌండేషన్‌లో తామంతా సభ్యులమేనని, ప్రభుత్వం ద్వారా చేయలేని పనులను ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవచేస్తామని అన్నారు. 2వ తేదీన నామినేషన్ గురువారం మేకపాటి విక్రమ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 9 నుంచి నిరాడంబరంగా ఆర్డీఓ కార్యాలయం వరకు నాయకులతో కలిసి వెళ్లి 11 గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది: మేకపాటి విక్రమ్‌రెడ్డి ఇటీవల పార్టీ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పలు మండలాల్లో నిర్వహించినప్పుడు లబ్ధిదారులు తమకు అందుతున్న సంక్షేమ పథకాలను తెలిపి ప్రభుత్వంపై తమకున్న నమ్మకాన్ని వెల్లిబుచ్చారని మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలు పారీ్టకి స్తంభాల్లాంటి వారని, వారు చేసిన కృషితోనే నాయకులు పదవుల్లోకి వస్తారని, వారి మేలు ఎప్పటికి మరచిపోలేమన్నారు. తొలుత దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు, పార్టీ మండలాల కనీ్వ నర్లు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, రాపూరు వెంకటసుబ్బారెడ్డి, జితేంద్రనాగ్‌రెడ్డి, తూమాటి విజయభాస్కర్‌రెడ్డి, బొర్రా సుబ్బిరెడ్డి, నాయకులు గంగవరపు శ్రీనివాసులునాయుడు, కంటాబత్తిన రఘునాథరెడ్డి, ఎంపీపీలు కేతా వేణుగోపాల్‌రెడ్డి, బోయళ్ల పద్మజారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పీర్ల పార్థసారథి, మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ కేవీ శ్రావణ్‌కుమార్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో మోగిన మరో ఎన్నికల నగరా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో ఎన్నికకు నగరా మోగింది. తెలంగాణ రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. 19న నామినేషన్ల పరిశీలన, 30న పోలింగ్ నిర్వహించనున్నారు. బండ ప్రకాశ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరగనుంది. చదవండి: భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్ కథా చిత్రమ్ -
నేడు బద్వేల్ ,హుజురాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్
-
పచ్చని సంసారంలో చిచ్చు పెట్టారు
-
హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తాం: కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆగస్టు నెల చివరిలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ను నమ్మే ప్రసక్తే లేదన్నారు. లక్ష ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో చెప్పాలని కోదండరామ్ ప్రశ్నించారు. -
కాంగ్రెస్ నిన్నటి పార్టీ.. ఆ పార్టీకి రేపనేది లేదు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో మాట్లాడుతూ, హుజూరాబాద్ ఉప ఎన్నిక నీతికి, అవినీతికి.. ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికలుగా బీజేపీ చూస్తోందన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ మాదిరిగా హుజూరాబాద్‌లో బీజేపీని గెలిపించాలన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యనికి, నియంతృత్వానికి జరుగుతున్న పోరాటంలో బీజేపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నిన్నటి పార్టీ.. ఆ పార్టీకి రేపనేది లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
Karnataka Bypoll: హమ్మయ్య గెలిచాం!
సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో జరిగిన ఒక లోక్‌సభ స్థానం, రెండు అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ రెండు విజయాలతో పరువు నిలుపుకొంది. కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకుంది. ఇటీవల ఉప ఎన్నికలు జరగ్గా ఆదివారం ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరిగింది. బెళగావిలో టెన్షన్.. మంగళ అంగడి గెలుపు బెళగావి ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. బీజేపీ అభ్యర్థి మంగళ అంగడి కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ జార్కిహోళిపై 2,903 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. కేంద్ర మంత్రి సురేష్ అంగడి మృతితో బెళగావి లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికలు రావడం, ఆయన సతీమణి మంగళ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం తెలిసిందే. 35 రౌండ్ల వరకు బీజేపీ అభ్యర్థి ముందంజలో కొనసాగగా, 36వ రౌండు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చారు. 82వ రౌండ్లో మొగ్గు బీజేపీ వైపు మారింది. నువ్వా–నేనా అన్నట్లు ఇరుపక్షాలూ తలపడ్డాయి. మంగళకు 4,35,202 ఓట్లు, సతీష్‌కు 4,32,299 ఓట్లు వచ్చాయి. బీజేపీ శ్రేణులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాయి. మంగళకు బీజేపీ హవా, సానుభూతి పవనాలు పని చేయలేదా..? అనేది చర్చనీయాంశమైంది. బసవకళ్యాణ, మస్కి చెరొకరికి బసవకళ్యాణ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి శరణు సలగర 20,449 ఓట్ల మెజారిటీతో గెలుపాందారు. కాంగ్రెస్ అభ్యర్థి మాలకు 50,107 ఓట్లు రాగా, జేడీఎస్ అభ్యర్థికి 11,390 ఓట్లు రాగా,బీజేపీ అభ్యర్థికి 70,556 ఓట్లు వచ్చాయి. ఇక మస్కి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బసవనగౌడ తుర్విహాళ్ బీజేపీ అభ్యర్థి ప్రతాప్‌గౌడ పాటిల్‌పై 36,641 ఓట్లు మెజార్టీతో గెలుపాందారు. బీజేపీ అభ్యర్థి తరఫున ఇక్కడ సీఎం యడియూరప్ప, ఆయన తనయుడు విజయేంద్ర తదితరులు ప్రచారం చేయడం తెలిసిందే. కాగా ప్రభుత్వ వ్యతిరేకత, కొందరు నేతల సహాయ నిరాకరణ వల్ల తాను ఓటమి పాలయ్యానని ప్రతాప్‌గౌడ పాటిల్ వాపోయారు. -
‘సాగర్’లో భారీగా పోలింగ్...ఎవరిదో గెలుపు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదైంది. శనివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ రాత్రి 7 గంటల దాకా కొనసాగింది. గత ఎన్నికలకు భిన్నంగా ఎన్నికల కమిషన్ ఈసారి అదనంగా మరో 2 గంటలు పోలింగ్ సమయాన్ని పెంచింది. ఈ ఉపఎన్నికలో 86.2 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 2,20,300 ఓట్లకు గాను, 1,90,329 ఓట్లు పోలయ్యాయి. తుది క్రోడీకరణల అనంతరం ఈ సంఖ్యలో కొంతమార్పు ఉండే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి 2018 ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం కొంత తక్కువగా నమోదైంది. గత ఎన్నికల్లో 2,08,176 ఓట్లకు గాను, 1,79,995 ఓట్లు పోల్ కావడంతో 86.46 శాతం పోలింగ్ నమోదైంది. అంతే కాకుండా.. గత ఎన్నికల కంటే ఈసారి 12 వేల ఓట్లు కూడా పెరిగాయి. ఉప ఎన్నికల్లో విజయం కోసం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ సహా మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే సాగింది. ఓట్లు వేయించడంలోనూ పోటాపోటీ ఇరు పార్టీలకు ఈ ఎన్నికల్లో గెలవడం అనివార్యంగా మారడంతో ఎన్నికల ప్రచారంలో పోటీ పడినట్లే.. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లేయించడలోనూ పోటీ పడినట్లే కన్పించింది. దీంతో పోలింగ్ జోరుగా సాగింది. ప్రతి ఓటును కీలకంగా భావించి.. ఆయా గ్రామాల్లో స్థానిక నేతలు శ్రద్ధ తీసుకున్నారు. మరోవైపు పల్లెల్లో పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలోనే ఆయా పార్టీ కార్యకర్తల పోల్ చీటీలు పంచే అవకాశమిచ్చారు. దీంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రం దరిదాపుల్లో ఎవరూ లేకుండా అయ్యారు. చదవండి: కాంగ్రెస్ వడివడిగా.. -
హాట్‌హాట్‌గా ఓటు వేట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతోంది. ఓవైపు మండుటెండలు అదరగొడుతున్నా రాజకీయ పార్టీలు ప్రచారంలో భాగంగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాయి. గెలుపే ధ్యేయంగా తెల్లారిన దగ్గరి నుంచి చీకటి పడేంతవరకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రచారపర్వంలో అధికార టీఆర్ఎస్ ఒకింత ముందంజలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీలు కూడా శక్తిమేరకు ప్రయత్నం చేస్తున్నాయి. సాగర్‌లో పార్టీ అభ్యర్థి నోముల భగత్ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి తన టీంతో కలిసి విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, ఆయన తనయులకు తోడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా జట్టుగా గ్రామాల్లోకి వెళ్లి ప్రచారంలో ఎక్కడా వెనుకబడకుండా చూసుకుంటుండగా, బీజేపీ అభ్యర్థి రవినాయక్ స్థానిక నేతలతో కలిసి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్ రెండ్రోజుల రోడ్‌షోకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, సీఎం కేసీఆర్‌తో మరోమారు బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా జనగర్జన తరహాలోనే మరోమారు బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈనెల 10 తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సాగర్‌కు వెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు. దీంతో మరో పది రోజులు గడువు ఉన్నా... ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కనుంది. 14న నిడమనూరులో సీఎం సభ! నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం కోసం ఆ పార్టీ శ్రేణులు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నాయి. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి.. భగత్ గెలుపు బాధ్యతలను తీసుకొని గ్రామాలను కలియ తిరుగుతున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ కూడా నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రతి రోజు గ్రామాలకు వెళ్లి కేసీఆర్ పాలనను మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఇప్పటికే మండలాల వారీగా ఇన్ఛార్జిలుగా నియమితులైన బయటి జిల్లాల ఎమ్మెల్యేలు తమకు అప్పగించిన టీంలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. ఒకటీ రెండు రోజుల్లో ఐటీ మంత్రి కేటీఆర్ కూడా నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారనే ప్రచారం సాగర్ గులాబీ దండును ఉరకలు పెట్టిస్తోంది. దీంతోపాటు ముఖ్యమంతి కేసీఆర్ మరోమారు నియోజకవర్గంలో బహిరంగసభకు హాజరవుతారని, ఈ నెల 14న ఆయన నిడమనూరులో జరిగే సభలో పాల్గొంటారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంమీద సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఎండలను సైతం ఖాతరు చేయని, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భగత్ విజయం కోసం పట్టు వదలకుండా పని చేస్తున్నారు. టార్గెట్ జానా జానారెడ్డినే టార్గెట్ చేసి టీఆర్ఎస్ తమ ప్రచారం నిర్వహిస్తోంది. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, తెలంగాణ వచ్చాకే సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీళ్లు ఇవ్వగలిగామని చెబుతోంది. జానారెడ్డి అనేక శాఖలకు మంత్రిగా పని చేసినా నియోజకవవర్గ ప్రజలను ఉద్దరించిందేమీ లేదని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉపయోగం లేదంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు గులాబీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్కు దీటుగా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి వ్యక్తిగత చరిష్మాపైనే ఆధారపడి ఉప ఎన్నికను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో టీఆర్ఎస్కు తీసిపోకుండా దూసుకెళ్తోంది. జానారెడ్డితో పాటు ఆయన తనయులు రఘువీర్, జయవీర్‌లు విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ తదితరులు నియోజకవర్గంలోనే ఉండి ఓటర్లను కలుస్తున్నారు. జానారెడ్డి అభివృద్ధి చేయలేదన్న టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. జానారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నపుడే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో ఒరిగిందేమీలేదని ఓటర్లకు చెప్పి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మండలాల వారీగా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి బహిరంగ సభను నిర్వహించే యోచనలో ఉంది. అయితే సీఎం కేసీఆర్ సభ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిని బట్టి కాంగ్రెస్ సభ నిర్వహించాలా? వద్దా..? అన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీలు కోమటిరెడి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలు కూడా జానా ప్రచారానికి తోడు కానున్నారు. పార్టీకి చెందిన అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, మాజీ నాయకులు సాగర్‌లోనే ఉండి జానా గెలుపు బాధ్యతలను భుజానవేసుకున్నారు. సర్దిచెప్పుకొని సమన్వయంతో ముందుకెళ్తున్న బీజేపీ నియోజకవర్గంలో గతంలో పోటీ చేసిన అభ్యర్థిని కాదని కొత్త వ్యక్తి డాక్టర్ రవి నాయక్‌కు టికెట్ ఇవ్వడంపై మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తమైనా క్షేత్ర స్థాయి నాయకత్వానికి సర్ది చెప్పుకోవడంలో బీజేపీ సఫలీకృతమైంది. ప్రస్తుతానికి స్థానిక నేతలలో కలిసి రవికుమార్ టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల పార్టీలకు పోటీ ఇచ్చేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, టికెట్ ఆశించిన నివేదితా రెడ్డి కూడా తాజాగా ప్రచారంలో కలిసి వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన స్వగ్రామం పలుగుతండాకు వెళ్లిన సందర్భంగా విలపించి వార్తల్లోకెక్కిన రవికుమార్ ఆ తరువాతి రోజున రూటు మార్చి డాన్స్‌లు చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పార్టీలోని రాష్ట్ర స్థాయి, ద్వితీయ శ్రేణి నేతలను సాగర్‌లో ప్రచారానికి పంపించిన బీజేపీ ముఖ్యనేతలను రంగంలోకి దింపేందుకు చర్యలు చేపట్టింది. రవికుమార్ ఎన్నికల ప్రచారానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు తరలిరానున్నారు. ఈ మేరకు పార్టీ నాయకత్వం ప్రచార షెడ్యూలు ఖరారు చేస్తోంది. ఈనెల 10వ తేదీ తరువాత బండి సంజయ్ సాగర్‌లో మకాం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వారితోపాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలను కూడా సాగర్‌కు తీసుకురావాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మరో 38 మంది కూడా బరిలో ఉన్నా ప్రధాన పోటీ ఈ మూడు పార్టీల మధ్యే నెలకొంది. చదవండి:6 ఎమ్మెల్సీలు ఖాళీ.. కడియంకు మళ్లీ ఛాన్స్ ఉండేనా? -
బీజేపీ-జనసేన బంధానికి బీటలు!
సాక్షి, తిరుపతి: కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్నట్టుంది బీజేపీ–జనసేన పరిస్థితి. అంతా బాగుందని, కలిసికట్టుగా ముందుకెళ్తామని ఆయా పార్టీల నేతలు డప్పుకొట్టుకుంటూనే తెరవెనుక సహాయనిరాకరణకు పాల్పడడం, కక్షసాధింపులకు దిగడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నామినేషన్‌కు దూరం తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దిగిన మాజీ ఐఏఎస్ రత్నప్రభ నామినేషన్ కార్యక్రమానికి జనసేన పూర్తిగా దూరమైంది. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన నామినేషన్ కార్యక్రమానికి జనసైనికులు హాజరు కాలేదు. నాదెండ్ల తిరుపతిలోనే ఉన్నా జనసేననేత, మాజీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ రెండు రోజులుగా తిరుపతిలోనే ఉన్నా రత్నప్రభ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీనిపై బీజేపీ కన్నెర్రజేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. వివాదానికి కారణం ఏమిటంటే తిరుపతి ఉప ఎన్నికల బరిలో ఎవరు ఉండాలనే అంశంపై బీజేపీ, జనసేన మధ్య వివాదం మొదలైంది. తెలంగాణలో ఎన్నికల త ర్వాత తిరుపతిలోనూ పోటీచేయాలని బీజేపీ ప్రకటించింది. జనసేనతో సంప్రదించకుండానే తమ అభ్యర్థిని ప్రకటించేసింది. ఏకపక్ష నిర్ణయంతో జనసేనకు కడుపుమండినట్టుంది. అందుకే సహాయనిరాకరణకు దిగింది. పవన్ ప్లాన్ ఇదీ వాస్తవానికి తిరుపతి బరిలో జనసేన ఉండాలని భావించింది. తిరుపతిలో తమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ జనసేనకే పడుతాయని అంచనా వేసింది. కానీ ఆ పార్టీ నేతల ఆశలపై మద్దతుపార్టీ అయిన బీజేపీ నీళ్లు చల్లడంతో జీర్ణించుకోలేక పోతోంది. బీజేపీ ప్లాన్ బీ అమలు ఒక సామాజికవర్గం నాయకులు దూరంగా ఉన్నారని పసిగట్టిన బీజేపీ నేతలు ప్లాన్ బీ అమలు చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్‌కళ్యాణేనంటూ ప్రకటించేసింది. చదవండి: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జరిపే అర్హత బాబుకు లేదు -
తిరుపతి ఉపఎన్నిక: వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆయనే
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ గురుమూర్తిని ఉప ఎన్నిక బరిలో నిలుపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా వైఎస్సార్ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఇందుకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 23న నోటిషికేషన్ విడుదల, ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న ఫలితాలు వెల్లడించనున్నట్లు మంగళవారం తెలిపింది. తిరుపతితో పాటు తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు కూడా నేడే షెడ్యూల్ విడుదలైంది. చదవండి: తిరుపతి ఉప ఎన్నికలో 3 లక్షల మెజార్టీ సాధిస్తాం తిరుపతి, సాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల -
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో టీడీపీ
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని టీటీడీపీ నిర్ణయించింది. మువ్వా అరుణ్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడిగా పనిచేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ అసెంబ్లీ పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. రంగారెడ్డి –హైదరాబాద్–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎల్.రమణ బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. -
‘సాగర్’ లో నేడు టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహాల్లో భాగంగా బుధవారం హాలియాలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యే ఈ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సుమారు రెండు లక్షల మందిని సమీకరించడం లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు వారం రోజుల క్రితం బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించడంతో తక్కువ వ్యవధిలో భారీ సభను నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దివంగత శాసన సభ్యులు నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఈ స్థానాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్క ల్లపల్లి రవీందర్రావు, మాజీ విప్ కర్నె ప్రభాకర్ తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తు న్నారు. హాలియాలో అలీనగర్ సమీపంలో నల్లగొండ రహదారి వెంట ఏర్పాటుచేసిప ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. సభ వెనుక బహుముఖ వ్యూహం నాగార్జునసాగర్ ఉపఎన్నిక సన్నాహాల్లో భాగంగా టీఆర్ఎస్ బుధవారం బహిరంగ సభ నిర్వహిస్తున్న ప్పటికీ పార్టీ అధినేత మదిలో ఇతర వ్యూహాలు కూడా ఉన్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో బుధవారం జరిగే సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రస్థానం, విధానంతో పాటు పాలనాపరమైన అంశాలపై కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గం, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు కేసీఆర్ ప్రసంగంలో ప్రధానంగా చోటు చేసుకునే అవకాశముందని పార్టీ నేతలు అంచనా వేస్తు న్నారు. రాబోయే రోజుల్లో పార్టీ, ప్రభుత్వపరంగా దూకుడుగా వెళ్తామనే సంకేతం ఈ సభ ద్వారా పార్టీ యంత్రాంగానికి ఇచ్చే అవకాశముంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గత ఆరున్నరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిని వివరించడంతో పాటు కొత్తగా పలు వరాలు కూడా ఇచ్చే అవకాశముంది. శాసనమండలి పట్టభద్రుల కోటా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ఈ సభ నుంచి కేసీఆర్ పిలుపునిస్తారు. ఎన్నిక ఎప్పుడొచ్చినా... ‘సమర’ సన్నద్దత తొలుత తిరుపతి లోక్‌సభ స్థానంతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి కూడా మార్చిలో ఉప ఎన్నిక జరుగుతుందని టీఆర్ఎస్ భావించింది. అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక ఉంటుందని తాజాగా అంచనా వేస్తోంది. అయితే ఏ సమయంలో ఉప ఎన్నిక జరిగినా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దంగా వుంచేందుకు టీఆర్ఎస్ గత ఏడాది డిసెంబర్ నుంచే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే మండల, నియోజకవర్గ స్థాయిలో సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు పలు పర్యాయాలు అంతర్గత సర్వేలు కూడా నిర్వహించింది. పార్టీ నేతల నుంచి అందిన అంతర్గత నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో టీఆర్ఎస్తో పాటు, ఇతర పార్టీల బలాబలాలను కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంచనా వేస్తూ వస్తున్నారు. రెండు రోజులుగా బహిరంగ సభ సన్నాహాల్లో భాగంగా మరోమారు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించారు. మండలాల వారీగా ఇన్చార్జిలు సాగర్ నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల వారీగా టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలను నియమించి ఉప ఎన్నికకు సన్నద్దమవుతోంది. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్రావు పర్యవేక్షణలో మండల ఇన్చార్జిలు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. మందుల సామేలు (త్రిపురారం), కర్నె ప్రభాకర్ (నిడమానూరు), భరత్ కుమార్ గుప్తా (హాలియా), రవీందర్రావు (నాగార్జునసాగర్), సందీప్‌రెడ్డి (పెద్దఊర), ఒ.నర్సింహారెడ్డి (గుర్రంపోడు) ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. శాసనమండలి పట్టభద్రుల ఎన్నిక, సాగర్ ఉప ఎన్నిక కోసం పార్టీ స్థానిక నేతలను సమన్వయం చేయడంపై టీఆర్ఎస్ ఇన్చార్జిలు దృష్టి కేంద్రీకరించారు. అభ్యర్థి ఎంపిక ఇప్పట్లో లేనట్లే! టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరవుతున్న హాలియా బహిరంగ సభలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసే పార్టీ అభ్యర్థిపై ఎలాంటి ప్రకటన ఉండే సూచనలు కనిపించడం లేదు. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, న్యాయవాది డీసీ కోటిరెడ్డి, దివంగత శాసనసభ్యులు నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరితో పాటు మన్నె రంజిత్‌యాదవ్, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ వంటి స్థానిక యువనేతలు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అభ్యర్థి ప్రకటనపై తొందరపడకుండా... సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే యోచనలో పార్టీ అధినేత కే.చంద్రశేఖర్‌రావు ఉన్నట్లు సమాచారం. -
తిరుపతి అభ్యర్థిపై బీజేపీ–జనసేన సుదీర్ఘ మంతనాలు
సాక్షి, అమరావతి: తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ, జనసేన పార్టీల నుంచి ఎవరు పోటీ చేయాలన్న దానిపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్చార్జ్ సునీల్ దేవధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి మధుకర్ ఆదివారం రాత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. సుమారు 3 గంటల పాటు వీరి మంతనాలు సాగాయి. అభ్యర్థి ఎంపికపై ఇంకో దఫా చర్చలు జరపాలని నిర్ణయించారు. చదవండి: (కరోనా పీడలో ఎన్నికల పంచాయతీ!) -
బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా టీడీపీ నిర్ణయాలు
స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు అడుగులు వేస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా టీడీపీ నిర్ణయాలు వెలువడుతున్నాయి. యాత్రల పేరుతో రచ్చ రాజకీయానికి తెరతీస్తున్నాయి. మతవిద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని కుయుక్తులు పన్నుతున్నాయి. అందులో భాగంగా కపిలతీర్థం టు రామతీర్థం అంటూ కమలనాథులు, ధర్మ పరిరక్షణయాత్ర అంటూ తెలుగు తమ్ముళ్లు రాగాలు ఆలపిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సాక్షి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముందే టీడీపీ, బీజేపీ నేతలు ముందస్తు దుష్ప్రచారానికి పావులు కదుపుతున్నారు. ఫిబ్రవరి 4 నుంచి కపిలతీర్థం టు రామతీర్థం యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. దీంతో వెంటనే స్పందించిన చంద్రబాబు తన హయాంలో వందల ఆలయాలను కూల్చిన విషయం వదిలేసి, పదిరోజుల ధర్మపరిరక్షణ యాత్రకు పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీ నుంచి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 700 గ్రామాల్లో యాత్ర సాగించాలని నిర్ణయించారు.ఈ యాత్రలో పార్టీ శ్రేణులు తప్పనిసరిగా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు బుధవారం తిరుపతిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మత రాజకీయాలే లక్ష్యం రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుండడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్షాలు పక్కదారులు తొక్కుతున్నాయని మేధావులు విమర్శిస్తున్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేయాలని ఎత్తులు వేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. దేవాలయాలపై దాడులంటూ అవసరానికి మించి ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా మత రాజకీయాలు చేస్తున్నాయని వెల్లడిస్తున్నారు. మేమే నిజమైన పోటీ! వైఎస్సార్సీపీకి తామే నిజమైన ప్రత్యర్థి అని ప్రకటించుకునేందుకు టీడీపీ, బీజేపీ–జనసేన కూటమి తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో హిందుత్వాన్ని భుజానికెత్తుకుని గుడ్డిగా పరుగెడుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలు ఆయా పార్టీల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని పరిశీలకులు వివరిస్తున్నారు. అందుకే పోటాపోటీగా రాజకీయ తీర్థయాత్రలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయని వెల్లడిస్తున్నారు. -
లక్షన్నర మందితో కేసీఆర్ సభ!
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసేందుకు హాలి యా మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈనెల 22–24 తేదీల మధ్య సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించగా సభ నిర్వహణ తేదీకి సంబంధించి నేడో రేపో స్పష్టత వచ్చే అవకాశముంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ ర్రావు హాజరయ్యే ఈ బహిరంగ సభకు సుమారు లక్షన్నర మందిని సమీకరించా లని పార్టీ నేతలు నిర్ణయించారు. సభ నిర్వహణ తేదీకి సంబంధించి మంత్రి జగదీశ్‌రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సోమవారం కలసి చర్చించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో కేటీఆర్ శనివారం జరిపిన భేటీలో సభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించారు. సభ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను మాజీ ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సోమ భరత్‌కుమార్ గుప్తా తదితరుల నేతృత్వంలోని కమిటీకి అప్పగించినట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేకించి నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను వివరించేందుకు ఈ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. మరోవైపు ఈ సభ వేదికగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పలు వరాలు ప్రకటించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సమస్యలకు సంబంధించిన ఎమ్మెల్యేల నుంచి జాబితా కోరినట్లు సమాచారం. ఫిబ్రవరిలో నామినేటెడ్ పదవుల భర్తీ ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. సాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడకముందే రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతల జాబితాను క్రోడీకరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలకు కూడా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పిస్తామని సుమా రు ఏడాదిన్నర క్రితం కేసీఆర్ ప్రకటించినా ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో నాయకుల్లో అసంతృప్తిని తొలగించేందుకు నామినేటె డ్ పదవుల భర్తీ ప్రక్రియ ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. కేటీఆర్‌తో భేటీ సందర్భంగా నల్లగొండ జిల్లా కు చెందిన నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించగా ఫిబ్రవరి మూడో వారంలోగా నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. 20న ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో భేటీ వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోమారు పోటీ చేస్తారని పార్టీ అధిష్టానం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఓవైపు పల్లా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివిధ వర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుండగా మరోవైపు కేటీఆర్ కూడా ఉమ్మడి జిల్లాలవారీగా భేటీలు నిర్వహిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక వ్యూహంపై కేటీఆర్ సమావేశం నిర్వహించారు. మూడు రోజుల క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతోనూ భేటీ అయిన కేటీఆర్... ఈ నెల 20న ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలు విభేదాలు తొలగించుకొని ఈ సమావేశానికి రావాల్సిందిగా కేటీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్రావు తదితరులు మాజీ మంత్రి పువ్వాడ నాగేశ్వర్రావుతో సోమవారం భేటీ అయ్యారు. -
దుబ్బాక ఉప ఎన్నికపై ఈసీ స్పెషల్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజకీయ నేతల ఫిర్యాదుతో ఈ ఎన్నికలకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించింది. శాంతి భద్రతల పరిశీలకుడిగా తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ నియమితులయ్యారు. కాగా దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం జోరందుకున్నది. బీజేపీ వర్సెస్ అధికార పార్టీ టిఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్టుగా ఓట్లు రాబట్టేందుకు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం కొనసాగిస్తున్నాయి. దీంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉప పోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర నేతలంతా దుబ్బాకలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కింపు, విజేతను ప్రకటిస్తారు. (చదవండి : ఉపఎన్నిక.. ‘దుబ్బాక’ కాక) -
మీ కష్టసుఖాల్లో నేనెప్పటికీ ఉంటా: హరీష్ రావు
సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా హసన్మీరాపూర్లో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. కష్టం, సుఖం, ఆపదలో ఎప్పటికి ఉంటాను. మీ కోసం నా తలుపులు ఎప్పటికి తెరచి ఉంటాయి. ఈ ఎన్నికలు సోలిపేట లింగన్న మరణంతో వచ్చాయి. నా తోబుట్టువు సుజాత అక్కని గెలిపిద్దాం. పట్టుబట్టి రమ్మని పిలిస్తే కలసి దండం పెట్టి పోదామని వచ్చాను. ఈ గ్రామంలో సీఎం కేసీఆర్ 15 రోజులు ఇక్కడే ఉండి రోడ్డు వేయించి బస్సు తెప్పించారు. మీరు కోరిన విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారు. ఇప్పుడు నేను హసన్మీర్, అప్పనపల్లికి రోడ్డు వేయిస్తాను. ఎస్సీ, బీసీ కాలనీలలో సీసీ రోడ్లు, మోరీలు, ఖాళీ స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణం కోసం నిధులు ఇస్తాను. ఇంటి అడుగు జాగాలో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం అసెంబ్లీలో ఆమోదం కూడా వచ్చింది. మీ గ్రామానికి 50 డబుల్ బెడ్ రూమ్స్ మంజూరు చేస్తాను. కరోనాతో కొంత ఇబ్బంది అయింది. ఆదాయం తగ్గింది. ఇలాంటి కష్టసమయంలో కూడా ఉచితంగా రేషన్, పప్పులు, సరుకులు పంపిణీ చేశాం. గ్రామంలో 182 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. పేదింటి ఆడపడచు పెళ్లికి లక్ష పదహారు రూపాయలు ఇస్తున్నాం. బీడీ పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు పెట్టు బడి ఇస్తున్నాం. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇందులో బీజేపీ, కాంగ్రెస్‌వి ఒక్క పైసా కూడా లేదు. గ్రామంలో ముదిరాజ్, యాదవ సంఘాల భవనాలు నిర్మిస్తాం, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి హరీష్ రావు తెలిపారు. (‘సుజాతక్క తోటి ఏం పని అయితదని అనుకోవద్దు’) -
ధోకాబాజీలను నమ్మొద్దు
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతవుతాయని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దుబ్బాకలో రోడ్ షో నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత మాటలను నమ్మవద్దని కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీలకు ప్రజలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. కల్లబొల్లి మాటలను దుబ్బాక ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఎక్కడో పట్నంలో ఉండి పిలుపునిస్తే వచ్చి ఓట్లు వేసే రోజులు పోయాయని, ఇక్కడి ప్రజలు అమాయకులేం కాదన్నారు. ప్రజల మధ్య ఉంటూ.. వారి కష్ట, సుఖాల్లో పాలుపంచుకునే వారినే తమ నాయకుడిగా ఎన్నుకుంటున్నారని హరీశ్ పేర్కొన్నారు. సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఈ ప్రాంతం ప్రజలు మంచి నాయకుడిని కోల్పోయారన్నారు. చింతమడకలో పుట్టి, దుబ్బాకలో చదువుకున్న సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ప్రాంతం, ఇక్కడి ప్రజలు అంటే ఎంతో ఇష్టం అని పేర్కొన్నారు. అందుకోసమే అడగకుండానే నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. బుధవారం దుబ్బాకలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న జనం బీజేపీ తోక ముడిచింది దుబ్బాక ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాంతం మహిళల ఇబ్బందులను నేరుగా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. బీడీ కారి్మకులకు పింఛన్లు అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం బీడీ కారి్మకులకు నెలకు రూ.2,016 ఇస్తుంటే.. వాటిలో రూ. 1,600 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని బీజేపీ నేతలు అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాపై బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేస్తే బీజేపీ నేతలు తోక ముడిచారని విమర్శించారు. ఒకవేళ బీడీ కారి్మకులకు కేంద్రం నిధులు ఇస్తే ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రంలో పింఛన్లు కేవలం రూ. 500లే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. పనులు చేయకుండానే బీజేపీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సూట్‌కేసులతో వచ్చిన కాంగ్రెస్ నేతలు ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నాయకులకు ఈ ప్రాంతం ప్రజల కష్టాలు కని్పంచలేదా అనిహరీశ్ నిలదీశారు. ఏనాడు ప్రజల కష్టాలను చూడని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడూ సూట్‌కేసులు సర్దుకొని దుబ్బాకలో మకాం వేసి.. మీటింగ్‌లు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. దుబ్బాక నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా మహిళా అభ్యర్థి పోటీ చేయడాన్ని హర్షిస్తూ.. నియోజకవర్గంలోని మహిళలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అందుకోసమే ఈ సమావేశానికి మహిళలు దండుగా కదలి వచ్చారన్నారు. ప్రజల స్పందన, చూస్తుంటే..టీఆర్ఎస్ అభ్యర్థి లక్షకు పైగా మెజారీ్టతో గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
నామినేషన్ దాఖలు చేసిన సోలిపేట సుజాత
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ టిక్కెట్ కేటాయించడం తెలిసిందే. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ ప్రభాకర్‌తో కలిసి బుధవారం రిటర్నింగ్ అధికారికి సోలిపేట సుజాత తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందరికి అందుబాటులో ఉండే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దుబ్బాక ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా... 17న పరిశీలన, 19వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కింపు, విజేతను ప్రకటిస్తారు. (చదవండి : దుబ్బాక ఉప ఎన్నిక: ఇజ్జత్‌కా సవాల్!) హుజూర్ నగర్ పలితాలే దుబ్బాకలో రాబోతుంది : హరీశ్ కాంగ్రెస్, బీజేపీ అభివృద్ధి నిరోధకులుగా మారారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అడుగడున అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. హుజూర్నగర్ ఫలితాలే దుబ్బాకలో రాబోతున్నాయని జోస్యం చెప్పారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్ రాలేదని, దుబ్బాకలో కూడా అదే ఫలితాలు వస్తాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏ గ్రామానికి వెళ్లిన అపూర్వ స్వాగతం లభిస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. -
ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
సాక్షి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఈసారి వంద శాతం పోలింగ్ నమోదు అయింది. జిల్లావ్యాప్తంగా 50 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 824మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 24మంది పీపీఈ కిట్లతో వచ్చి మరీ ఓటు వేశారు. ఇక ఎమ్మెల్సీ బరిలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత కల్వకుంట్ల పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి పోతన్కర్ లక్ష్మీ నారాయణ బరిలో ఉన్నారు. ఫలితాలు ఈ నెల 12న ప్రకటించనున్నారు. 99.64% పోలింగ్ శాతం నమోదు మొత్తం 824 ఓట్లకి 821 ఓట్లు పోల్ మిగతా ముగ్గురు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగం చివరి గంటలో ఓట్లు వేసిన కరోనా పాజిటివ్ వచ్చిన ప్రజా ప్రతినిదులు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ఈనెల 12న ఓట్ల లెక్కింపు -
దుబ్బాక ఎన్నిక చారిత్రాత్మకమైనది: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికపై ఇందిరా భవన్లో శుక్రవారం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికను చారిత్రాత్మకమైనదిగా భావిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపై నిలవాలి. ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నాం. రాష్ట్ర నాయకత్వం మీ వెంటే ఉంటుంది. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తాం. ఇప్పటికే మేము కొంత గ్రౌండ్ వర్క్ చేశాం. ముఖ్యమైన కార్యకర్తలు, ఎవరు నిలబడాలనేది సూచించాలి. మల్లన్నసాగర్ నిర్వాసితులకు గజ్వేల్, సిద్ధిపేట మాదిరిగా పరిహారం చెల్లించాలి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ప్రభుత్వ ఆస్పత్రి భవనం , చేనేత , బీడీ కార్మికులను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అన్ని విధాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. మండల కమిటీలను మూడు రోజుల్లో పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షులను ఆదేశిస్తున్నా. ఆ తర్వాత విలేజ్ కమిటీ లను ఏర్పాటు చేయాలి’ అని తెలిపారు. చదవండి: టీఆర్ఎస్ కుట్రలను ఛేదిస్తాం -
హుజూర్‌నగర్‌పై బులెటిన్ విడుదల చేసిన ఈసీ
సాక్షి, సూర్యాపేట : హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు, కేసులు, నగదు, పట్టుబడిన మద్యం వంటి వివరాలతో కూడిన బులిటెన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య ఆదివారం విడుదల చేశారు. మొత్తం ప్రచార వాహనాల సంఖ్య - 104 ఇప్పటి వరకు పట్టుకున్న నగదు : రూ.72,29,500 సీజ్ చేసిన మద్యం : 7000లీటర్ల కోడ్ ఉల్లంఘన కేసులు: 10 సి విజిల్ యాప్ ద్వారా నమోదైన కేసులు సంఖ్య: 15 కాగా, కేవలం మఠంపల్లి మండలంలోనే రూ. 1,25,200 మద్యం పట్టుబడడం గమనార్హం. అభ్యర్థులు ప్రచారం కోసం చేసిన ఖర్చు: టిఆర్ఎస్ - శానంపూడి సైదిరెడ్డి - రూ.8,65,112 కాంగ్రెస్ - పద్మావతి రెడ్డి - రూ.5,27,621 బీజేపీ - కోట రామారావు - రూ.4,22,258 స్వతంత్ర అభ్యర్థి - తీన్మార్ మల్లన్న - రూ.3,73,945. టిడిపి - చావా కిరన్మయి - రూ.3,46,968 స్వతంత్ర అభ్యర్థి దేశగాని సాంబశివ గౌడ్ - రూ. 10360 -
ఒక్క ఓటుతో ఇద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేస్తాం
చింతలపాలెం (హుజూర్నగర్) : హుజూర్‌నగర్‌లో ఒక ఓటుతో ఇద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేస్తామని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ క్యాంప్ కార్యాలయంలో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. ఒక ఓటు వేసి పద్మావతిని గెలిపిస్తే తనతో పాటు పద్మావతి పని చేస్తారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ప్రజను ఎలా ఓటు అడుతున్నారని ప్రశ్నించారు. మాదిగ సామాజిక వర్గానికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించలేదని, అందుకు మాదిగలు టీఆర్ఎస్ను బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి బెదిరింపు మాటలకు ఎవరూ భయపడవద్దని అన్నారు. ఆర్టీసీని లాభాపేక్షతో చూడొద్దని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి మద్దతు, సంఘీభావం తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో రింగ్ రోడ్డు, కోర్టు బిల్డింగ్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ తదితర అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. పాలకీడు మండలంలో కాల్వ చివరి భూములకు నీరు రాకపోవడంతో కొత్తలిఫ్ట్ నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. మిర్యాలగూడ, జగ్గయ్యపేట రైల్వే మార్గంలో ప్యాసింజర్ రైలు నడిపిస్తానని అన్నారు. హుజూర్నగర్ ప్రాంతలో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయిస్తానని చెప్పారు. మిర్యాలగూడెం – ఖమ్మం రోడ్డును విస్తరింపచేయిస్తానని, కేంద్ర ప్రభుత్వ నిధులతో అంతర్జాతీయ స్థాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం చేయిస్తానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి కైలాష్ కుమార్, యరగాని నాగన్న గౌడ్, తన్నీరు మల్లిఖార్జున్ పాల్గొన్నారు. -
రేవంత్ వ్యాఖ్యలపై దుమారం
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : ఉప ఎన్నిక ముంగింట్లో కాంగ్రెస్ పార్టీలో హుజూర్నగర్ అభ్యర్థిత్వంపై కయ్యం తారస్థాయికి చేరింది. ‘అభ్యర్థిగా పద్మావతిని.. ఉత్తమ్ ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారు’ అని పార్టీ వర్కింVŠ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆపార్టీ జిల్లా శ్రేణుల్లో దుమారం లేపాయి. ఆయన వ్యాఖ్యలపై హుజూర్నగర్, సూర్యాపేటలో పార్టీ నేతలు మండిపడ్డారు. అయితే జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఆపార్టీలో జరిగిన పరిణామాలను టీఆర్ఎస్ నిశితంగా పరిశీలిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. రేవంత్‌ను టార్గెట్ చేసి విమర్శలు.. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లాలో ఆపార్టీ ముఖ్య నేతలు.. నేరుగా ఆయన్ను టార్గెట్ చేసి ఘాటుగా విమర్శలు సంధించారు. పార్టీ అగ్రనేతల నిర్ణయం మేరకే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్.. పద్మావతిని హుజూర్నగర అభ్యర్థిగా ప్రకటించారని, దీనికి రేవంత్‌రెడ్డి అభ్యంతరం ఎందుకు చెబుతారని ప్రశ్నించారు. రేవంత్‌పై విమర్శలు గుప్పించడంపై.. ఆయనతో పాటు పార్టీలోకి వచ్చిన జిల్లా ముఖ్య నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. హుజూర్నగర్ వేదికగా ఆపార్టీలో జరిగిన పరిణామాలు జిల్లాలో పాత.. కొత్త నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు తీసుకొచ్చాయి. ఇదిలా ఉండగా హుజూర్నగర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో రూ.వేల కోట్లు ఖర్చు చేశాడని, ఆయన సతీమణి పద్మావతికి టికెట్ ఇస్తే గెలిపిస్తామన్నారు. ఆమెకు టికెట్ ఇస్తే కేడర్ ఎటూ వెళ్లదన్నారు. ఎక్కడి వారినో ఇక్కడికి తీసుకొచ్చి పోటీ చేయిస్తే గెలవడం అసాధ్యమన్నారు. యూత్ కాంగ్రెస్ నేతలు.. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి.. ఉత్తమ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఉప ఎన్నికల్లో పద్మావతే తమ పార్టీ అభ్యర్థి అన్నారు. ఈ నియోజకవర్గ ఉప ఎన్నిక రేవంత్‌రెడ్డికి సంబంధం లేదన్నారు. హుజూర్నగర్ టికెట్‌పై రేవంత్‌రెడ్డి జోక్యం మంచి పద్ధతి కాదని, ఆయన నియోజకవర్గానికే పరిమితం కావాలని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకటన్నయాదవ్ విలేకరుల సమావేశంలో.. రేవంత్‌పై ధ్వజ మెత్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీని విమర్శించడం సమంజసం కాదన్నారు. గులాబీలో చర్చ.. కాంగ్రెస్ పార్టీలో హుజూర్నగర్ అభ్యర్థిత్వంపై జరుగుతున్న కయ్యాన్ని టీఆర్ఎస్ ముఖ్య నేతల గణం నిశితంగా పరిశీలిస్తోంది. కాంగ్రెస్‌లో ఈ పరిణామాలు ఎటు వైపు వెళ్తాయోనని అంచనా వేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి ఎవరన్నది త్వరలో ప్రకటిస్తే నోటిఫికేషన్ రాకున్నా దూకుడుగా ప్రచారానికి వెళ్లొచ్చని ఆపార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. గత నెల రోజులుగా మంత్రి జగదీశ్‌రెడ్డి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు ఇంకా ప్రకటించలేదు. ఈ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రకటించనున్నారు. అయితే కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలపై మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌లో గలాటాను టీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో హుజూర్నగర్ నియోజకవర్గంలో ఏయే మండలాల్లో నేతలు అసంతృప్తిగా ఉన్నారని పార్టీ ముఖ్య నేతలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
ఉప ఎన్నికల్లో సత్తా చాటుతాం: టీటీవీ దినకరన్
చెన్నై: ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) పార్టీ అధ్యక్షుడు టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. అనర్హతకు గురైన ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లబోమని వెల్లడించారు. రాబోయే ఉప ఎన్నికల్లో మా సత్తా చాటి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని వ్యాఖ్యానించారు. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమిళనాడు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా గ్రూపు కట్టడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో వారికి చుక్కెదురైంది. అనర్హత సబబేనని హైకోర్టు తీర్పునివ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్లడానికి టీటీవీ దినకరన్ వర్గీయులు సంశయించారు. ఉప ఎన్నికలలోనే తేల్చుకోవాలని నిశ్చయించుకున్నారు. -
ప్రలోభాలతోనే నంద్యాలలో గెలుపు
– టీడీపీ అవినీతి సొమ్మును విచ్చలవిడిగా పంపిణీ చేసింది – సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని బెదిరించారు – వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు – దమ్ముంటే ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి – వైఎస్ఆర్సీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్లను ప్రలోభాలు గురిచేయడం, మభ్య పెట్టడంతోనే భూమా బ్రహ్మానందారెడ్డి విజయం సాధించారని వైఎస్ఆర్సీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడేళ్ల తన పాలనలో మూడున్నర లక్షల అవినీతికి పాల్పడ్డారని, అందులో రూ.200 కోట్లను నంద్యాలలో విచ్చలవిడిగా పంపిణీ చేశారన్నారు. ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఇవ్వడంతోపాటు రోజుకు ఒక్కో వార్డులో ఐదు లక్షలు, ఒక్కో గ్రామంలో పది లక్షల రూపాయలను తిని తాగడం కోసం వెచ్చించారన్నారు. అయినప్పటికీ ప్రజలెవరూ టీడీపీ వైపు వెళ్లకపోవడంతో స్వయనా సీఎం చంద్రబాబునాయుడుతో సహా క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు బెదిరింపులకు దిగారన్నారు. సర్వే పేరుతో బృందాలను దింపి నేరుగా ఓటర్లను తెలుగుదేశానికి ఓటు వేయాలని, లేదంటే రేషన్‌కార్డులు, పింఛన్లు, చంద్రన్నబీమా, లోన్లు రద్దు చేస్తామని భయపెట్టారన్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో నంద్యాల ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేయాల్సి వచ్చిందన్నారు. బుధవారం బిర్లా కంపౌండ్‌లోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవై రామయ్య, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి మధుసూధన్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో టీడీపీ నాయకులు దౌర్జన్యాలు, దోపిడీలకు పాల్పడినా తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం విలువలతో కూడిన రాజకీయం చేశారన్నారు. 70 వేల మంది ఓటర్ల విశ్వాసాన్ని పొందామన్నారు. దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి నంద్యాల గెలుపును టీడీపీ నాయకులు బలుపు అనుకుంటున్నారని, అది ఎప్పటికీ వాపేనని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. అంత దమ్ముంటే ఫిరాయించిన మిగతా 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. నంద్యాలలో ఓటర్లను భయ పెట్టడంతోనే టీడీపీ గెలిచిందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగే ఉంటే తమ పార్టీ తప్పక గెలిచేదన్నారు. వచ్చే ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులు సమరోత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. -
ఎన్నికల ఖర్చు వివరాలివ్వండి
- షాడో అబ్జర్వేషన్ రిజిష్టర్‌తో సరిపోకపోతే నోటీసులు - జేసీ ప్రసన్న వెంకటేష్ కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నికలో చేసిన ఖర్చు వివరాలను ఓట్ల లెక్కింపు తేదీ నుంచి నెల రోజుల్లో సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అభ్యర్థులను ఆదేశించారు. మంగళవారం తన చాంబరులో జేసీ విలేకరులో మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారిగా తనకు ఇది మొదటి ఎన్నికని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, విమర్శలు దరిచేరకుండా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు బాగా సహకరించారన్నారు. ఎన్నికల నియమావలి, పెయిడ్ న్యూస్ తదితర వాటిపై నిష్పక్షపాతంగా వ్యవహించామన్నారు. అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు షాడో అబ్జర్వేషన్ రిజిష్టర్ నిర్వహించారని, ఇందులో అభ్యర్థి చేసిన ప్రతి ఖర్చును నమోదు చేసి ఉంటారన్నారు. వీటికి అభ్యర్థులు చూపించే లెక్కలకు సరిపోలక పోతే నోటీసులు ఇస్తామన్నారు. నిబంధనల ప్రకారం రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయరాదన్నారు. పోలింగ్ సిబ్బందికి రోజుకు టీఏ, డీఏ కింద అదనంగా రూ.300 ఇస్తున్నామని, ఇప్పటికే పీఓ, ఏపీఓలకు అదనపు టీఏ, డీఏ చెల్లించామని, ఇతర పోలింగ్ సిబ్బంది మాత్రం తీసుకోలేదని, వీరు నంద్యాల తహసీల్దారును కలసి అదనపు డీఏ పొందవచ్చని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై రెవెన్యూ, పౌరసరఫరాల అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. కలెక్టర్, జేసీలకు జిల్లా అధికారుల అభినందనలు నంద్యాల ఉప ఎన్నికను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్‌ను.. జేసీ–2 రామస్వామి, ప్రత్యేక కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి తదితరులు వేరువేరుగా కలసి బొకేలు సమర్పించి అభినందించారు. అదే విధంగా జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌బాబు, కార్యదర్శి గిరికుమార్‌రెడ్డి తదితరులు కలెక్టర్, జేసీలను కలిసి ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. -
గెలిపిస్తేనే ఫరూక్‌కు ప్రమోషన్
– బాబు షరతు నంద్యాల: ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తేనే మాజీ మంత్రి ఫరూక్‌కు ప్రమోషన్ ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు షరతు విధించారు. ఆయన నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం సంజీవనగర్, శ్రీనివాస జంక్షన్లలో పర్యటించారు. పార్టీనే నమ్ముకున్న ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చానని, కానీ ఉప ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తేనే ప్రమోషన్ ఇస్తామని అన్నారు. పట్టణంలో రోడ్ల విస్తరణ పనులను మున్సిపల్ డైరెక్టర్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలుస్తారని చమత్కరించారు. కాగా.. చంద్రబాబుకు సమస్యను చెప్పుకోవడానికి వచ్చిన ఓ రైతును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఆగ్రహంతో పాసు పుస్తకాలను రోడ్డుపై విసిరేశారు. వెంటనే డీఎస్పీ గోపాలకృష్ణ, సిబ్బంది అతన్ని ఈడ్చుకొని వెళ్లారు. -
వైఎస్సార్సీపీ పోటీ చేయడం వల్లే అభివృద్ధి
- ఉప ఎన్నికలో పోటీకి పెట్టకుంటే నంద్యాలను పట్టించుకునేవారు కాదు - మాజీ ఎంపీ, పార్టీ జిల్లా పరిశీలకుడు అనంత వెంకటరామిరెడ్డి నంద్యాలఅర్బన్: ఉప ఎన్నికలోవైఎస్సార్సీపీ పోటీ చేయకపోతే ప్రభుత్వం నంద్యాల అభివృద్ధి గురించి పట్టించుకునేది కాదని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు తన మూడేళ్ల పాలనలో నంద్యాల అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీ పోటీ పెట్టడం వల్ల ఓటమి భయంతో నంద్యాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా సింగనమలకు చెందిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివారెడ్డితో కలిసి శనివారం అనంత వెంకటరామిరెడ్డి 16వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకు నంద్యాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు నమ్మవద్దని అనంత వెంకటరామిరెడ్డి ప్రజలకు సూచించారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ ప్రాంత అభివృద్ధికి రూ.280కోట్లు మంజూరు చేసి పునాది రాళ్లు వేశారని చెప్పిన ఆయన ఇప్పటి వరకు అందులో ఒక్క పని కూడా ముందుకు సాగలేదని గుర్తు చేశారు. పని ఉన్నంత వరకు ఒక రకంగా పని అయిపోయిన తర్వాత మరోరకంగా ప్రవర్తించడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. ఉప ఎన్నిక అనంతరం నంద్యాల వైపు ప్రభుత్వ పెద్దలు కన్నెత్తి కూడా చూడరన్నారు. వైఎస్సార్సీపీ ప్లీనరీలో జగన్మోహన్రెడ్డి ప్రకటించిన 9 పథకాలు జనామోదం పొందడంతో చంద్రబాబుకు దిమ్మతిరిగిందన్నారు. 2019 సాధారణ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం మోసాలను ప్రజలు పసిగట్టారు... ముఖ్యమంత్రి మోసపూరిత ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారని సింగనమల్ల సాంబశివారెడ్డి అన్నారు. గోపాల్‌నగర్, సుందరయ్య కాలనీల్లో ప్రచారానికి జనం నుంచి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. వీరి వెంట స్థానిక నాయకులు మోహన్ లింగప్రసాద్, సాయిరాంరెడ్డి, జమత్వలి, సంపత్, బాలిరెడ్డి, తిరుపతి, రాంబాబు, శ్రీనివాసులు, అనంతపురం జిల్లా నాయకులు నాగేశ్వరరెడ్డి, రాఘవరెడ్డి, రామాంజులురెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మీసాల రంగన్న, తదితరులు పాల్గొన్నారు. -
ఓటమి భయంతోనే అభివృద్ధి మంత్రం
- టీడీపీ పాలనలో ఒరిగిందేమీ లేదు - ఫ్యాక్షన్ నేతలను దూరంగా పెట్టండి - నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి జూలేపల్లె(గోస్పాడు): ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే టీడీపీ అభివృద్ధి మంత్రం జపిస్తోందని నంద్యాల నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మండలంలోని జూలేపల్లెలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఎవరికీ ప్రాధాన్యత లేదని, కష్టపడి పని చేసినా గుర్తించే వారు లేరని అన్నారు. నంద్యాల నియోజకవర్గం ఎంతో మంది ప్రముఖ నేతలను ఎదిగేలా చేసిందని గుర్తు చేశారు. అయితే.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా ఫ్యాక్షన్ నాయకులు ఇక్కడ రాజకీయాలు చేసేలా ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ నాయకులను ఆళ్లగడ్డకే పరిమితం చేయాలని గతంలో తాము కోరినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగ భృతి, రైతులకు, మహిళలకు రుణమాఫీ విషయంలో చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి చేయకపోగా, నంద్యాలలో మాత్రం ఉప ఎన్నిక కారణంగా అభివృద్ధి పేరిట హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతో ప్రజలను ప్రలోభపెడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీని గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఏ పథకాలూ అమలు చేయడం లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ఎక్కడెక్కడి నుంచో టీడీపీ నాయకులు నంద్యాల వస్తున్నారని, ఇంతకుముందు అభివృద్ధి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. శిల్పా మోహన్‌రెడ్డి సొంత నిధులతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వంగూరి భాస్కరరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ప్రహ్లాదరెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, పార్థసారథిరెడ్డి, హరినాథరెడ్డి, రామనాథరెడ్డి, నాగేశ్వరరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, దేశం సుధాకర్‌రెడ్డి, ప్రసాద్, సాల్మన్, కోటిరెడ్డి, పుల్లయ్య, రామసుబ్బారెడ్డి, నారాయణ, శేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నంద్యాలకు నజరానా
– రూ. 3 కోట్లతో కాపు కల్యాణ మండపం కర్నూలు(అర్బన్): ఉప ఎన్నికలు జరుగుతున్న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఇప్పటికే రూ.వేల కోట్లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంగళవారం నంద్యాలలో రూ.3 కోట్లతో కాపు కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ బీ ఉదయలక్ష్మి జీఓ 101ను జారీ చేశారు. -
నంద్యాలకు మరో ఎర
- పట్టణ మధ్యలో కుందూపై వంతెన నిర్మాణం.. - నదిలో పూడికతీతకు రూ.7.36 కోట్లు కర్నూలు(సిటీ) : నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ అడ్డదారిలో గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. నిధులు మంజూరు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా నంద్యాల మధ్యలో వెళ్లే కుందూ నదిపై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణం, నదిలో పూడికతీతకు నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి జలవనరుల శాఖ అధికారులు ఇటీవలే రూ.8.86 కోట్లకు అంచనాలు వేశారు. ఈ మేరకు జలవనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధుల నుంచి రూ.7.36 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం పరిపాలన అనుమతులు జారీ చేసింది. కుందూ నదిలో 4.3 కిలోమీటర్ మేరకు పూడికతీత, నదికి ఇరువైపులా ఉన్న చెట్ల తొలగింపునకు ఈ నిధులు వినియోగించనున్నారు. దీంతో పాటు ఇటీవలే చామకాలువ పూడికతీత పనులకు సైతం నీరు-చెట్టు కింద రూ.3 కోట్లు మంజూరు చేశారు. -
ఫ్లాప్ షో
నంద్యాల : నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ మంగళవారం ప్రారంభించిన సైకిల్ ర్యాలీ తొలి రోజే ఫ్లాప్ షోగా ముగిసింది. పట్టణంలోని పద్మావతినగర్‌లో ర్యాలీని ఆర్ఐసీ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. రైతునగర్, కానాల ప్రాంతాల్లో 10 కి.మీ మేర ర్యాలీ సాగింది. పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా జారుకున్నారు. చివరి దశకు చేరే సరికి కనీసం 50 మంది కూడా మిగల్లేదు. -
ఎంత ఘాటు ప్రేమో!
- నంద్యాలలో అభివృద్ధి పేరిట హడావుడి - కార్డులు, పింఛన్లు, పక్కా గృహాలంటూ తాయిలాలు - సీఎం కార్యాలయానికి ఆగమేఘాలపై ప్రతిపాదనలు - ప్రజలను మభ్యపెట్టేందుకు అధికార పార్టీ ఎత్తుగడ కర్నూలు (అగ్రికల్చర్)/ సిటీ: ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై సర్కారుకు ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చింది. అభివృద్ధి, సంక్షేమం అంటూ హడావుడి చేస్తోంది. ఇటీవల జరిగిన శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాల ఎన్నికల్లో విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలోనూ ఓటమి పాలైతే పరువు పోతుందనే భయంతో సర్వశక్తులూ ఒడ్డుతోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డిని ప్రకటించడంతోనే అధికార పార్టీలో వణుకు మొదలైంది. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో అవకాశమున్న అన్ని దారులనూ వెతుకుతోంది. ఒకవైపు రేషన్ కార్డులు, పింఛన్లు, పక్కాగృహాలు వంటి తాయిలాలను ఎర వేస్తూనే.. మరోవైపు అభివృద్ధి పేరుతో హడావుడి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నంద్యాలలో పర్యటించారు. మంత్రులు కూడా క్యూ కడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ఆలోపే నిధుల వరద పారించి..ప్రజలను మభ్యపెట్టాలని అధికార పార్టీ చూస్తోంది. ఈ క్రమంలోనే నంద్యాల నియోజకవర్గానికి ఏమేమి కావాలో ప్రతిపాదనలు పంపాలంటూ గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జిల్లా యంత్రాంగానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్న జిల్లా ఉన్నతాధికారి హడావుడిగా ఆ సమావేశాన్ని ముగించుకొని ఒకరిద్దరు ముఖ్య అధికారులతో కలిసి అధికార పార్టీ నేతల సూచన మేరకు గంట వ్యవధిలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం రూ.298.21 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. నంద్యాల నియోజకవర్గంలో నంద్యాల మున్సిపాలిటీ, నంద్యాల రూరల్ మండలం, గోస్పాడు మండలం ఉన్నాయి. నియోజకవర్గంలో 2,09,612 మంది ఓటర్లు ఉన్నారు. అధికారాన్ని ఉపయోగించుకుని ఉప ఎన్నికలో లబ్ధి పొందడానికి అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే నియోజకవర్గానికి 2,131 రేషన్ కార్డులు, 980 పింఛన్లు మంజూరు చేసింది. పక్కాగృహాలు కూడా మంజూరు చేస్తూ జీఓ విడుదల చేసింది. తెరపైకి చామకాలువ పూడికతీత ఉప ఎన్నికలో ప్రజలను మభ్యపెట్టేందుకు, తమకు అనుకూలంగా ఉన్న వారికి నిధులను దోచిపెట్టేందుకు చామ కాలువలో పూడికతీత పనులకు రాత్రికి రాత్రే అంచనాలు వేయించారు. వాస్తవానికి ఆ కాలువ వరద నీటి నుంచి నంద్యాల పట్టణవాసులను కాపాడేందుకు రూ.20 కోట్లతో చేపట్టిన పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ రద్దు కాలేదు. అయినప్పటికీ అధికార పార్టీ నేతలు నీరు–చెట్టు పథకం కింద నిబంధనలకు విరుద్ధంగా పూడికతీత పనులకు రూ.3 కోట్లతో అంచనాలు వేయించారు. పైగా ఈ పనులకు వచ్చే నెల 3వ తేదీనే టెండర్ పిలిచేందుకు సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ.. జల వనరుల శాఖ ఎస్ఈ ఎస్.చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నారు. ఇదే మంత్రిని కర్నూలు నగరం మధ్యలో వెళ్లే హంద్రీ, వక్కెరువాగుల్లో పూడికతీసేందుకు అనుమతులు ఇవ్వాలని, నీరు–చెట్టు కింద నిధులు మంజూరు చేయాలని కోరినా ఏ మాత్రమూ పట్టించుకోలేదు. కేవలం నంద్యాలలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కోట్లాది రూపాయలను ఖర్చు చేయడానికి అధికార పార్టీ ఎత్తుగడ వేస్తోంది. చామ కాలువ మొత్తం 5.9 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. దీనికి వెడల్పు సుమారు 45 మీటర్లు ఉంటుంది. ప్రతియేటా వర్షపు నీరు సమీప కాలనీల్లోకి వస్తుండడంలో రక్షణ గోడ నిర్మించేందుకు రూ.97.51 కోట్లకు 2008 మార్చి 12న అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ప్యాకేజీ–1 కింద రూ.20.44 కోట్లతో కాలువ ఇరువైపులా కాంక్రీట్ గోడ నిర్మించేందుకు సిద్ధపడ్డారు. అయితే.. భూసేకరణ సమస్య, కరెంట్, టెలిఫోన్ స్తంభాలు తొలగించక పోవడంతో కాంట్రాక్టర్ పనులు చేయలేదు. దీనికి తోడు డిజైన్స్ ఇవ్వడంలో అధికారులు చేసిన తీవ్రమైన జాప్యం వల్ల కూడా ఆ పనులు ఆగిపోయాయి. కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ అంగీకారానికి వచ్చారు. అయితే.. ఇంత వరకు ఆ కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం రద్దు చేస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రస్తుతం అధికార పార్టీ నేతలు కాలువ పూడికతీతకు నీరు–చెట్టు కింద అంచనాలు వేయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే అంచనాలు వేశాం – ఎస్.చంద్రశేఖర్‌రావు, జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ చామకాలువలో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు నీరు–చెట్టు కింద అంచనాలు వేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అంచనాలు రూపొందించా. రూ.3 కోట్లతో సుమారు 3 కి.మీ మేర పూడిక తీయనున్నాం. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపడతాం. -
నంద్యాలకు తాయిలాల పరంపర
ఉప ఎన్నిక నేపథ్యంలో అపారప్రేమ – ప్రతి కుటుంబానికీ రేషన్ కార్డు ఇచ్చేందుకు చర్యలు – ఇప్పటికే 2,131 కార్డులు మంజూరు – 980 పింఛన్ల కేటాయింపు కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునే అధికార టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లను ఎరగా వేస్తోంది. ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు మంజూరు చేస్తామని.. దరఖాస్తులను ఈపీడీఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నంద్యాలకు సంబంధించి రేషన్‌కార్డుల కోసం 2,414 దరఖాస్తులను ఈపీడీఎస్‌లో అప్లోడ్ చేయగా.. ఇప్పటికే 2,131 కార్డులు మంజూరయ్యాయి. వీటిని ప్రింట్ తీసి పంపిణీ చేయడానికి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. నంద్యాల మండలానికి 1,697.. గోస్పాడు మండలానికి 434 ప్రకారం కార్డులు మంజూరయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలనే లక్ష్యంతో పాలకులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గానికి 980 పింఛన్లు మంజూరయ్యాయి. రూ.1000కే దీపం గ్యాస్ కనెక్షన్ల పంపిణీని నంద్యాల నియోజకవర్గంలో ఇప్పటికే ముమ్మరం చేశారు. తాజాగా పక్కాఇళ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఏకంగా జీఓ జారీ చేయడం గమనార్హం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలకు వెళ్లకుండా ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. ఇటీవల జరిగిన శాసనమండలి, పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల్లో విద్యావంతులు టీడీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో నంద్యాలకు ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. పంపిణీలో ఎవరిది పైచేయి నంద్యాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున బరిలో నిలిచేందుకు ఒక వైపు శిల్పా మోహన్‌రెడ్డి, మరోవైపు భూమా కటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లు ఎవరి నేతృత్వంలో పంపిణీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మా ద్వారానే పంపిణీ చేయాలని రెండు గ్రూపులు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. -
పార్టీని నమ్మిన వారికే అవకాశం
నంద్యాల: పార్టీని నమ్మిన వారికే నంద్యాల ఉప ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి చెప్పారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ ఇన్చార్జి రాజగోపాల్రెడ్డని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల ప్రజలు వైఎస్ఆర్సీపీ వెంటే ఉన్నారన్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ఎండీ జహీర్‌బాషా, పార్టీ నేతలు మలికిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గంగాచరణ్‌రెడ్డి, గోస్పాడు వీరారెడ్డి, డాక్టర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఉప చిచ్చు!
నంద్యాల సీటుపై పేచీ – తనకే ఇవ్వాలంటున్న భూమా చిన్న కుమార్తె – భూమా బ్రహ్మానందరెడ్డి వైపు అధిష్టానం మొగ్గు – సెంటిమెంట్‌పై అధికార పార్టీ పునరాలోచన - వేరు కుంపటి యోచనలో శిల్పా - తెరపైకి కొత్త రాజకీయ సమీకరణాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల వ్యవహారం అధికార పార్టీలో రోజుకో కొత్త చిచ్చు రేపుతోంది. ఉప ఎన్నికల్లో అసెంబ్లీ సీటు ఎవరికి ఇవ్వాలనే అంశంపై కథ రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న, మొన్నటి వరకు భూమా బ్రహ్మానందరెడ్డికి సీటు ఖాయమని సాగిన చర్చ.. తాజాగా కొత్త మలుపు తీసుకుంది. అసెంబ్లీ బరిలో భూమా నాగిరెడ్డి కుటుంబానికి చెందిన నాగమౌనికకే పెద్దపీట వేయాలనే చర్చ మొదలయ్యింది. తద్వారా సెంటిమెంట్ కూడా వర్క్అవుట్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సీటు తనకే ఇవ్వాలని భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె నాగమౌనిక కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ అధిష్టానం మాత్రం భూమా బ్రహ్మానందరెడ్డి వైపే ఇప్పటి వరకు మొగ్గు చూపుతోంది. సెంటిమెంట్ వర్క్ అవుట్ కాదేమోనన్న ఆందోళన ఆ పార్టీని వెన్నాడుతోంది. సీటుపై మడత పేచీ... వాస్తవానికి భూమా బ్రహ్మానందరెడ్డికే ఉప ఎన్నికల్లో సీటు ఖరారైందని మొదట్లో ప్రచారం జరిగింది. దీంతో రోడ్ల విస్తరణ సహా వివిధ పథకాల అమలు తీరుపై భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో పర్యటించడం మొదలుపెట్టారు. కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే శిల్పా కుటుంబం నుంచి మద్దతు దొరక్కపోవడంతో పాటు నాగమౌనిక కూడా సీటు ఆశించడంతో ఆ పార్టీలో చర్చ మొదలయ్యింది. మరణించిన భూమా నాగిరెడ్డి కుటుంబానికి చెందిన రెండవ కుమార్తె నాగమౌనికకు సీటు ఇస్తేనే సెంటిమెంటు వర్క్అవుట్ అవుతుందని, ఇతరులకు ఇస్తే కాదన్న అభిప్రాయం బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో కూడా తాజాగా పునరాలోచన ప్రారంభమైనట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి సీటు ఇవ్వని పక్షంలో తన దారి తాను చూసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. నిజంగా సెంటిమెంట్ ఉందా? సాధారణంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే నంద్యాల విషయానికి వచ్చే సరికి ఇది కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన భూమా నాగిరెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి మంత్రి పదవి కూడా ఆశించారు. అయితే ఆయనకు మంత్రి దక్కలేదు. పైగా గుండెపోటుతో మరణించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన వ్యక్తి మరణించడంతో ఆ సీటు తమ పార్టీ అభ్యర్థికే ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. అయితే భూమా కుటుంబం నుంచి ఒకరిని టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో సెంటిమెంట్ వర్క్అవుట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. పైగా పార్టీ మారిన కుటుంబానికి చెందిన వ్యక్తినే మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలన్న మీమాంస నంద్యాల నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీనికి తోడు బలమైన వర్గమున్న శిల్పామోహన్‌రెడ్డి సహకరించకపోగా పోటీలో నిలవాలని భావిస్తుండటం అధికార పార్టీని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. మొత్తం మీద అధికార పార్టీలో నంద్యాల ఉప ఎన్నికల వ్యవహారంతో కొత్త రాజకీయ సమీకరణాలు ప్రారంభమయ్యాయి. -
నేడు 2వ వార్డుకు ఉపఎన్నిక
- ఆత్మకూరులో భారీ బందోబస్తు - ప్రతి 14మంది ఓటర్లకు ఓ పోలీస్ - పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఉప ఎన్నిక: ఆత్మకూరు రెండో వార్డు కారణం: వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నబీ మృతి చెందడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు: యూనస్-వైఎస్ఆర్సీపీ నబీరసూల్- టీడీపీ సయ్యద్ మాబూ- కాంగ్రెస్ ఓటర్ల సంఖ్య: 1415 పోలింగ్ కేంద్రం: జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల బందోబస్తులో ఉన్న పోలీసులు: 105 ఆత్మకూరు రూరల్: నగర పంచాయతీ రెండో వార్డుకు ఆదివారం పోలింగ్ జరగనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నబీ..గత ఎన్నికల్లో గెలిచి కొద్ది రోజుల్లోనే గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో ఉప ఎన్నిక అవసరమైంది. వార్డుకు త్రిముఖ పోటీ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై మీర్ యూనస్ పోటీ చేస్తుండగా టీడీపీ తరఫున నబీరసూల్, కాంగ్రెస్ అభ్యర్థిగా సయ్యద్ మాబు పోటీ చేస్తున్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం నాటి నుంచే టీడీపీ దౌర్జన్య కాండకు పాల్పడింది. ప్రత్యర్థి అభ్యర్థులను ఉపసంహరణ చేయించి ఎన్నికను ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నం చేసింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యూనస్‌పై దాడి చేసి కిడ్నాప్‌కు పాల్పడింది. అయితే ప్రజలు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. విస్తృత బందోబస్తు ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలో 1415 మంది ఓటర్లు..ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు 14 మంది ఓటర్లకు ఒక పోలీసు చొప్పున మొత్తం 105 మందిని బందోబస్తు కోసం నియమించారు. వైస్ఆర్సీపీ అభ్యర్థి యూనిస్‌ను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ నాయకులు విఫలయత్నం చేయడం.. ఆత్మకూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కావడంతో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ స్పందించారు. ఆత్మకూరు వచ్చి రెండో వార్డులో పర్యటించి శాంతిభధ్రతల విషయంలో అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. డీఎస్పీ వినోద్ కుమార్, సీఐ కృష్ణయ్యల ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్ఐలు, ఏడుగురు ఏఎస్ఐలు, 32 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, ఇద్దురు మహిళా పోలీసులు, 16 మంది హోం గార్డులు, 40 మంది ఏఆర్ కానిస్టేబుళ్లను బందోబస్తు కోసం నియమించారు. పోలింగ్ బూత్‌ల పరిశీలిన.. ఉప ఎన్నికల ప్రత్యేకాధికారి.. హంద్రినీవా సుజల స్రవంతి ప్రత్యేక కలెక్టర్ మల్లికార్జునుడు శనివారం పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు బూతులను ఆయన పరిశీలించారు. ఇప్పటికే ఈవీఎంలు పోలింగ్ బూతులకు చేరుకున్నాయి. వేసవి కాలం కావడంతో ఓటర్లు ఇబ్బందుల పడకుండా తగినన్ని షామియానాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రత్యేక ఎన్నికల అధికారి వెంట మండల ప్రత్యేకాధికారి సత్యరాజు తహసీల్దార్ రాజశేఖరబాబు, మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద కూడా ఉన్నారు. -
ఖేడ్‌తో కొత్త సంప్రదాయానికి శ్రీకారం
మెదక్ జిల్లా: నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికలు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అకాల మరణం చెందితే అన్నిపార్టీలు వారి వారసులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం.. లేదా ప్రధాన పార్టీలు పోటీకి దిగకపోవడం సంప్రదాయంగా వస్తోంది. సాధారణ ఎన్నికల్లో నారాయణ్‌ఖేడ్ నుంచి గెలిచిన కాంగ్రెస్ నేత కిష్టారెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా అన్ని పార్టీలు బరిలోకి దిగాయి. ఏకగ్రీవం అనే మాటకు తావులేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి పేరును అన్నిపార్టీల కంటే ముందుగా ప్రకటించింది. సిట్టింగ్ స్థానం కావడంతో పాటు.. ఎమ్మెల్యే మరణించడంతో వచ్చిన ఉప ఎన్నికలు కావడంతో సానుభూతి పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ధీమాగా ఉంది. కానీ, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నాయకులు ఓటమిని ముందుగానే అంగీకరించే పరిస్థితి నెలకొంది. దానికి తోడు అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మెజార్టీ 50 వేలను దాటింది. గ్రేటర్లో పూర్తి బాధ్యతలను కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అన్నితానై చేపట్టగా.. ఖేడ్ బాధ్యతలను కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు తీసుకున్నాడు. ఇద్దరూ టీఆర్స్ పార్టీకి భారీ విజయాలు అందించారు. మంత్రి హరీశ్ రావు 20 రోజుల పాటు ఖేడ్లోనే ఉంటూ ప్రతి గ్రామాన్ని చుట్టేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సిద్దిపేట తరహాలోనే అభివృద్ధికి కృషి చేస్తామన్న హరీశ్ వాగ్దానాలకు ప్రజలు మెజార్టీ రూపంలో పట్టం కట్టారని చెప్పాలి. అన్ని పార్టీల కంటే ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోయింది. ఖేడ్‌లో టీఆర్ఎస్కు ఘనవిజయాన్ని అందిస్తే కృష్ణాజలాలను తెస్తామని హరీశ్‌రావు చెప్పారు. నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నిక పోలింగ్ శాతం కూడా అనూహ్యంగా నమోదైంది. సాధారణ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని మించి ఓటర్లు బారులు తీరారు. ఉప ఎన్నికల పోలింగ్ అంటే ప్రజల్లో కొంత ఆసక్తి తక్కువగా ఉండడంతో పాటు సిట్టింగ్ పార్టీలకే పట్టం కడతారన్న సంప్రదాయాన్ని ఖేడ్ ప్రజలు తిరగరాశారు. ఖేడ్‌లో ఎక్కువ మంది ప్రజలు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తారు. కానీ, అధికార పార్టీ ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు ఉప ఎన్నికల పోలింగ్‌తో పాటు భారీ మెజార్టీతో కొత్త రికార్డు సృష్టించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేగా గెలిచిన భూపాల్ రెడ్డి నారాయణ్‌ఖేడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు ఖేడ్‌లో 13 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 10 సార్లు గెలిచింది. మిగిలిన మూడుసార్లు ఎస్డబ్యూఏపీ, ఇందిరా కాంగ్రెస్, టీడీపీ గెలుపొందాయి. ఇప్పటివరకు టీడీపీ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జరిగాయి. ఇక నారాయణ్‌ఖేడ్ ఘన విజయంతో కాంగ్రెస్ నుంచి భారీ వలసలు ఖాయమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులు కూడా త్వరలోనే కారెక్కడం ఖాయమని తెలుస్తుంది. ఇన్నాళ్లూ టీడీపీ వంతు కాగా.. ఇప్పుడు తమకు ఆ బాధ తప్పదేమోనని కాంగ్రెస్ నాయకులు మధనపడుతున్నారు. -
'తిరుపతి నియోజక వర్గంలో మళ్లీ ఉప ఎన్నిక జరిపించాలి'
హైదరాబాద్: తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో అధికార టీడీపీ అక్రమాలకు పాల్పడిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గానికి మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ఆయన లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. అధికారులే ఓటర్ స్లిప్పులు పంచి ప్రజల చేత దొంగ ఓట్లు వేయించి రిగ్గింగ్ కు సహకరించారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తిరుపతిలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని కోరారు. -
మెదక్‌లో టిఆర్ఎస్ విజయం లాంఛనమే!
హైదరాబాద్: తెలంగాణలో మెదక్ లోక్‌సభ స్థానానికి, ఏపిలో కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ స్థానానికి పోలింగ్ పూర్తి అయింది. పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఉప ఎన్నికలలో పోలింగ్ శాతం బాగా తగ్గింది. మెదక్‌లో 66 శాతం పోల్ కాగా, నందిగామలో 66.6 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 16న ఓట్లను లెక్కిస్తారు. మెదక్‌లో టిఆర్ఎస్ విజయం లాంఛనమేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే టిఆర్ఎస్కు మెజార్టీ శాతం తగ్గే అవకాశం ఉంది. రెండు లక్షల మెజార్టీ వచ్చే అవకాశం లేదని అంటున్నారు. రెండవ స్థానం తమదంటే తమదని కాంగ్రెస్, బిజెపి వారు అంటున్నారు. సంగారెడ్డి, పఠాన్‌చెరు నియోజకవర్గాలలో మాత్రమే బిజెపి ప్రభావం ఉందని అంటున్నారు. ** -
ప్రశాంతంగా పోలింగ్
సాక్షి, చెన్నై: నిఘా నీడలో ఏర్కాడు ఉప సమరం బుధవారం ప్రశాంతం గా ముగిసింది. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడంతో గెలుపుపై ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పెరుమాళ్ మరణంతో ఏర్కాడు రిజర్వుడు స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక లోక్ సభ ఎన్నికలకు రెఫరెండంగా డీఎంకే, అన్నాడీఎంకేలు పరిగణించాయి. డీఎంకే అభ్యర్థి మారన్, అన్నాడీఎంకే అభ్యర్థి సరోజతోపాటుగా మరో తొమ్మిది మంది ఇండిపెండెంట్లు ఎన్నికల రేసులో నిలబడటంతో సమరం ఆసక్తికరంగా మారింది. ప్రధాన పక్షాల మధ్య గట్టి పోటీ ఉన్నా, ఓట్ల చీలిక ఎక్కడ గండి కొడుతుందేమోనన్న బెంగ మొదలైంది.ప్రశాంతంగా ఓటింగ్: నియోజకవర్గం పరిధిలోని 290 పోలింగ్ కేంద్రాల్లో చెదురుమదురు ఘటనల మినహా బుధవారం ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. 2500 మంది పారా మిలటరీ బలగాలు, స్థానిక పోలీసుల సహకారంతో గట్టి భద్రత మధ్య ఉదయం ఎన్నికలు జరిగింది. 41 పోలింగ్ కేంద్రాలు అటవీ గ్రామాల్లో ఉండటం, మరో 21 కేంద్రాలు కొండ ప్రదేశాల్లో ఉండటంతో అటు అధికారులు, ఇటు భద్రతా సిబ్బంది నానాతంటాలు పడాల్సి వచ్చింది. ఉదయం ఏడున్నర గంటలకే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నానికి అనేక కేంద్రాల్లో 75 శాతం మేరకు ఓటింగ్ జరిగింది. ఏర్కాడు పరిసరాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం ఐదు గంటలైనా, ఓటర్లు బారులు తీరే ఉన్నారు. దీంతో వారికి టోకెన్లను అందజేసి ఓట్లు వేసే అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో తొలి సారిగా నోటా బటన్ ఉపయోగించారు. ఓటింగ్ సరళిని అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్ కెమెరాల ద్వారా ఆన్లైన్లో సేలం జిల్లా కలెక్టర్ మకర భూషణం, చెన్నైలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ పర్యవేక్షించారు. సాయంత్రానికి ఇది వరకు ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు అయింది. పోలింగ్ 89.75 నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. గెలుపుపై ఎవరి ధీమా వారిది: ఓటింగ్ ముగియడంతో గెలుపుపై అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల్లో ధీమా పెరిగింది. అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ ఉదయం తన భర్త పెరుమాళ్ సమాధి వద్ద నివాళులర్పించినానంతరం ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన స్వగ్రామం వాల్పాడి సమీపంలోని పాప్పనాయకన్ పట్టి పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో తాను గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే అభ్యర్థి మారన్ తన స్వగ్రామం పూవలూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాను 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.