కాంగ్రెస్‌తో మైత్రి కొనసాగుతుంది: అఖిలేశ్‌ | Samajwadi Party alliance with Congress to continue says Akhilesh Yadav | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో మైత్రి కొనసాగుతుంది: అఖిలేశ్‌

Oct 11 2024 5:58 AM | Updated on Oct 11 2024 5:58 AM

Samajwadi Party alliance with Congress to continue says Akhilesh Yadav

ఇటావా(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరిగే 10 స్థానాలకుగాను ఆరింటికి ఏకపక్షంగా టికెట్లు ఖరారు చేసిన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ఈ పరిణామంపై గురువారం స్పందించారు. కాంగ్రెస్‌తో తమ పార్టీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఇండియా కూటమి ఉంటుంది.

 కాంగ్రెస్‌తో మా మైత్రి కూడా కొనసాగుతుంది అని మాత్రం చెప్పదలుచుకున్నా’అని తెలిపారు. రాజకీయాలపై చర్చించేందుకు సమయం కాదంటూ సీట్ల ప్రకటన వ్యవహారాన్ని దాటవేశారు. హరియాణా, కశ్‌మ్రీŠ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన ఫలితాల విషయం ప్రస్తావించగా మరోసారి మాట్లాడతానన్నారు. యూపీలో ఉప ఎన్నికలు జరిగే 10 స్థానాలకు గాను కాంగ్రెస్‌ ఐదింటిని డిమాండ్‌ చేస్తోంది. ఈ పది చోట్ల ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో గెలవడంతో ఖాళీ అయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement