500 రోజుల్లో కేసీఆర్‌ వస్తున్నారు: కేటీఆర్‌ | KCR is coming back in 500 days KTR | Sakshi
Sakshi News home page

500 రోజుల్లో కేసీఆర్‌ వస్తున్నారు: కేటీఆర్‌

Nov 29 2026 6:32 PM | Updated on Nov 29 2026 6:32 PM

 KCR is coming back in 500 days KTR

అలుగునూరు: మంచిని గెలిపించే స్ఫూర్తితో దసరా రోజు ఆయుధపూజ ఎలా చేసుకుంటామో మనం మళ్లీ మనం కథ చెప్పుకోవాల్సిన రోజు ఇది అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించిన బీఆర్ఎస్ దీక్షా దివస్ స్ఫూర్తి సభ నుంచి కేటీఆర్ మాట్లాడారు. 500 రోజుల్లో కేసీఆర్‌ వస్తున్నారని, కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

‘‘ఆత్మగౌరవాన్ని సానబెట్టుకునే సందర్భమిది. ఆరోజు ఇదే కరీంనగర్ గడ్డ మీద అగ్నిపర్వతం బద్దలైంది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయల్దేరిండు మన నాయకుడు. నేను సత్యాగ్రహం చేస్తానంటే అరెస్ట్ ఎలా చేస్తారని నాకు కేసీఆర్ ఎదురుతిరిగిండు. నవంబర్ 29న ఆరంభమైన ఆ 11 రోజుల దీక్ష ఒక ఉజ్వలమైన పోరాటం. తెలంగాణ సమాజం అంతా ఏకమై చేసిన ఓ మహోజ్వల పోరాటం అది. స్వరాజ్య పోరాటాన్ని తలపించేలా స్వరాష్ట్ర పోరాటం చూశాం. మా నాయిన చనిపోతాడని ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మమ్మల్ని బెదిరించిండు, మా అమ్మనూ బెదిరించిండు. కానీ, కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గలేదు.

కేసీఆర్ సత్యాగ్రహంతో డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. ఇవాళ మూడు ఫీట్లు లేనోడు కూడా ముప్పై ఫీట్లు ఎగురుతుండు. ఎవడి భిక్ష కాదు తెలంగాణ.. దీక్షతో వచ్చింది తెలంగాణ. చంద్రబాబులాంటోళ్లంతా అడ్డుపడి ఢిల్లీ ప్రకటనను ఆపిన్రు ఆనాడు. తెలంగాణాలో జనం వీరులే.. కానీ నాయకులే బానిసలై 60 ఏళ్లు తెలంగాణ ఆగమైంది. కేసీఆర్ అభిమన్యుడు కాదు అర్జునుడు. నవంబర్ 29 లేకుంటే.. డిసెంబర్ 9 లేదు.. డిసెంబర్ 9 లేకుంటే 2014 , జూన్ 2 తెలంగాణ ఏర్పాటు లేదు.

మూడు తరాలను ముంచిన వంచక పార్టీ కాంగ్రెస్. తెలంగాణ అమరవీరుల గురించి కాంగ్రెస్ మాట్లాడితే విడ్డూరంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల గురించి సోనియా తన ఆత్మకథలో ఏమైనా చెబుతుందేమోనని చూస్తే అలాంటిదేమీ లేదు. మన జీవనాడి కాళేశ్వరం మీద దాడి జరుగుతోంది’’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement