తీవ్ర ఉద్రిక్తత.. హెచ్‌ఎండీఏ ఆఫీస్‌ దగ్గర బీఆర్‌ఎస్‌ ధర్నా | Brs Leaders Protest At Hmda Office | Sakshi
Sakshi News home page

తీవ్ర ఉద్రిక్తత.. హెచ్‌ఎండీఏ ఆఫీస్‌ దగ్గర బీఆర్‌ఎస్‌ ధర్నా

Nov 25 2026 12:45 PM | Updated on Nov 25 2026 12:47 PM

Brs Leaders Protest At Hmda Office

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, హుడా ట్రక్ పార్క్, మియాపూర్ భూముల వేలాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరిగింది. ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన మూసాపేట ట్రక్ పార్క్, కేపీహెచ్‌బీ, మియాపూర్‌లోని విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు విక్రయించొద్దంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వామపక్ష నాయకుల డిమాండ్‌ చేశారు.

ఈ నెల 27న హెచ్‌ఎండీఏ నిర్వహించనున్న ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సీపీఐ, సీపీఎం నాయకులు నిరసనకు దిగారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయం వద్ద వేల సంఖ్యలో చేరి, అక్కడి నుంచి హెచ్‌ఎండీఏ కార్యాలయానికి  హుడా ట్రక్ పార్క్ బాధితులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు తరలివచ్చారు. హెచ్‌ఎండీఏ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విపక్ష నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: విటమిన్‌ డీకి అసలైన మందు మధ్యాహ్న ఎండే!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement