జూబ్లీహిల్స్‌లో విజయం మాదే: పొన్నం ప్రభాకర్‌ | minister Ponnam Prabhakar Interesting Comments On By election | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో విజయం మాదే: పొన్నం ప్రభాకర్‌

Jun 29 2025 1:27 PM | Updated on Jun 29 2025 2:52 PM

minister Ponnam Prabhakar Interesting Comments On By election

సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. విజయం కాంగ్రెస్‌ పార్టీదే అని చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటి నుండి గ్రౌండ్ లెవెల్‌లో ప్రణాళిక ద్వారా ముందుకు పోవాలని సూచించారు. ఇదే సమయంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుండి సన్నద్ధం కావాలి అని అన్నారు.

ఈరోజు హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ..‘జూలై నాలుగో తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సందర్భంగా సభను విజయవంతం చేయాలి. హైదరాబాద్‌లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి ముఖ్య నేతలు సభలో పాల్గొనాలి. సభ ఏర్పాట్లపై నేతలు, కార్యకర్తలు యాక్టివ్‌గా ఉండాలి. హైదరాబాద్‌లో పార్టీకి సంబంధించిన ఇష్యూ నా దృష్టికి వచ్చాయి.

దేవాలయ కమిటీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ, బోనాల చెక్కుల పంపిణీ తదితర ప్రోటోకాల్ సమస్యలపై చర్చించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న వారికి నామినేటెడ్ పోస్టులు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుండి సన్నద్ధం కావాలి. జీహెచ్‌ఎంసీ మేయర్ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. ప్రభుత్వ సంక్షేమమే కాంగ్రెస్‌ను గెలిపిస్తుంది’ అని వ్యాఖ్యలు చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement