పార్లమెంట్‌ సెషన్‌కు సంసిద్ధంగా ఉండండి  | PM Narendra Modi orders to preparations for the Winter Session of Parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సెషన్‌కు సంసిద్ధంగా ఉండండి 

Nov 26 2026 5:20 AM | Updated on Nov 26 2026 5:20 AM

PM Narendra Modi orders to preparations for the Winter Session of Parliament

కేబినెట్‌ మంత్రులకు ప్రధాని మోదీ సూచన

డిసెంబర్‌ 15వ తేదీలోపు పార్లమెంట్‌ 

శీతాకాల సమావేశాలు ఆరంభమయ్యే అవకాశం ! 

న్యూఢిల్లీ: వచ్చే నెల 15వ తేదీలోపు మొదలయ్యే అవకాశమున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల కోసం ప్రతి ఒక్క మంత్రి సంసిద్ధంగా ఉండాలని కేబినెట్‌ మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. విదేశీ పర్యటన వంటివి పెట్టుకోకుండా అందరూ పార్లమెంట్‌ సమావేశాలకు హాజరై, అందుబాటులో ఉండాలని ప్రధాని సూచించారు. 

ఈసారి శీతాకాల సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశం బుధవారం జరిగిన కేబినెట్‌ భేటీలో చర్చకొచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సమావేశాలు ఏ తేదీన ప్రారంభమై, ఏ తేదీన పూర్తవుతాయనే విషయాలను త్వరలోనే పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయించనుంది. విపక్షాలు అడిగే ప్రశ్నలకు దీటుగా సమాధానం చెప్పేలా సన్నద్ధంగా ఉండాలని మంత్రులతో మోదీ అన్నట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాల తర్వాత ఆగస్ట్‌ 13వ తేదీన పార్లమెంట్‌ ఉభయసభలను నిరవధికంగా వాయిదాపడ్డాయి. 

కానీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ప్రోరోగ్‌ ప్రకటనను ప్రభుత్వం 103 రోజులు గడిచినా ఇప్పటిదాకా విడుదలచేయలేదు. దీంతో పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ, మహిళా రిజర్వేషన్ల చట్టసవరణ బిల్లులను ఏ క్షణంలోనైనా ప్రవేశపెట్టొచ్చనే ఉత్కంఠ నెలకొనడం తెల్సిందే. రాజ్యాంగ సవరణ బిల్లును తేవాలని ప్రభుత్వం యోచిస్తోందని గతంలోనే వార్తలొచ్చాయి. అయితే మూడు సీట్ల ఖాళీ తర్వాత ప్రస్తుతం లోక్‌సభలో 540 మంది సభ్యులున్నారు. కనీసం 361 మంది ఓటేస్తేగానీ బిల్లు ఆమోదం పొందదు. అధికార ఎన్‌డీఏ కూటమికి 320 మంది సభ్యుల బలముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement