సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్ వద్ద ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన మహిళపై ఓ వ్యక్తి దాడికి తెగబడ్డాడు. నెయిల్ కట్టర్‌తో ఆమె గొంతు కోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లాలోని స్థానిక మార్కెట్ వద్ద పరిచయస్తులైన ఓ మహిళ, పురుషుడి మధ్య వాగ్వాదం జరుగుతుండటంతో.. గొడవను ఆపేందుకు వెంకటమ్మ అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వ్యక్తి నెయిల్ కట్టర్‌తో ఆమె గొంతుపై దాడి చేశాడు. దాంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది.
అయితే, గాయపడిన వెంకటమ్మను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకో.. లేకపోతే చస్తావు!


