యూట్యూబ్‌ వీడియోల తొలగింపులో భారత్‌ టాప్‌ | India Tops Youtube Video Removals 34 Lakh Videos Deleted | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌ వీడియోల తొలగింపులో భారత్‌ టాప్‌

Nov 29 2026 9:08 AM | Updated on Nov 29 2026 9:08 AM

India Tops Youtube Video Removals 34 Lakh Videos Deleted

సాక్షి, హైదరాబాద్‌: యూట్యూబ్‌లో నిబంధనలకు విరుద్ధమైన వీడియోల తొలగింపులో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్య మన దేశం నుంచి అప్‌లోడ్‌ చేసిన 34.4 లక్షల వీడియోలను యూట్యూబ్‌ తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే సమయంలో తొలగించిన 1.1 కోట్ల వీడియోల్లో దాదాపు 31 శాతం భారత్‌ నుంచే అప్‌లోడ్‌ అయినవి కావడం గమనార్హం. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఈ సంఖ్య 28 శాతం పెరిగింది. 

అమెరికా 12.4 లక్షల వీడియోలతో రెండో స్థానంలో ఉండగా.. ఇండోనేషియా 9.2 లక్షలతో మూడో స్థానంలో నిలిచింది. యూట్యూబ్‌ తాజా పారదర్శకత నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తొలగించిన వీడియోల్లో 68.2 శాతం చిన్నారుల భద్రతకు భంగం కలిగించే కంటెంట్‌కు సంబంధించినవే. వేధింపులు, సైబర్‌ వేధింపులు, హింసాత్మక దృశ్యాలు, ప్రమాదకర చర్యలు, పోర్న్‌ వంటి అంశాలపై కూడా యూట్యూబ్‌ చర్యలు తీసుకుంది. తొలగించిన వీడియోల్లో 98.6 శాతం కంటెంట్‌ను ఆటోమేటెడ్‌ వ్యవస్థలే తొలుత గుర్తించాయి. 

ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు భారత ప్రభుత్వ విభాగాలు, పోలీసు సంస్థలు, న్యాయస్థానాల నుంచి గూగుల్‌కు 4,006 కంటెంట్‌ తొలగింపు అభ్యర్థనలు అందాయి. వాటిలో 3,399 యూట్యూబ్‌కు సంబంధించినవే. మొత్తం 65,091 అంశాలను తొలగించాలని భారత అధికారులు కోరగా.. స్థానిక చట్టాల కింద 19,883 అంశాలను గూగుల్‌ తొలగించింది. వాటిలో 17,700 యూట్యూబ్‌లో ఉన్నవే. అయితే ఇవి దేశవ్యాప్తంగా అందిన అభ్యర్థనలుగా ఆ సంస్థ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement