ఎంపీ సీఎం రమేష్‌ నివాసంలో రూ.18 లక్షలు చోరీ | MP CM Ramesh Hyderabad Residence 18 Lakh Cash Theft Jubilee Hills | Sakshi
Sakshi News home page

ఎంపీ సీఎం రమేష్‌ నివాసంలో రూ.18 లక్షలు చోరీ

Nov 29 2026 8:40 AM | Updated on Nov 29 2026 8:40 AM

MP CM Ramesh Hyderabad Residence 18 Lakh Cash Theft Jubilee Hills

హైదరాబాద్: ఎంపీ సీఎం రమేష్‌ నివాసంలో రూ.18 లక్షల నగదు చోరీకి గురైన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–65లోని ఎంపీ సీఎం రమేష్‌ నివాసంలో దేశ్‌ముఖ్‌ ప్రవీణ్‌కుమార్‌ హౌస్‌ హోల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇంటికి సంబంధించిన నగదు రసీదులు, చెల్లింపులు, సిబ్బంది వేతనాల పంపిణీ బాధ్యతలు అతనికి అప్పగించారు. రెండు రోజులుగా ప్రవీణ్‌కుమార్‌ కనిపించడం లేదు. మొబైల్‌ ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉంది. అతని నివాసానికి వెళ్లి విచారించినా ఆచూకీ లభించలేదు. ఎంపీ నివాసం నుంచి రూ.18 లక్షల నగదు తీసుకెళ్లినట్లు అనుమానం వ్యక్తంచేస్తూ ఎంపీ సహాయకుడు అనిల్‌ ఫిర్యాదు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement