అత్యధిక మార్కులు సాధించేలా దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

అత్యధిక మార్కులు సాధించేలా దృష్టి పెట్టాలి

Nov 29 2026 11:47 AM | Updated on Nov 29 2026 11:47 AM

కొండపాక(గజ్వేల్‌): ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేలా అధ్యాపకులు దృష్టి పెట్టాలని ఇంటర్మీడియెట్‌ జిల్లా విద్యాధికారి మాధవరావు పేర్కొన్నారు. కొండపాకలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను శనివారం సందర్శించారు. కళాశాల నిర్వహణతీరులను, అధ్యాపకులు హాజరు రిజిస్టరును, ప్రయోగశాలను పరిశీలించారు. ఫిబ్రవరిలో జరిగే ఇంటర్మీడియెట్‌ పరీక్షల నేపథ్యంలో కళాశాల అత్యధిక ఉత్తీర్ణత శాతం దక్కించుకునేలా ఎలాంటి ప్రణాళిక చేశారన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాల పేరు ముందంజలో నిలిచేలా చేపట్టాల్సిన విషయాలపై అధ్యాపకులతో సమావేశమై తగు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్స్‌, థియరీ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ అధ్యాపకులు అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియెట్‌ జిల్లా విద్యాధికారి మాధవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement