నా కుమార్తె పేరు ఇండియా | Jonty Rhodes Daughter India Named After Love For Country | Sakshi
Sakshi News home page

నా కుమార్తె పేరు ఇండియా

Nov 26 2026 10:15 AM | Updated on Nov 26 2026 10:19 AM

Jonty Rhodes Daughter India Named After Love For Country

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌కు ఇండియా అంటే ఎంతో ఇష్టం. ఆ ప్రేమతోనే తన కుమార్తెకు ‘ఇండియా’ అని పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు. ముంబైలో తన కుమార్తె పుట్టడంతో ఆమెకు ఇండియా అని నామకరణం చేసినట్లు వెల్లడించారు.

కర్ణాటకలోని బీదర్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలకు జాంటీ రోడ్స్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా ఎంతో అందమైన దేశమని, ఇక్కడి సంస్కృతి, ప్రత్యేకతలు తనను ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పారు.

ఇండియాపై తనకు అమితమైన ప్రేమ ఉందని, దేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు. తన కుమార్తెకు ఇండియా అని పేరు పెట్టడం వెనుక కూడా ఇండియాపై ఉన్న అభిమానమే కారణమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement