తెలంగాణ రాకపోతే రేవంత్‌ సీఎం అయ్యేవారా? : హరీశ్‌రావు | Harish Rao Comments Deeksha Diwas Siddipet Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాకపోతే రేవంత్‌ సీఎం అయ్యేవారా? : హరీశ్‌రావు

Nov 29 2026 1:35 PM | Updated on Nov 29 2026 1:43 PM

Harish Rao Comments Deeksha Diwas Siddipet Telangana

సాక్షి, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంతో సిద్దిపేటకు విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు. అలాగే సిద్దిపేటలోని అంబేద్కర్‌ భవన్‌లోనే కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షను ప్రకటించారని గుర్తుచేశారు. దాంతోపాటుగా ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకున్న తర్వాతే బలిదానాలు జరిగాయని వ్యాఖ్యానించారు.

అదేవిధంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం కాకుండా సీఎం రేవంత్‌రెడ్డి.. ఏపీ కోసం పనిచేస్తున్నారని తీవ్రంగా విమర్శిస్తూ... తెలంగాణలో మళ్లీ రామరాజ్యం రావాలంటే కేసీఆర్‌ తిరిగి ముఖ్యమంత్రి కావాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్‌ నాయకత్వం మళ్లీ రావాల్సిన అవసరం ఎంతోగానో ఉందని ఈ సందర్భంగా హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కేసీఆర్‌ వెంటే ఉంటాం.. మళ్లీ సీఎం చేస్తాం: పువ్వాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement