సునీల్ బన్సల్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న బీజేపీ నేతలు. చిత్రంలో రాంచందర్‌రావు తదితరులు
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఆందోళనలతో ఎండగట్టండి
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: అందరూ సమన్వయంతో పని చేసి రాష్ట్రంలో పార్టీ పురోగతికి పాటుపడాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్రఇన్‌చార్జ్ సునీల్‌బన్సల్ దిశా నిర్దేశం చేశారు. పార్టీ తరఫున ఎన్నికైన అన్ని స్థా యిల ప్రజాప్రతినిధులు మరింతగా పార్టీ బలోపే తం, విస్తరణకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నందున, ఎన్నికల హామీల అమలు, ముఖ్యమైన సమ స్యల పరిష్కారంలో వైఫల్యాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
పార్టీ వైఖరి, విధానాలు, క్రమశిక్షణ, మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఎంతటి పెద్ద నాయకులు వ్యవహరించినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని, పార్టీ నాయకులంతా సమన్వయంతో ప్రచారం చేసి గెలిపించుకునేందుకు కృషి చేయాలని సూచించారు.
బుధవారం పార్టీ కార్యాలయంలో ఎంపీలు డీకే.అరుణ, ఈటల రాజేందర్, గొడెం నగేశ్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాయల్ శంకర్, ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, ఎమ్మెల్సీలు ఏవీఎన్‌రెడ్డి, మల్క కొమురయ్యలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్రపార్టీ ఇన్‌చార్జ్ అభయ్‌పాటిల్, ఇతరనేతలు పాల్గొన్నారు.
వారిపై పార్టీ నమ్మకం పెట్టుకుంది : రాంచందర్‌రావు
బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జాతీయ నాయకత్వం బలమైన నమ్మకాన్ని పెట్టుకుందని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, పార్టీ అభ్యర్థి గెలుస్తాడనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం రాంచందర్‌రావు అధ్యక్షతన రాష్ట పదాధికారుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అదే ఎంఐఎంకు వేసినట్టేనని చెప్పారు. పోలీస్ స్టేషన్లలో బైండోవర్ అయ్యే కాంగ్రెస్ అభ్యర్థి కావాలా? లేక ప్రజా సమస్యల పరిష్కారానికి అభివృద్ధి కోసం పనిచేసే బీజేపీ అభ్యర్థి కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
గత బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి, అరాచకాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు హామీలు, అమలు కాని 6 గ్యారంటీలను ప్రజల ఎదుట ఎండగట్టాలన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


