కేసీఆర్‌ వెంటే ఉంటాం.. మళ్లీ సీఎం చేస్తాం: పువ్వాడ | Puvvada Ajay Kumar BRS Deeksha Diwas Khammam | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ వెంటే ఉంటాం.. మళ్లీ సీఎం చేస్తాం: పువ్వాడ

Nov 29 2026 1:11 PM | Updated on Nov 29 2026 1:16 PM

Puvvada Ajay Kumar BRS Deeksha Diwas Khammam

సాక్షి, ఖమ్మం: తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ చేపట్టిన దీక్ష చారిత్రాత్మకమని, ఆ పోరాటంతోనే ఢిల్లీ పార్టీల వెన్నులో వణుకు పుట్టి తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్‌ దీక్షా దివస్‌ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీలోనే కొనసాగుతున్న వారే అసలైన నాయకులు, కార్యకర్తలని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయినా కార్యకర్తలు అధైర్యపడకుండా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

అలాగే పార్టీ మారిన వారిని గుర్తుపెట్టుకున్నామని, భవిష్యత్తులో వారికి ఎలాంటి అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచి కేసీఆర్‌కు గురుదక్షిణగా అందిస్తామని, కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని  ధీమా వ్యక్తం చేశారు.

కాగా, తెలంగాణ ఉద్యమకారులపై తూటాలు పేల్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనని, అలాగే సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగునీరు, విద్యుత్‌ కొరతతో తెలంగాణను కరువు కోరల్లోకి నెట్టిందని  పువ్వాడ ఆరోపించారు.

ఇదీ చదవండి: కేసీఆర్‌ దీక్షకు 16 ఏళ్లు.. నేడు కరీంనగర్‌లో కేటీఆర్‌ భారీ సభ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement