50 బస్తాల ధాన్యాన్ని శుక్రవారం యార్డుకు తీసుకొచ్చాను. శనివారం కొనుగోలు చేయకపోవడంతో ఆదివారం వరకు ఇక్కడే ఉండాల్సి వస్తోంది. ఇంటి దగ్గర పశువులు, వ్యవసాయ పనులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాపైనే ఉంది. రైతుల ఇబ్బందులపై అధికారులకు, పాలకులకు కనీసం దయ లేకపోవడం బాధాకరం.
– నర్సింహ, రైతు, చౌదర్పల్లి
రైతులంటే ఇంత చిన్నచూపా
మార్కెట్కు వంద బస్తాల ధాన్యం తీసుకొచ్చాను. ఎన్నో కష్టాలు పడి పంట పండించి అమ్ముకునేందుకు వస్తే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రైతులపై ఆధారపడి వ్యాపారం చేసే వ్యాపారులు, హమాలీలు, అధికారులు రైతులకు ఇలాంటి పరిస్థితి కల్పించడం ఎంతవరకు న్యాయం? రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.
– బ్రహ్మానందరెడ్డి, రైతు, బోయిన్పల్లి
●


