దేశ ప్రగతిని ప్రపంచంలో ఏ శక్తి కూడా కోరుకోవడం లేదు: మోహన్ భాగవత్
ఛత్రపతి శంభాజీనగర్: ప్రపంచంలో ఏ శక్తి కూడా భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని రాష్రీ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ‘బలవంతుడే బతుకుతాడు’అనే సూత్రాన్ని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయని చెప్పారు. అయితే, తమను ద్వేషించే దేశాలకు సైతం సహాయం చేయాలని భారత్ భావిస్తోందని వ్యాఖ్యానించారు.
బుధవారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఐదో ‘పద్మా ఫెస్టివల్’ ప్రారం¿ోత్సవంలో మోహన్ భాగవత్ ప్రసంగించారు. ప్రపంచం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉందని అన్నారు. తమ ఆధిపత్యం ఎప్పటిలాగే కొనసాగాలంటే భారత్ అభివృద్ధి చెందకూడదని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని వెల్లడించారు. భారత్ ముందంజలో ఉండడం ఆయా దేశాలకు ఎంతమాత్రం ఇష్టం లేదన్నారు. ఒకవేళ భారత్ అభివృద్ధి చెందితే శక్తివంతమైన దేశాల దుకాణాలు మూతపడతాయని తేల్చిచెప్పారు.


