కేసీఆర్‌ దీక్షకు 16 ఏళ్లు.. నేడు కరీంనగర్‌లో కేటీఆర్‌ భారీ సభ! | KTR Deeksha Diwas Karimnagar Meeting Telangana | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ దీక్షకు 16 ఏళ్లు.. నేడు కరీంనగర్‌లో కేటీఆర్‌ భారీ సభ!

Nov 29 2026 10:01 AM | Updated on Nov 29 2026 10:01 AM

KTR Deeksha Diwas Karimnagar Meeting Telangana

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా నేడు (నవంబర్‌ 29) దీక్షా దివస్‌ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ జిల్లాలో భారీ సభకు బీఆర్ఎస్‌ నేతలు ఏర్పాట్లు చేశారు. తిమ్మాపూర్‌ మండలం అల్గనూర్‌ వద్ద సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నాటి కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నేతలు గుర్తుచేసుకోనున్నారు. దీక్ష సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఉద్యమ జ్ఞాపకాలను సభలో ప్రస్తావించనున్నారు.

అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ, పాలనా పరిణామాలపైనా కేటీఆర్‌ మాట్లాడే అవకాశం ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపైనా తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీక్షా దివస్‌ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభకు బీఆర్ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నాయి.

ఇదీ చదవండి: డీలిమిటేషన్‌కు బీఆర్‌ఎస్‌ మద్దతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement