బావమరిదిపై కత్తులతో దాడి | BAVA BAMMARDHI Incident In Hyderabad | Sakshi
Sakshi News home page

బావమరిదిపై కత్తులతో దాడి

Nov 29 2026 11:21 AM | Updated on Nov 29 2026 11:21 AM

BAVA BAMMARDHI Incident In Hyderabad

హైదరాబాద్‌: భార్యను పుట్టింటికి తీసుకెళ్లారన్న కక్షతో బావ తన సోదరుడితో కలిసి బామ్మర్దిపై కత్తులతో దాడి చేసిన సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కనే శనివారం ఉదయం జరిగింది. మాణిక్యమ్మ కాలనీకి చెందిన ప్రైవేట్‌ ఆర్టీసీ డ్రైవర్‌ సయ్యద్‌ అత్తర్‌ పాషా (43) సోదరి జరీనాకు, ఆటో డ్రైవర్‌ అప్సర్‌ ఖాన్‌తో 2020లో వివాహమైంది. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో జరీనా సోదరులు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. 

ఇందులో అత్తర్‌ పాషా ప్రమేయం ఉందని భావించిన అప్సర్‌ ఖాన్, అతని సోదరుడు ఫెరోజ్‌ ఖాన్‌ శనివారం ఉదయం డ్యూటీకి వచ్చిన అత్తర్‌ పాషాపై వెనుక నుంచి కత్తులతో దాడి చేశారు. తల, దవడ, చేతికి గాయాలైన బాధితుడు ఆర్టీసీ డిపోలోకి పరుగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, నిందితులు ఆటోలో పరారయ్యారు. గాయపడిన అత్తర్‌ పాషా ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్, ఆర్టీసీ డిపో పక్కపక్కనే ఉన్నాయి. స్టేషన్‌కు ఇంత సమీపంలో ఉన్నప్పటికీ నిందితులు కత్తులతో దాడి చేయడం స్థానికంగా చర్చనీయంగా మారింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement